BigTV English

Money Laundering: టీడీపీ నేత సపోర్టుతో కొలంబియాలో కేసినో.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా..!

Money Laundering: టీడీపీ నేత సపోర్టుతో కొలంబియాలో కేసినో.. ఎంట్రీ ఫీజు ఎంతో తెలుసా..!

Money Laundering: క్యాసినో ఓ హైక్లాస్‌ జూదం. కొన్ని ప్రదేశాల్లో అది లీగల్‌. క్యాసినో అనగానే ముందుగా గుర్తొచ్చేది కొలంబో, లేదంటే నేపాల్. మన దగ్గర అయితే, గోవా, సిక్కిం గుర్తొస్తాయి. అయితే, దర్యాప్తు సంస్థల నిఘా నేపథ్యంలో బడా బాబులు దేశంలో క్యాసినో జోలికి పెద్దగా వెళ్లడం లేదు. విదేశాల్లో నిర్వహించే క్యాసినోలపైనే ఆసక్తి చూపుతున్నారు. క్యాసినో కోసం నేపాల్, శ్రీలంకకు అధికంగా వెళ్తున్నారు. అక్కడైతే విచ్చలవిడిగా ఏం చేసినా అంతా అఫీషియల్. ఈ క్రమంలోనే.. క్యాసినో నిర్వాహకులు స్పెషల్ ఆఫర్లతో వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.


బడా బాబుల హాబీలు క్యాసినో నిర్వాహకులకు వరంగా మారాయి. క్యాసినో కింగ్‌గా పేరు పొందిన హరి ఆంధ్రాలోని రాజకీయ నాయకులు, బడా పారిశ్రామిక వేత్తలకు గాలం వేశాడు. ఈ క్రమంలో కొలంబోలో భారీ క్యాసినోకు ప్లాన్ చేశాడు హరి. తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో ఆడే బెట్టింగ్ బంగార్రాజులు చాలామందే ఉన్నారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో బంగార్రాజుల సంఖ్య అధికం. ఫేమస్‌ పొలిటీషియన్స్‌, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు విదేశాల్లో తరచూ క్యాసినో ఆడటానికి ఇష్టపడుతుంటారు. ఈ పరిస్థితుల్ని క్యాసినో కింగ్‌ బాగా క్యాష్‌ చేసుకునేందుకు సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలోనే ఆ బెట్టింగ్ రాయుళ్లను కొలంబోకు రమ్మని ఆహ్వానించాడు హరి. భారీ ఈవెంట్ అంటూ ప్రకటనలు కూడా ఇచ్చాడు. పెద్ద ఎత్తున పంటర్స్‌ను తరలించే ప్లాన్ చేశాడు. బెట్టింగ్ రాయుళ్ల కోసం కొలంబోకు స్పెషల్ ఫ్లైట్స్ కూడా ఏర్పాటు చేసి తీసుకెళ్తున్నాడు.

ఇక హరి నిర్వహించే క్యాసినో ఈవెంట్ వెనుక TDP ఎమ్మెల్యే ప్రోత్సాహం ఉన్నట్టు సమాచారం. ప్రత్యేకించి TDP ఎమ్మెల్యేలు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్, ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖుల కోసం ఈ కొలంబో క్యాసినో ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. హరి ప్రధాన అనుచరులు కృష్ణంరాజు, లచ్చ ఇప్పటికే కొలంబో చేరుకున్నట్టు క్యాసినో సర్కిల్స్ నుంచి సమాచారం అందింది. జనవరి 24, 25, 26, 27 తేదీలలో కొలంబో క్యాసినో ఈవెంట్ అంటూ ప్రకటన ఇచ్చాడు. అడ్వాన్సుల రూపంలోనే 16 కోట్ల రూపాయలు వచ్చాయని సమాచారం. హరి క్యాసినో ఈవెంట్లో పాల్గొనాలంటే డబ్బులు దండిగా ఉండాల్సిందే. కనీసం 2 లక్షల నుంచి మొదలుకొని 25 లక్షల రూపాయల వరకు డబ్బు ఉంటేనే గేమ్ లోపలికి అనుమతిస్తాం అంటూ ప్రకటన చేశాడంటేనే అర్థం చేసుకోవచ్చు.


Also Read: జనసేన వర్సెస్ వైసీపీ.. లైన్ క్రాస్ చేసి మరీ విమర్శలు!

కేవలం 16 కోట్ల రూపాయల ఈవెంట్ కోసం అడ్వాన్స్ రూపంలోనే తీసుకున్నాడు హరి. 180 మందికి రెండు స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి కొలంబో తీసుకెళ్తున్నాడు. థాయిలాండ్ నుంచి వంద మంది అమ్మాయిలను క్యాసినోలో డ్యాన్స్ చేయించేందుకు తీసుకొచ్చినట్టు సమాచారం. మద్యం, విందు, చిందు, పొందు అంటూ బహిరంగ ప్రకటనే చేశాడు. ఈవెంట్‌పై దర్యాప్తు సంస్థల నజర్ క్యాసినో ఈవెంట్ నేపథ్యంలో ఏపీ నుంచి కొలంబోకు భారీగా మనీ లాండరింగ్ కోసం స్కెచ్ గీసినట్టు సమాచారం.

కోట్ల రూపాయిలు చేతులు మారే అవకాశాలు ఉండడంతో ఈడీ, ఐటీ నజర్ పెట్టాయి. క్యాసినోకు వెళ్లే బెట్టింగ్ బంగార్రాజులను గుర్తించే పనిలో పడ్డాయి. ఇందులో పాల్గొనే వారిపై నిఘా పెట్టి నోటీసులు ఇచ్చేందుకు ఈడీ సిద్ధమైంది. రాజమండ్రి, విశాఖపట్నం నుంచి స్పెషల్ ఫ్లైట్స్ బుక్ చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో, కొలంబో వెళ్లే వారి వివరాలు సేకరిస్తోంది ఈడీ. ఇటు, హరి పోలీస్ రికార్డ్స్ బయటకు తీస్తోంది. ఎన్ని సార్లు ఈవెంట్స్ పెట్టాడు, ఎక్కడ పెట్టాడు, ఎంత సంపాదించాడనే వివరాలను ఈడీ బయటకు తీస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×