Ben Stokes Injury: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయపడ్డాడు. దీంతో ఛాంపియన్ ట్రోఫీ – 2025, దానికి ముందు టీమ్ ఇండియాతో జరిగే కీలకమైన వైట్ బాల్ సిరీస్ లకు బెన్ స్టోక్స్ జట్టు నుండి దూరమయ్యాడు. అతని తొడ కండరాలలో చీలిక ఏర్పడింది. దీంతో మూడు నెలల పాటు క్రికెట్ కి దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ గాయం కారణంగా అతని కెరీర్ కి కీలకమైన సమయంలో ఇంగ్లాండ్ జట్టును ప్రభావితం చేస్తోంది.
Also Read: Ayodhya Cricket Stadium: అయోధ్యలో సిద్ధమైన అంతర్జాతీయ స్టేడియం..కేపాసిటీ ఎంతంటే ?
స్టోక్స్ కి తొడ కండరాలకు వచ్చే నెలలో సర్జరీ జరగనుంది. దీనిపై ఈసీబీ ఓ ప్రకటనలో తెలిపింది. హమిల్టన్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన మూడవ టెస్ట్ సమయంలోనే స్టోక్స్ గాయపడ్డాడు. ఫిబ్రవరిలో పాకిస్తాన్ లో ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రకటించిన జట్టులో స్టోక్స్ కి చోటు దక్కలేదు. గతంలో కూడా ఈ కండరాల సమస్యతో బాధపడ్డాడు స్టోక్స్. ఈ కారణంగానే శ్రీలంకతో జరిగిన హోమ్ సిరీస్, పాకిస్తాన్ తో జరిగిన ఫస్ట్ టెస్ట్ కి దూరమయ్యాడు. ఇప్పుడు మరోసారి అదే సమస్యతో 33 ఏళ్ల స్టోక్స్ కి విశ్రాంతి కల్పించారు.
ఇంగ్లాండ్ అండ్ వేల్స్ (ఈసీబీ) క్రికెట్ బోర్డ్ ఆదివారం రోజున జోస్ బట్లర్ నేతృత్వంలోని 15 మందితో కూడిన వన్డే జట్టును ప్రకటించింది. ఈ జట్టులో బ్యాటర్ జో రూట్ తిరిగి వన్డే జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇతడు చివరిసారిగా గత ఏడాది వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ కి ప్రతినిత్యం వహించాడు. గాయం కారణంగా కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉంటున్న ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ కూడా ఈ జట్టులో స్థానం సంపాదించాడు.
అలాగే వికెట్ కీపర్లు జేమీ స్మిత్, ఫీల్ సాల్ట్, రైజింగ్ స్టార్ జేకబ్ బేతేల్ కూడా వన్డే, టి20 జట్లలో చోటు దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ, భారత్ టూర్ కు ఎంపికైన ఇంగ్లాండ్ వన్డే జట్టు : జోష్ బట్లర్ (కెప్టెన్), అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, జాకబ్ బేథెల్, బ్రైడన్ కార్సే, హ్యారీ బ్రూక్, బెన్ డక్కెట్, జేమీ స్మిత్, జేమి ఓవర్టన్, లివింగ్ స్టోన్, జో రూట్, ఆదిల్ రషీద్, సాకీబ్ మహమ్మద్, ఫీల్ సాల్ట్, మార్క్ వుడ్. ఇక భారత్ తో ఇంగ్లాండ్ 5 t-20 లు, మూడు వన్డేలు ఆడబోతుంది.
Also Read: MS Dhoni: ధోని క్రికెట్ ప్రస్థానానికి నేటితో 20 ఏళ్లు!
జనవరి 20 నుండి మొదటి ఐదు టి-20 మ్యాచ్ లు జరగనున్నాయి. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జనవరి 22న మొదటి టీ-20 జరగబోతోంది. ఇక చెన్నైలోని చిదంబరం స్టేడియంలో రెండో టి20 జనవరి 25, రాజ్కోట్ లోని నిరంజన్ షా స్టేడియంలో మూడవ టి20 జనవరి 28, పూణేలోని ఎంసీఏ స్టేడియంలో నాలుగవ టి20 జనవరి 31, ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఐదవ టి20 ఫిబ్రవరి 22న జరగబోతున్నాయి. ఇక వన్డేల విషయానికి వస్తే.. నాగపూర్ వేదికగా విసిఎ స్టేడియంలో మొదటి వన్డే ఫిబ్రవరి 6న జరగబోతోంది. కటక్ వేదికగా బారాబతి స్టేడియంలో రెండవ వన్డే ఫిబ్రవరి 9న, అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో మూడవ వన్డే ఫిబ్రవరి 12న జరగబోతోంది.