MS Dhoni Retirement: క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ మహేంద్రసింగ్ ధోని సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అధికారికంగా తమ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఐపీఎల్ టోర్నమెంట్ కు గుడ్ బై చెప్పిన మహేంద్రసింగ్ ధోని.. ఇకపై తమ జట్టు మెంటార్ గా కనిపించబోతున్నట్టు అనౌన్స్ చేసింది.
మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) లేకుండా అసలు చెన్నై సూపర్ కింగ్స్ లేదని… గత రెండు దశాబ్దాలుగా తమతో కలిసి అతడు ప్రయాణించాడని ఓనర్ శ్రీనివాసన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎప్పటికీ ధోని సొంత ఇల్లేనని ఎమోషనల్ అయ్యాడు. ఇక ధోని తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో అతని అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు మహేంద్రసింగ్ ధోనీకి బీసీసీఐ ఫేర్వెల్ మ్యాచ్ నిర్వహించలేదని.. ఇప్పుడు అదే తప్పు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా చేసిందని కొంతమంది అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇంత గొప్ప లెజెండ్ క్రికెటర్ కు ఫేర్వెల్ మ్యాచ్ ఉండి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా మహేంద్ర సింగ్ ధోనీ లాంటి క్రికెటర్ ఐపీఎల్ ఆడకపోతే.. దాని ప్రభావం వ్యూయర్షిప్ పైన కచ్చితంగా పడుతుందని అంటున్నారు.
మహేంద్ర సింగ్ ధోని (Ms Dhoni ) కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ( CSK) ఎన్నో రికార్డులు, టైటిల్స్ అందుకుంది. అతని కెప్టెన్సీలో మొత్తం ఐదు ఐపీఎల్ ట్రోఫీలు అందుకున్న చెన్నై సూపర్ కింగ్స్… అలాగే రెండు ఛాంపియన్స్ లీగ్ టి20 టైటిల్స్ కూడా సొంతం చేసుకుంది. అంటే మొత్తంగా ఏడు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఛాంపియన్ గా నిలిపాడు. ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్థాయిలో పది సార్లు ఫైనల్ కు తీసుకువెళ్లిన ఏకైక మొనగాడు ధోనీనే. ఏడవ వికెట్ కు బ్యాటింగ్ చేసినప్పటికీ.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును చాలా సార్లు సింగిల్ హ్యాండ్ తో గెలిపించాడు. కెప్టెన్ గానే కాకుండా బెస్ట్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. ధోని 40 సంవత్సరాలు దాటడం, వరుసగా గాయాలు వేధించడంతో రిటైర్మెంట్ తీసుకుంటూ సంచలన ప్రకటన చేశాడు ధోని. ఇక వచ్చే సీజన్ నుంచి చెన్నై జట్టుకు మెంటార్ గా సేవలు అందించనున్నాడు.
OFFICIAL ANNOUNCEMENT 🦁💛
A once-in-a-lifetime player.
A new role. A bond that lasts forever 💛
Mahendra Singh Dhoni takes charge as the Team Mentor of Chennai Super Kings!
Through countless victories, challenging times, and memories that will stay in our hearts forever, MS… pic.twitter.com/TA5Qfrq4dI
— Chennai Super Kings (@ChennaiIPL) November 17, 2026