E-Paper
Advertisement

షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భార‌త్, పాక్ కెప్టెన్లు..అంధుల ఆసియా క‌ప్ పై ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!

షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న భార‌త్, పాక్ కెప్టెన్లు..అంధుల ఆసియా క‌ప్ పై ఇంజ‌మామ్ సంచ‌ల‌నం!
Advertisement

Inzamam-ul-Haq On IND VS PAK handshakes:  అంధుల T20 ఆసియా కప్ 2026 టోర్నమెంటు చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. అయితే ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ దాయాదుల పోరు జరుగుతోంది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా అన్వీర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య అంధుల మ్యాచ్ షురూ అయింది. అయితే ఇందులో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా పాకిస్తాన్, టీమిండియా కెప్టెన్లు ఇద్దరు షేక్ హ్యాండ్ (IND VS PAK handshakes) ఇచ్చుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. దీనిపై రకరకాల కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆంధుల‌ను చూసైనా బీసీసీఐ క‌ళ్లు తెర‌వాలంటూ ఇంజ‌మామ్ ఫైర్!

అంధుల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా టీమిండియా, పాకిస్తాన్ కెప్టెన్లు ఇద్దరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడంపై మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ రియాక్ట్ అయ్యాడు. అంధులు అయినప్పటికీ క్రీడా స్ఫూర్తిని నిలిపారని మెచ్చుకున్నాడు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో… వాటిని పక్కకు పెట్టి షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం ప్రసంశించదగ్గ విషయమని తెలిపాడు. క్రీడాలు, రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదాలకు సంబంధం పెట్టకూడదని కోరాడు.

Advertisement

Fatima Sana Ahead Of Babar Azam? Ex-Pakistan Selector’s Explosive Verdict Sparks Debate : ఫాతిమా ప్రవాహంలో స్మృతి, హర్మన్ కొట్టుకుపోతారు..WPL వేలంలో సనా రూ.10 కోట్లు పలకడం పక్కా!

కానీ అనవసరంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి..రెండు దేశాల స‌మ‌స్య‌ను క్రికెట్ పై రుద్దుతోంద‌నిమండిపడ్డాడు. అంధుల క్రికెట్ చూసైనా బీసీసీఐ కళ్ళు తెరవాలని చురకలు అంటించాడు. భవిష్యత్తులో టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగే అంతర్జాతీయ మ్యాచులలో ఇరు జట్ల కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకునేలా బీసీసీఐ ముందుకు రావాలని కోరాడు. అంతేకాదు రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు కూడా జరిగేలా ఒప్పందం కోసం బీసీసీఐ ముందుకు రావాలని ఇంజ‌మామ్ రిక్వెస్ట్ చేశాడు.

అంధుల T20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ షెడ్యూల్

Advertisement

అంధుల టీ20 ఆసియా కప్ 2026 టోర్నమెంట్ కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇస్తోంది. ఈ టోర్నమెంట్ నవంబర్ 15వ తేదీన ప్రారంభమైంది. టీమిండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఇందులో పాల్గొంటున్నాయి. నవంబరు 15వ తేదీన ఈ టోర్నమెంట్ ప్రారంభం కాగా ఫైనల్ మ్యాచ్ ఈనెల 20వ తేదీన ఉంటుంది. ఈ ఐదు జట్లలో టాప్ లో నిలిచిన మొదటి రెండు టీమ్స్ మధ్య ఫైనల్స్ ఉంటుంది. ఇక ఇవాళ టీం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. మొదటి మ్యాచ్ లో శ్రీలంక పై టీమిండియా 179 పరుగుల తేడాతో విక్టరీ అందుకుంది.

Months After Mustafizur Rahman Controversy, 7 Bangladesh Players Register For IPL 2027 Auctionఐపీఎల్‌లోకి బంగ్లాదేశ్ క్రికెటర్లు రీ-ఎంట్రీ…బీసీసీఐ పెద్దలను తరిమికొట్టాలంటూ ట్రోలింగ్ ?

Related News

ఆర్య‌వీర్, సెహ్వాగ్ ఇద్ద‌రూ దొంగ‌లే..వీడియో కాల్ పేరుతో పాకిస్తాన్ ను బ‌క‌రా చేశారు

కావ్య పాపకు ఎదురుదెబ్బ‌…IPL 2027 నుంచి ట్రావిస్ హెడ్ ఔట్ ?

మొహ్సిన్ న‌ఖ్వీకి బిగ్ షాక్…ఏసీసీ ఛైర్మ‌న్ గా ఏసీసీ ఛైర్మన్ తమీమ్ ఇక్బాల్ ?

బ్యాట్ల‌ల్లో స్ప్రింగులు పెట్టి టీమిండియా గెలిచింది…ర‌మీజ్ రాజా ఆరోప‌ణ‌లు!

అండ‌ర్ 19 పాకిస్తాన్ కుర్రాళ్ల బ‌ర్త్ సర్టిఫికెట్లు చెక్ చేయాలి…దినేష్ కార్తీక్ సంచ‌ల‌నం

ధోనికి రూ.4 కోట్లు దండగా, అత‌న్ని వెంట‌నే వ‌దిలించుకోండి..అశ్విన్ సంచ‌ల‌నం

ఆసియా క‌ప్ హీరో ఆర్య‌వీర్ క‌న్నీటిగాథ‌..రెండేళ్లుగా విడిగా ఉంటున్న త‌ల్లిదండ్రులు!

Big Stories

Advertisement
×