BigTV English

DGCA fined Rs.30 lakhs: ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా.. తగినన్ని వీల్‌ఛైర్‌లు అందించాలని డీజీసీఏ ఆదేశాలు..

DGCA fined Rs.30 lakhs: ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా.. తగినన్ని వీల్‌ఛైర్‌లు అందించాలని డీజీసీఏ ఆదేశాలు..

DGCA fined Rs.30 lakhs to Air India


DGCA fined Rs.30 lakhs to Air India: విమాన సేవల్లో అలసత్వం వహించినందుకు ఎయిరిండియాకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ రూ.30 లక్షల జరిమానా విధించింది. విమానయాన సంస్థకు వీల్‌ఛైర్‌ కొరతతో విమానం నుంచి టెర్మినల్‌ బిల్డింగ్‌ వరకు నడిచిన 80 ఏళ్ల వృద్ధ ప్రయాణికుడు మరణించిన విషయం తెలిసిందే.

ఓ వృద్ధ దంపతులు అమెరికా నుంచి ఎయిరిండియా విమానంలో ముంబయికి వచ్చారు. ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయంలో ఫిబ్రవరి 12న దిగారు. వీల్‌ఛైర్‌ సదుపాయం లేక ఆ వృద్ధుడు విమానం నుంచి టెర్మినల్‌ బిల్డింగ్‌ వరకు నడుచుకుంటూ వచ్చి.. ఒక్కసారిగా కుప్పుకూలిపోయారు.


ఘటనకు స్పందించిన సిబ్బంది వెంటనే ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ వృద్ధుడు మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ) ఎయిర్‌క్రాఫ్ట్ రూల్స్ 1937 ప్రకారం ఎయిరిండియాపై రూ. 30 లక్షల జరిమానా విధించింది.

Read More: టీఎంసీ నేత షేక్ షాజహాన్ అరెస్ట్.. 10 రోజుల పోలీసు కస్టడీ..

అనంతరం షోకాజ్‌ నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 20న ఈ నోటీసుకు ఎయిరిండియా తన ప్రతిస్పందనను సమర్పించింది. వృద్ధ ప్రయాణికుడి భార్యకు ఒక వీల్‌ఛైర్‌ ఇచ్చారని మరో వీల్‌ఛైర్‌ ఇచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఆయనకు తెలిపామన్నారు. ఆ వృద్ధుడు తమ మాట వినకుండా టెర్మినల్‌ దాక నడిచి వెళ్లారని వివరణ ఇచ్చింది.

దీంతో డీజీసీఏ ఎయిరిండియాకు రూ. 30 లక్షలు జరిమానా విధించింది. ప్రయాణ సమయంలో విమానం ఎక్కేటప్పుడు లేదా దిగే సమయంలో సహాయం అవసరమయ్యే ప్రయాణికుల కోసం తగిన సంఖ్యలో వీల్‌చైర్లు అందుబాటులో ఉండేలా అన్ని ఎయిర్‌లైన్స్‌లకు ఒక సలహా కూడా జారీ చేసింది.

Tags

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×