Ashwin-Babar : టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ డిసెంబర్ 2024లో తన రిటైర్మెంట్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అతను బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియా తో గబ్బాలో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ అనంతరం ఈ సంచలన నిర్ణయం తీసుకున్నాడు అశ్విన్. ఇటీవలే దీనికి గల కారణాన్ని ఓ యూట్యూబ్ ఛానల్ లో వెల్లడించాడు. గత నెలలోనే ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ అయినట్టు ప్రకటించాడు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. కానీ తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. అశ్విన్ బిగ్ బాష్ లీగ్ లోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వనున్నాడనే వార్త వైరల్ అవుతోంది. ఒకవేళ ఙదే కనుక నిజమైతే భారత క్రికెట్ చరిత్రలోనే కొత్త ట్రెండ్ ప్రారంభమైనట్టేనని చెప్పవచ్చు.
Also Read : Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!
ముఖ్యంగా టీమిండియా క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ పేరు వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది అతని స్పిన్ బౌలింగే. తన స్పిన్ బౌలింగ్ తో సత్తా చాటాడు. టెస్ట్ క్రికెట్ తో పాటు, ఐపీఎల్ లో తన టాలెంట్ ను నిరూపించుకున్న ఈ ఆటగాడు ఎప్పుడూ సరికొత్త ట్రిక్స్ తో ప్రత్యర్థులను కంగారు పెట్టిస్తుంటాడు. మరోవైపు వన్డే వరల్డ్ కప్ 2011 టీమ్ లో కూడా అశ్విన్ ఉన్నాడు. ఇక ఆ తరువాత టీమిండియాలో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ఆయా జట్లు విజయం సాధించడంలో అశ్విన్ కీలకపాత్ర పోషించాడు. వాస్తవానికి ప్రపంచ క్రికెట్ లో ఐపీఎల్ తరువాత అత్యంత ఆదరణ ఉన్న టోర్నీ ఎదైనా ఉందంటే.. అది బిగ్ బాష్ లీగ్ అనే చెప్పవచ్చు.
అయితే ఆస్ట్రేలియా ఈ లీగ్ ను ప్రతీ సంవత్సరం డిసెంబర్ నుంచి జనవరిలో నిర్వహిస్తుంటుంది. అయితే భారత ఆటగాళ్లు విదేశీ లీగ్ ల్లో ఆడటానికి అనుమతి లేదు. అలా ఆడాలనుకుంటే పూర్తి స్థాయిలో ఇండియన్ క్రికెట్ కి దూరం అయినప్పుడే ఈ లీగ్ లో ఆడే అవకాశం ఉంటుంది. అలాగే బీసీసీఐ సంబంధించిన ఎలాంటి లీగ్స్, టోర్నీలో ఆడటానికి వీలు ఉండదు. అశ్విన్ ఇటీవల ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించడంతో అతను ఫారిన్ లీగ్ ల్లో ఆడే అవకాశం ఉంటుంది. దీంతో అశ్విన్ బీబీఎల్ ఆడుతున్నాడని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు సిడ్నీ సిక్సర్స్ జట్టులోకి వెళ్తాడని సమాచారం. ఆ లీగ్ లో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా ఉన్నాడు. దీంతో పాకిస్తాన్ తో ఇప్పటికే టీమిండియా పలు మ్యాచ్ లను రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా అశ్విన్ పాకిస్తాన్ క్రికెటర్ ఉన్న టీమ్ లో ఆడుతున్నాడనే వార్త వైరల్ అవుతోంది. అశ్విన్ ఆలీగ్ లో ఆడుతాడో లేదో అనేది మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.