Viral Video: అహ్మదాబాద్ ఎయిరిండియా విమానం ఘటన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాలు, హెలికాఫ్టర్ల ప్రమాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా మలేషియాకి చెందిన ఓ హెలికాఫ్టర్ ట్రావెల్ చేస్తూ జోహోర్ పులాయ్ నదిలో కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
మలేషియా-సింగపూర్-ఇండోనేషియా-థాయ్‌లాండ్‌లు మిత్సతోమ్-2025 పేరుతో అణు భద్రతా పరిశోధనా కసరత్తు చేస్తున్నాయి. ఈ ప్రారంభ కార్యక్రమంలో ఆయా దేశాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. మాక్ డ్రిల్‌లో భాగంగా తంజుంగ్ కుపాంగ్ పోలీస్ స్టేషన్ నుంచి మలేషియాకు చెందిన ఓ హెలికాప్టర్ బయలు దేరింది.
గెలాంగ్ పటాలోని మలేషియా మారిటైమ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ జెట్టీ సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. వెంటనే నదిలో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు అధికారులతోపాటు ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు ఆదేశ విమానయాన శాఖ వర్గాలు తెలిపాయి.
ఘటన జరిగిన వెంటనే సమీపంలోని రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. పైలట్‌తోపాటు ఐదుగురిని రక్షించాయి. ఘటనలో హెలికాఫ్టర్ లో ఐదుగురు సిబ్బంది ఉన్నారు. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ALSO READ: మధ్యాహ్నం ఒంటి గంటయితే పాపం.. ఎక్కడివాళ్లు అక్కడే నిద్రపోతారు
హెలికాప్టర్ సర్వీసు అయిపోయిందనే వాదనలు మొదలయ్యాయి. దీనిపై ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ దాతుక్ సెరి మొహమ్మద్ ఖలీద్ ఇస్మాయిల్ మాట్లాడారు. సర్వీసు అయిపోయిందనే వాదన సరికాదన్నారు. ఫ్రెంచ్ ఎయిర్‌బస్ నిర్మించిన యుటిలిటీ హెలికాప్టర్.
దీనిని ప్రైవేట్ వ్యక్తులు, కంపెనీలు ఆపరేట్ చేస్తున్నాయి. ప్రైవేట్ హెలికాప్టర్ ప్రభుత్వ సేవలకు ఉపయోగిస్తాయి. మలేషియా రవాణా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎయిర్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో విచారణ మొదలుపెట్టింది.
నదిలో కూలిన హెలికాప్టర్… వీడియో
మలేషియాలోని జోహోర్లో చోటు చేసుకున్న విషాదం
పులాయ్ నదిలో కూలి పడిపోయిన ఓ పోలీస్ హెలికాప్టర్
ఈ ఘటనలో ఇద్దరు సీనియర్ పోలీస్ అధికారులు సహా ఐదుగురికి గాయాలు
వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం
మాక్ డ్రిల్ సమయంలో ఈ ఘటన చోటు… pic.twitter.com/NZ8KkfNEYm
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2025