RCB Team: ఐపీఎల్ 2025లో భాగంగా నేడు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల ఆసక్తికర పోరు జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఆర్సిబి జట్టు రెండు రోజుల క్రితమే చెన్నైకి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్ కోచ్ దినేష్ కార్తీక్ ఆర్సిబి జట్టుకు చెన్నైలోని తన నివాసంలో అతిథ్యం ఇచ్చారు. గురువారం రోజు ఆర్సిబి జట్టు, సహాయక సిబ్బంది దినేష్ కార్తీక్ నివాసానికి వెళ్ళింది.
ఈ నేపథ్యంలో దినేష్ కార్తీక్ తన నివాసంలోని లాన్ లో ఆహారం, పానీయాలతో గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేశారు. ఆర్సిబి ప్లేయర్స్ కొందరు స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేశారు. వివిధ రకాల వంటకాలతో వారికి విందు ఏర్పాటు చేశారు డీకే. ఇందుకు సంబంధించిన వీడియోని దినేష్ కార్తీక్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఈ నేపథ్యంలో దినేష్ కార్తీక్ ఇంట్లో ఆర్సీబీ ప్లేయర్లు సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక 2024 ఐపీఎల్ లో ఆర్సిబి జట్టుకు ప్రాతినిధ్యం వహించిన దినేష్ కార్తీక్.. సీజన్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించారు. ఆ తరువాత ఆర్సిబికి బ్యాటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభ ఎడిషన్ నుండి ఆడిన అతి కొద్ది మంది ఆటగాళ్లలో దినేష్ కార్తీక్ ఒకరు. అంతేకాకుండా ఐపీఎల్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ రెండవ స్థానంలో ఉన్నారు. దినేష్ కార్తీక్ తన కెరీర్ లో 257 మ్యాచులు ఆడి 4,842 పరుగులు చేశాడు.
ఇందులో 22 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక ఈ 257 మ్యాచ్లలో 45 క్యాచ్ లు, 37 స్టంప్స్ ఉన్నాయి. కాగా ఈ సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్లు విజయాలతో ఆరంభించాయి. ఇప్పుడు అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాయి. చెపాక్ మైదానంలో ఆర్సిబిపై ఘనమైన రికార్డు ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంది. ఓవైపు మహేంద్రసింగ్ ధోని, మరోవైపు విరాట్ కోహ్లీ ఆడుతుండడంతో అభిమానులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ 2024 లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది.
గెలిచిన జట్టుకు ప్లే ఆఫ్ ఛాన్స్ ఉండడంతో ఇరుజట్ల మధ్య పోరు రసవత్తరంగా సాగింది. హై టెన్షన్ మ్యాచ్లో విజయం ఆర్సిబిని వరించగా.. చెన్నై సూపర్ కింగ్స్ ఇంటిదారి పట్టింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఆ మ్యాచ్లో ఆర్సిబి సెలబ్రేషన్స్ తరస్థాయికి చేరుకున్నాయి. ఇక ఈ ఇరుజట్ల బలాబలాలు, గత మ్యాచ్ ల విశ్లేషణలను పరిశీలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో చెన్నై – ఆర్సిబి మధ్య ఇప్పటివరకు 33 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో చెన్నై 21సార్లు విజయం సాధించగా.. ఆర్సిబి 11 విజయాలు మాత్రమే సాధించింది. మరొక మ్యాచ్ ఫలితం తేలలేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">