BigTV English

Sreeleela: ‘నువ్వే నా జీవితం’.. కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల రొమాంటిక్ మూమెంట్

Sreeleela: ‘నువ్వే నా జీవితం’.. కార్తిక్ ఆర్యన్‌తో శ్రీలీల రొమాంటిక్ మూమెంట్

Sreeleela: ఆఫ్ స్క్రీన్ ఒక హీరో, హీరోయిన్ క్లోజ్‌గా కనిపించారంటే చాలు.. వారి మధ్య ఏదో ఉందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. చాలావరకు అలాంటి రూమర్స్ నిజమే అయినా కొన్ని మాత్రం కేవలం రూమర్స్ వరకే మిగిలిపోతాయి. బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా ఈ రూమర్స్ అంతటా కామన్. తాజాగా యంగ్ సెన్సేషన్ శ్రీలీలపై కూడా అలాంటి రూమర్సే వినిపిస్తున్నాయి. గత రెండేళ్లుగా టాలీవుడ్‌లో తన యాక్టింగ్‌తో, డ్యాన్స్‌తో ఓ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన శ్రీలీల ఇక్కడ ఉన్నంత వరకు తనపై ఎలాంటి రూమర్ రాలేదు. అలాంటిది బాలీవుడ్‌లో డెబ్యూ అనగానే ఒక యంగ్ హీరోతో ప్రేమలో పడిందంటూ పుకార్లు మొదలయ్యాయి.


కెమిస్ట్రీ అదుర్స్

కార్తిక్ ఆర్యన్‌తో చేస్తున్న సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అవ్వనుంది శ్రీలీల. ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యింది. ఇందులో శ్రీలీల, కార్తిక్ ఆర్యన్ కెమిస్ట్రీ అదిరిపోయిందని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. ఈ మూవీ టైటిల్ ఏంటని మేకర్స్ అధికారికంగా ప్రకటించకపోయినా ఇది ‘ఆషిఖీ 3’ అనే చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు. దీని గ్లింప్స్ విడుదలయిన కాసేపట్లోనే తెగ వైరల్ అయ్యి ఇందులో ఇద్దరి పెయిర్ బాగుందని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అసలు కథ అప్పుడే మొదలయ్యింది. ఈ కెమిస్ట్రీ చూసే కార్తిక్ ఆర్యన్, శ్రీలీల మధ్య ఏదో ఉందని సందేహపడిన ప్రేక్షకులు.. ఒకానొక సందర్భంలో అది నిజమే అని ఫిక్స్ అయిపోయారు.


అలా మొదలయ్యింది

కార్తిక్ ఆర్యన్ ఫ్యామిలీ పార్టీలో శ్రీలీల కనిపించింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఆ హీరో ఫ్యామిలీ పార్టీలో శ్రీలీలకు ఏం పని, ఎందుకు వెళ్లింది, ఒకవేళ వీరిద్దరూ లవ్‌లో ఉన్నారా అనే సందేహాలు అందరిలో మొదలయ్యాయి. ఆపై తనకు డాక్టర్ కోడలు కావాలంటూ కార్తిక్ ఆర్యన్ తల్లి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ సందర్భానికి సింక్ అవ్వడంతో వీరిద్దరి రిలేషన్‌ను దాదాపుగా కన్ఫర్మ్ చేసేసుకున్నారు ప్రేక్షకులు. తాజాగా ఆ రూమర్స్‌ను మరింత స్ట్రాంగ్ చేసేలా కార్తిక్ ఆర్యన్ ఒక పోస్ట్ షేర్ చేశాడు. దీనికి శ్రీలీలతో పాటు ‘ఆషిఖీ 3’ మేకర్స్‌ను కూడా ట్యాగ్ చేశాడు. ఇది సినిమా ప్రమోషన్స్‌లో భాగంలాగా ఉన్నా.. ఈ పోస్ట్ మాత్రం చాలా స్పెషల్‌గా ఉందంటూ నెటిజన్లు ఫీలవుతున్నారు.

Also Read: శ్రీలీల రూమర్డ్ బాయ్‌ఫ్ఱెండ్‌పై నోరా ఫైర్.!

సిగ్గుపడుతూ శ్రీలీల

కార్తిక్ ఆర్యన్ (Kartik Aaryan) షేర్ చేసిన ఫోటోలో తను, శ్రీలీల (Sreeleela).. ఇద్దరూ ఛాయ్ మూమెంట్‌ను షేర్ చేసుకుంటున్నారు. ఇందులో కార్తిక్.. శ్రీలీలను చూస్తుండగా శ్రీలీల మాత్రం సిగ్గుతో తలదించుకొని ఉంటుంది. అలా ఈ రొమాంటిక్ ఫోటోను షేర్ చేస్తూ ‘నువ్వే నా జీవితం’ అనే క్యాప్షన్‌ను యాడ్ చేశాడు ఈ యంగ్ హీరో. అసలైతే ఇది ‘ఆషిఖీ 3’ మూవీ గ్లింప్స్‌లోని ఒక లైన్. అందుకే ఈ సినిమాను ప్రమోట్ చేయడం కోసమే కార్తిక్ ఆర్యన్ ఈ పోస్ట్‌ను షేర్ చేశాడని తెలిసినా.. ఇందులో వీరిద్దరి కెమిస్ట్రీ మాత్రం అదుర్స్ అంటూ రోజురోజుకీ వీరి పెయిర్‌కు ఎక్కువ ఫిదా అయిపోతున్నారు ప్రేక్షకులు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×