BigTV English

IPL Final 2025 : RCB Vs PBKS.. ఫైనల్‌లో గెలిచేది ఎవరంటే..!

IPL Final 2025 : RCB Vs PBKS.. ఫైనల్‌లో గెలిచేది ఎవరంటే..!

IPL Final 2025 : ఓ కల.. 17 ఏళ్ల ఎదురుచూపులు.. 18వ సారి ప్రయత్నం.. ఐపీఎల్ ఫైనల్స్‌ మ్యాచ్‌కు ముందు సినారియో ఇది. ఒకరిది నాలుగోసారి ప్రయత్నం.. మరోకరిది ఫస్ట్ అటెంప్ట్. ఎవరు గెలిచినా చరిత్రే.. ఎవరు ఓడినా నిరాశే. బెంగళూరు రాయల్‌గా కప్పును ఎత్తుతుందా? పంజాబ్‌ కింగ్స్‌గా నిలుస్తుందా? ప్రస్తుతం ఇలాంటి ప్రశ్నలు ఈ రెండు టీమ్‌ల ఫ్యాన్స్‌ను టెన్షన్‌ పెడుతున్నాయి. వారి మదిలో ఓ కల్లోలం ఇప్పటికే మొదలైంది అనడంలో ఎలాంటి డౌట్ లేదు. గ్రౌండ్‌లో తలపడే వారి కంటే.. వీరికే ఎక్కువగా నరాలు తెగె ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా RCB ఫ్యాన్స్‌ది అయితే అదో రకమైన టెన్షన్. ఇప్పటికే మూడుసార్లు ఫైనల్స్‌ చేరి భంగపడింది ఈ టీమ్. అందుకే నాలుగోసారైనా గెలిచి నిలవాలని ఆశిస్తున్నారు. మరి వీరి ఆశలు ఫలిస్తాయా? లేక నాలుగోసారి సారీ చెబుతారా? అనేది తేలనుంది.


RCB Vs PBKS..

ఆర్సీబీ విషయానికి వస్తే…18 ఏళ్లుగా ఆడుతున్నా, కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఇప్పటికి మూడుసార్లు ఫైనల్‌కు చేరిన ఈ టీమ్‌…ఫైనల్స్‌లో ఓడిపోయింది. 2009, 2011, 2016లో కప్పు వచ్చినట్టే వచ్చి చేజారింది. 18 ఏళ్ల నిరీక్షణకు ఇవాళ పుల్‌స్టాప్‌ పడనుందని భావిస్తున్నారు ఆర్సీబీ ఫ్యాన్స్‌. ఈసారి కప్పు కొట్టి తీరుతుందనే కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఇటు పంజాబ్‌ ఇప్పటి వరకు ఫైనల్స్‌కు రాలేదు. ఎప్పుడు ప్లే ఆఫ్ దశలోనే ఇంటిబాట పట్టేది. కానీ శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని ఈ జట్టు అంచనాలకు మించి ఆడుతూ వస్తోంది. మొన్న జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ముంబైని సైతం ఓడించింది. దాంతో పంజాబ్‌పై ఎక్స్‌పెక్టేషన్స్ ఓ రేంజ్‌లో పెరిగాయి.


స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్

టీమ్స్‌ బలాబలాలు చూస్తే.. ఆర్సీబీ, పంజాబ్‌..! రెండు స్ట్రాంగ్‌గానే కన్పిస్తున్నాయ్‌. అటు బ్యాటింగ్‌, ఇటు బౌలింగ్‌లో బ్యాలెన్సింగ్‌ కన్పిస్తోంది. ఆర్సీబీలో సీనియర్‌ ఆటగాళ్లు, పంజాబ్‌లో జూనియర్లు అదరగొడుతున్నారు. స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్‌ ఉంది. హార్డ్ హిట్టర్లు ఉన్నారు. పైగా అహ్మదాబాద్‌ స్టేడియం. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై భారీ స్కోరు రావడం గ్యారంటీ.

ఆర్సీబీ బలంగా ఉందా?

RCB స్ట్రెంథ్‌, వీక్నెస్‌ చూస్తే.. టీమ్‌లో మంచి జోష్ కన్పిస్తోంది. ముందుగా బ్యాటింగ్ విషయానికి ఓపెనర్లు..ఫిల్ సాల్ట్‌, రన్‌ మిషన్ విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారు. లాస్ట్ మ్యాచ్ మినహా… ఈ సీజన్‌లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లీ 614 రన్స్ చేశాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లీ క్రీజులో ఉంటే చాలు…భారీ స్కోరు రావడం గ్యారంటీ. ఇక ఫిల్‌ సాల్ట్‌. ఇతన్ని అసల్ట్‌ అని కూడా పిలుస్తుంటారు. ఒక్కసారి కదురుకుంటే చాలు బౌలర్లను ఊచకోత కోస్తాడు. ఇక మయాంక్ అగర్వాల్‌, కెప్టెన్‌ రజత్‌ పాటిదర్ కూడా బౌండరీలు బాదుతుంటారు. పైగా పంజాబ్‌పై పాటిదర్‌కు మంచి రికార్డు ఉండటం అడ్వాంటేజ్‌. గత రెండు మ్యాచ్‌లకు దూరమైన టిమ్‌ డేవిడ్‌..ఫైనల్ మ్యాచ్‌లో ఆడే ఛాన్స్ ఉంది. గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. ఆల్‌రౌండర్‌గా కృనాల్ పాండ్యా అదరగొడుతున్నా, మరో ఆల్‌రౌండర్ లివింగ్‌స్టన్‌ ఎక్స్‌పెన్సీవ్‌గా తయారవుతున్నాడు. గాయం కారణంగా దూరంగా ఉన్న టిమ్ డేవిడ్‌ను ఆడించే అవకాశం ఉంది.

బౌలింగ్ విషయాని వస్తే.. స్వింగ్ కింగ్‌ భువనేశ్వర్ కుమార్‌, షెపర్డ్‌, యష్‌ దయాల్‌ను సుపర్బ్ ఫామ్‌లో ఉన్నారు. మొన్న క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సుయాష్‌ శర్మ దుమ్మురేపాడు. పంజాబ్‌ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. దాంతో ఫైనల్ మ్యాచ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది.

Related News

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Big Stories

×