Cobra Snake: ఈ మధ్య పాముల వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వానకాలం స్టార్ట్ అయ్యిందంటే చాలు పాములు పుట్టుకొస్తాయి. ఇళ్లల్లోకి పాములు వస్తుంటాయి. మనకు ఎదురుగా పాములు కనబడితే.. వెనక్కి తిరగకుండా పరుగులు తీస్తాం. పాము దగ్గలో ఉందంటేనే.. భయపడుతుంటాం. అలాంటిది భారీ నాగుపాము ఇంట్లోకి చోరితే అంతే సంగతులు. ఇంటిల్లిపాది బయటకు పరిగెత్తాల్సిందే.
ఈ మద్య కురుస్తున్న భారీ వర్షాల వల్ల కూడా పాములు బయటకు వస్తున్నాయి. ఇళ్లలోకి దూరి హల్ చల్ సృష్టిస్తున్నాయి. ఇంట్లో సజ్జల మీద, సామాన్ల కింద, బట్టలలో దూరి భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి.తాజాగా ఓ పాము వీడియో నెట్టింట ఫుల్ వైరల్ గా మారింది. ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ. వీడియో మాత్రం మస్త్ వైరలవుతోంది. భారీ నాగుపాము ఇంట్లోకి దూరింది. అంతేగాక ఇంట్లో సెల్ఫ్ ల్లో ఉన్న బట్టలలోకి వెళ్లి హల్ చల్ చేసింది. దీంతో కుటంబసభ్యులు బయటకు పరుగులు తీశారు.పాము శబ్దం విని వారు దద్దరిల్లిపోయారు. పాము బట్టల నుంచి బయటకు వచ్చి బుసలు కొట్టింది. దీంతో కుటుంబ సభ్యులు సమీపంలో ఉన్న స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరిన స్నేక్ క్యాచర్ పామును జాగ్రత్తగా పట్టుకుని దగ్గరలో ఉన్న అడవిలో వదిలేశాడు.
?utm_source=ig_web_copy_link
ALSO READ: SSC Notification: భారీ శుభవార్త.. ఎస్ఎస్‌సీలో 2402 ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే లైఫ్ సెట్ బ్రో..
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పామును చూసిన నెటిజన్లు షాక్ కు గురవుతున్నారు. పాములు ఇంట్లోకి దూరడం ఏంటి.. ఇంటి చుట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కామెంట్ చేస్తున్నారు. పాము భారీ పెద్దదని.. టైంకు కుటుంబ సభ్యులు చూడకపోతే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని మరొకరు కామెంట్ చేశారు. మొత్తానికి పాముల పట్ల జాగ్రత్తగా ఉండాలని.. ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ALSO READ: Cobra: వామ్మో.. రాత్రికి రాత్రే ఈ రెండు నాగుపాములు చేసిన పనికి..? వీడియో వైరల్