Virat on Musheer Khan: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… విరాట్ కోహ్లీ సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య నిన్నటి రోజున క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాదంలో చిక్కుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ అసభ్యకరమైన సిగ్నల్స్ ఇచ్చి… వివాదానికి తెరలేపాడు.
ముషీర్ ఖాన్ ను అవమానించిన విరాట్ కోహ్లీ
పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న కృషియల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే నిన్నటి మ్యాచ్ లో వరుసగా వికెట్లు కోల్పోయిన నేపథ్యంలో… ఇంపాక్ట్ ప్లేయర్ గా ముసిర్ ఖాన్ బరిలోకి దిగాడు. అయితే అతడు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయలేదు. డక్ అవుట్ అయి వెనుదిరిగాడు. అయితే ముసిర్ ఖాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అతన్ని కించపరుస్తూ విరాట్ కోహ్లీ స్లెడ్జింగ్ చేశాడు.
వాటర్ బాటిల్స్ అందించేవాడు బ్యాటింగ్ కు వచ్చాడంటూ.. దుహంకార వ్యాఖ్యలు చేశాడు విరాట్ కోహ్లీ. యంగ్ ప్లేయర్ని పట్టుకొని విరాట్ కోహ్లీ ఇలా మాట్లాడడాన్ని.. క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ అభిమానులైతే విరాట్ కోహ్లీని ట్రోలింగ్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే ముషీర్ ఖాన్ పైన విరాట్ కోహ్లీ కి అలాంటి ఉద్దేశం లేదని.. ఆయన అభిమానులు చెబుతున్నారు. గత మ్యాచ్ లో అతడికి.. బ్యాట్ కూడా గిఫ్ట్ గా ఇచ్చాడు అని గుర్తు చేస్తున్నారు.
ఫైనల్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా గురువారం రోజున పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య బిగ్ ఫైట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ దెబ్బకు నాలుగోసారి ఫైనల్ కి వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు. ఈ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో విక్టరీ కొట్టిన సంగతి తెలిసిందే.
దారుణంగా ఓడిపోయిన పంజాబ్ కింగ్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో క్వాలిఫైయర్ వన్ మ్యాచ్ లో కచ్చితంగా గెలవాల్సింది పోయి చేతులెత్తేసింది పంజాబ్ కింగ్స్. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 14.1 ఓవర్లలో ఆల్ అవుట్ అయింది. ఈ మ్యాచ్ లో 101 పరుగులు మాత్రమే చేసిన పంజాబ్ కింగ్స్ ఆల్ అవుట్ అయింది. ఇక ఈ లక్ష్యాన్ని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 ఓవర్లలోనే ఫినిష్ చేసింది. కేవలం రెండు వికెట్లు నష్టపోయిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాచ్ విజయం సాధించింది.
Virat Kohli saying "Ye to Paani pilata hai" to young Musheer Khan.
What a shameless person he is still laughing even after saying. 😭😭 pic.twitter.com/usrMJ2NGiz
— Shana⁴⁵🐐 (@shana45__) May 30, 2025