Miss World 2025 : గత రెండు మూడు వారాలుగా కొనసాగుతున్న ప్రపంచ అందాల పోటీలు తుది దశకు చేరుకున్నాయి.. ఈ వారాంతరం శనివారం సాయంత్రం మిస్ వరల్డ్ ఫైనల్ 2025 కోసం భారీ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 6 గంటల నుంచి హైటెక్స్‌లో జరగనున్న ఈ పోటీల కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన ప్రత్యేక డిజైనర్లు ప్రధాన వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు.. ఈ పోటీలను తిలకించేందు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ పోటీల్లో విన్నర్గా నిలిచిన వారికి ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో తెలుసుకోవాలని చాలామంది నెటిజన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. ప్రైజ్ మనీ ఎంత ఉంటుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
బాలీవుడ్ తారలతో ప్రత్యేక డ్యాన్సులు..
శనివారం సాయంత్రం జరుగుతున్న వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండేజ్, ఇషాన్ ఖట్టర్‌తో పాటు పలువురు నటులు స్పెషల్ డ్యాన్సులు చెయ్యనున్నారని సమాచారం. ఫైనల్ పోటీల్లో న్యాయనిర్ణేతలుగా ప్రముఖ నటుడు సోనూ సూద్, మేఘా ఇంజినీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. కాగా.. ఏటా మిస్ వరల్డ్ ఫైనల్లో ఇచ్చే మానవతావాది పురస్కారాన్ని ఈసారి సోనూసూద్‌కు ఇవ్వనున్నారు… అలాగే నాలుగు ఖండాల నుంచి నలుగురు విజేతలున్నారు. ఏషియా-ఓషియానా నుంచి థాయ్‌లాండ్, యూరప్ నుంచి మాంటేనెగ్రో, ఆఫ్రికా నుంచి కామెరూన్, అమెరికా-కరేబియన్ నుంచి డొమినికన్ రిపబ్లిక్ దేశాల ప్రతినిధులు ఇందులో విన్నర్స్ గా నిలిచారు..
Also Read :‘ భైరవం ‘ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఎలా ఉందంటే..?
విన్నర్ ప్రైజ్ మనీ ఎంతంటే..?
మిస్ వరల్డ్ అందాల పోటిల్లో విన్నర్ గా ఎవరు నిలుస్తారా అని గత మూడు వారాలుగా ఆసక్తి నెలకొంది. ఆ సస్పెన్స్ కు తెరపడనుంది. ఇప్పటివరకు ఈ మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభమైన 15ఏళ్ల తర్వాత తొలిసారిగా మన దేశం నుంచి 1966లో రీటా ఫరియా టైటిల్ గెలిచారు. ఆ తర్వాత 1994లో ఐశ్వర్యారాయ్, 1997లో డయానా హేడెన్, 1999లో యుక్తాముఖి, 2000లో ప్రియాంకా చోప్రా, 2017లో మానుషి చిల్లర్ ఈ టైటిల్స్‌ను సాధించి దేశాన్ని అగ్ర స్థానంలో నిలిపారు. అలాగే వెనిజులా 1955, 1981, 1984, 1991, 1995, 2011లలో ప్రపంచ సుందరి కిరీటాల్ని దక్కించుకుంది.. ఇక ప్రస్తుతం గ్లామర్ ప్రపంచం దృష్టి అంతా నందిని గుప్తాపైనా, హైదరాబాద్ నగరంపైనే ఉంది. ఈ దఫా టైటిల్‌ను నందిని గెలిస్తే అది భారత్‌ను ప్రపంచ సుందరి పోటీల్లో నెం.1 స్థానానికి చేరుస్తుంది..ఈ పోటీలను 150 దేశాల్లో లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు.. ఇక ఈ ఏడాది అది ప్రైజ్ మనీ విషయానికొస్తే.. మిస్‌వరల్డ్ విజేతకు రూ.8.5 కోట్ల ప్రైజ్‌మనీ అందించనున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్, సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.