WPL 2025: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ {డబ్ల్యూపిఎల్} లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హైట్రిక్ సాధించింది. ఈ మూడవ సీజన్ లో టాప్ ప్లేస్ తో నేరుగా ఫైనల్ చేరాలని ఆశించిన ముంబై ఇండియన్స్ కి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు {ఆర్సీబీ} షాక్ ఇచ్చింది. మంగళవారం రోజు జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లొ ఆర్సిబి జట్టు 11 పరుగుల తేడాతో ముంబై జట్టును ఓడించింది. దీంతో ముంబై రెండవ స్థానంతో సరిపెట్టుకోగా.. ఢిల్లీ క్యాపిటల్స్ మొదటి స్థానంతో ఫైనల్ చేరుకుంది.
Also Read: Jio Hotstar – IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో అదిరిపోయే శుభవార్త.. ఇకపై రూ.100 లకే
మెగ్ లానింగ్ కెప్టెన్సీలో మూడు సీజన్లలోను ఫైనల్స్ కి చేరిన తొలి జట్టుగా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్. మార్చ్ 13న ఫైనల్ లో ఢిల్లీ జట్టు ముంబై ఇండియన్స్ లేదా గుజరాత్ తో తలపడుతుంది. గత రెండు సీజన్లలో ఫైనల్ వరకు చేరిన ఢిల్లీకి టైటిల్ అందని ద్రాక్ష లాగే మిగిలింది. మెగ్ లానింగ్ సేన ఈసారైనా టైటిల్ గెలుస్తుందో లేదో వేచి చూడాలి. ఈ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం నాటి నుండి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్న ఢిల్లీ జట్టు.. ఫైనల్ లో మాత్రం ప్రత్యర్థులకు తలొగ్గుతుంది.
2023 సీజన్ ఫైనల్ లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిన ఢిల్లీ, గత సీజన్ ఫైనల్లో ఆర్సిబి చేతిలో ఓడిపోయింది. ఇక ఈసారి ఢిల్లీ జట్టుతో ఫైనల్ లో తలపడే జట్టు ఏదో తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సి ఉంది. మార్చి 13న ముంబై ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ మధ్య రేపు జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ లొ విజేతతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ లో తేల్చుకుంటుంది. ఢిల్లీ జట్టు 2023 సీజన్ లో 8 మ్యాచ్లలో 6 గెలిచి, రెండు మ్యాచ్లలో ఓడిపోయింది.
12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఫైనల్ లో ముంబై ఇండియన్స్ తో తలపడి ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ తర్వాత 2024 సీజన్ లో ఆడిన 8 మ్యాచ్లలో 6 గెలిచి, రెండు మ్యాచ్లలో ఓడిపోయింది. 12 పాయింట్లతో ఫైనాన్స్ కి అర్హత సాధించి.. ఫైనల్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఢిల్లీ పై 8 వికెట్ల తేడాతో టైటిల్ గెలుచుకుంది.
ఇక ఈ 2025 సీజన్ లో కూడా ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 8 మ్యాచ్లలో ఐదు మ్యాచ్లలో గెలుపొందింది. మరో మూడు మ్యాచ్లలో ఓడిపోయి పది పాయింటులతో వరుసగా మూడవసారి ఫైనల్ కి దూసుకు వచ్చింది. మరి ఈసారి ఢిల్లీకి ఫైనల్ మ్యాచ్ తెలుస్తుందో లేదో తెలియాలంటే మార్చ్ 15 రాత్రి వరకు వేచి చూడాల్సిందే. మరోవైపు గత రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఫైనల్ వరకు దూసుకు రావడం.. ఫైనల్ లో ఓటమిని చవిచూడడంతో ఢిల్లీ క్యాపిటల్ అభిమానులు సైతం నిరాశకి గురవుతున్నారు. ఈ ఈసారి వారి అభిమాన జట్టు విజయం సాధించాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు ఢిల్లీ కాపిటల్స్ అభిమానులు.
Delhi Capitals!🔥 pic.twitter.com/VTfgnIUKsB
— RVCJ Media (@RVCJ_FB) March 12, 2025