Record breaking India score fastest team 50 and 100 in Test history: కాన్పూర్ టెస్టులో ఇండియా పట్టు బిగించింది. కాన్పూర్ టెస్టులో భారత బ్యాటర్లు చెలరేగి ఆడారు. బంగ్లాదేశ్ బౌలర్లను చిత్తుచిత్తుగా ఓడించారు. భారత బ్యాటర్లు వారి దూకుడైన ఆటను కనబరిచారు. బంగ్లాదేశ్ 233 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రోహిత్ సేన పెద్ద విద్వాంసమై సృష్టించింది. ఓ ఎండ్ లో రోహిత్ శర్మ, మరో ఎండ్ లో యశస్వి జైస్వాల్ వారి ఆటతీరుతో అద్భుతమైన పరుగులను చేశారు. మొదటి ఓవర్ నుంచి అద్భుతంగా ఆడారు. అసలు ఆడుతున్నది టెస్ట్ మ్యాచా లేకపోతే టీ20 మ్యాచా అనుకునేలా చెలరేగి ఆడారు. పరుగుల వరద బారించారు.
ఎదుర్కొన్న తొలి రెండు బంతులను హిట్ మ్యాన్ సిక్సర్లుగా మలిచారు. యశస్వి జైస్వాల్ కూడా తన బ్యాటింగ్ తీరుతో పంజా విసిరాడు. దీంతో తొలి 18 బంతులకే భారత జట్టు 50 పరుగుల మార్కును దాటేసింది. 147 సంవత్సరాల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ 50 పరుగుల భాగస్వామ్యం. ఇంగ్లాండ్ ప్లేయర్లు బెన్ డకేట్, బెన్ స్టోక్స్ పేరిట ఉన్న రికార్డును రోహిత్, జైస్వాల్ బ్రేక్ చేశారు. ఇంగ్లాండ్ ఆటగాళ్లు 26 బంతుల్లో 50కి పైగా పరుగులు చేశారు. క్రీజులో ఉన్నంతసేపు హిట్ మ్యాన్ అలరించాడు. 11 బంతుల్లోనే 23 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, ఒక ఫోర్ ఉన్నాయి.
రోహిత్ అవుట్ అయినప్పటికీ యశస్వి జైస్వాల్ తన జోరును కొనసాగించాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టెస్టుల్లో భారత్ తరఫున ఇది నాలుగవ వేగవంతమైన హాఫ్ సెంచరీ. ఆ తర్వాత యశస్వి మరింత దూకుడు చూపించాడు. బౌండరీల మోతను మోగించాడు. 10.1 ఓవర్లలోనే భారత జట్టు 100 పరుగుల మైలురాయిని అందుకుంది. ఫాస్టెస్ట్ సెంచరీని సాధించింది. యశస్వి జైస్వాల్ 51 బంతుల్లో 71 పరుగులు కొట్టాడు. ఇందులో 12 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. 36 బంతుల్లో 39 పరుగులు చేశాక గిల్ అవుట్ అయ్యాడు. గిల్ ఇన్నింగ్స్ లో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. రిషబ్ పంత్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ దశలో విరాట్ కోహ్లీ, కే ఎల్ రాహుల్ వారి దూకుడు కొనసాగించారు.
ALSO READ: Ind vs Ban Test: ఒంటిచేత్తో క్యాచ్ అందుకున్న రోహిత్.. చెవులు పట్టుకున్న పంత్ !
వైట్ బాల్ ఫార్మాట్ తరహాలోనే అద్భుతంగా ఆడారు. భారీ షాట్లకు ప్రయత్నం చేశారు. బంగ్లాదేశ్ బౌలర్లపై ఒత్తిడి పెంచారు. అలవోకగా పరుగులు చేశారు. 35 బంతుల్లో కోహ్లీ 47 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. కేఎల్ రాహుల్ 33 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. 43 బంతుల్లో 68 పరుగులు సాధించి పెవిలియన్ చేరాడు. ఓవరాల్ గా టీమిండియా ఇన్నింగ్స్ లో 11 సిక్సర్లు నమోదు అయ్యాయి. క్యాలెండర్ ఇయర్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టుగా టీమిండియా నిలిచింది. ఈ సంవత్సరం భారత జట్టు 96 సిక్సర్లు సాధించింది. 2022లో ఇంగ్లాండ్ 89 సిక్సులు కొట్టింది. ఇప్పుడు ఆ రికార్డును టీమిండియా క్రాస్ చేసింది.