CM Siddaramaiah: ముడా వ్యవహారం సీఎం సిద్ధరామయ్య ఫ్యామిలీని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆయన ఫ్యామిలీపై కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఓ వైపు లోకాయుక్త, మరోవైపు ఈడీ కేసులు నమోదు చేయడంతో ఏం చెయ్యాలో సీఎం సిద్ధరామయ్యకు అంతు బట్టలేదు.
సీఎం సిద్ధరామయ్య భార్య పార్వతి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తాను తీసుకున్న భూములను ముడాకు ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు. భార్య నిర్ణయంపై ఆయన ఆశ్చర్యపోయారు. దీనిపై సీఎం సిద్ధరామయ్య రియాక్ట్ అయ్యారు. రాజకీయ కుట్రలకు తన భార్య బాధితురాలు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ఆమె తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తానని వెల్లడించారు.
తన భర్త రాజకీయ జీవితానికి మచ్చ తెస్తున్న ముడాకు చెందిన 14 ఫ్లాట్లను తిరిగి అదే సంస్థకు ఇస్తున్నట్లు వెల్లడించారు పార్వతి. ఆమెకు పుట్టిళ్లు నుంచి వచ్చిన ఆస్తులు. వీటిపై ఇంత రాద్దాంతం చేస్తారని తాను ఊహించలేదన్నారు. తన భర్త గౌరవం కంటే ఈ ఆస్తులు పెద్దవి కావని, అందుకే ఆస్తులు తిరిగి ఇచ్చేస్తున్నట్లు ప్రకటించారు.
తన కుటుంబసభ్యులతో చర్చించకుండా తనకు తాను తీసుకున్న నిర్ణయమని తెలిపారు పార్వతి. ఈ ఆరోపణలు వచ్చిన రోజునే నిర్ణయం తీసుకోవాలని భావించానన్నది ఆమె మాట. తన భర్త మరింత నష్టపోతున్నారని తెలిసి వెంటనే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
ALSO READ: టార్గెట్ తలపతి.. ఉదయనిధి పదవి వెనక బిగ్ స్కెచ్
అధికారుల దర్యాప్తు పూర్తి స్థాయి సహకారం అందిస్తానని విడుదల చేసిన లేఖలో ప్రస్తావించారామె. ముఖ్యమంత్రి భార్య పార్వతి తీసుకున్న నిర్ణయంపై ముడా కమిషనర్ రియాక్ట్ అయ్యారు. ముడా ఆస్తులను ఎవరైనా ఇస్తే, తాము తీసుకుంటామని, దీనిపై చర్చలు జరుపుతున్నారు.