PCB CHARGES FOR NOC: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) తీసుకునే నిర్ణయాలు చాలా వింతగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ జట్టు విషయంలో తీసుకునే నిర్ణయాలు… ట్రోలింగుకు కూడా దారితీస్తూ ఉంటాయి. తాజాగా NOC ( No Objection Certificates ) విషయంలో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు పోయింది. విదేశీ టోర్నమెంటులలో పాకిస్తాన్ క్రికెటర్లు ఆడాలంటే డబ్బులు చెల్లించాల్సిందేనని తాజాగా కొత్త రూల్ తీసుకువచ్చింది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఒక్కో ప్లేయర్ కు రూ.21 లక్షలు ఇస్తేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారీ చేస్తామని తాజాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) సంచలన ప్రకటన చేశారు. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అయింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెట్టిన ఈ రూల్ నేపథ్యంలో విదేశీ ఫ్రాంచైజీ ఓనర్లు తలలు పట్టుకుంటున్నారు.
Also Read: Munaf Patel On Dhoni Hookah Party: నోరు ఉన్న ప్రతీ వెధవా
మాట్లాడటమే..ధోనీ ‘హుక్కా’ సీక్రెట్ పై మునాఫ్ సంచలనం
అమెరికాకు సంబంధించిన మేజర్ లీగ్ క్రికెట్ ప్రస్తుతం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా కొంత మంది ఆడుతున్నారు. ముఖ్యంగా హారిస్ రౌఫ్ కూడా ఈ మేజర్ లీగ్ టోర్నమెంట్ లోని శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ (San Francisco Unicorns) జట్టులో భాగస్వామ్యం అయ్యారు. అయితే ఇతని విషయంలోనే NOC సర్టిఫికెట్ వివాదం రాజుకుంది. మేజర్ లీగ్ క్రికెట్ లో ఆడాలంటే హారిస్ రవూఫ్ ను కొనుగోలు చేసిన శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్ జట్టు 25 వేల డాలర్లు చెల్లించాల్సిందేనని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (Pakistan Cricket Board) తాజాగా కండిషన్ పెట్టింది. ఈ సారి సీజన్ లో ఆడినందుకుగాను సదరు ఫ్రాంచైజీ డబ్బులు చెల్లించాల్సిందేనని మొహ్సిన్ నఖ్వీ కండిషన్ పెట్టారు. లేకపోతే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వబోనని వెల్లడించారు. ఈ క్రమంలో మొహ్సిన్ నఖ్వీ కండిషన్ నేపథ్యంలో మేజర్ లీ క్రికెట్ లోని ఫ్రాంచైజీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు రూ.21 లక్షలు ఇచ్చి ఎన్ఓసీ (NOC) దక్కించుకుంది శాన్ ఫ్రాన్సిస్కో యునికార్న్స్.
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తాజాగా ఎన్ఓసి విషయంలో తీసుకున్న నిర్ణయంతో విదేశీ క్రికెట్ లీగ్స్ ఫ్రాంచైజీలు తలలు పట్టుకుంటున్నాయి. ఒక్కో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోసం 21 లక్షలు ఖర్చు పెడితే.. తమకు భారీగా నష్టం ఉంటుందని ఫ్రాంచైజీ ఓనర్లు లబోదిబోమంటున్నారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని.. లేకపోతే తమకు ఆ జట్టుకు సంబంధించిన ప్లేయర్లు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు ఓనర్లు. కానీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మాత్రం దీనిపై వెనక్కి తగ్గడం లేదు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఆర్థికంగా బలంగా మారేందుకుగాను ఈ చర్యలు తప్పవని అంటున్నారు నఖ్వీ.
🚨 PCB'S $25K NOC FEE: THE REAL STORY 🚨
– Reports claiming the PCB is charging a blanket $25,000 USD fee for No Objection Certificates (NOCs) are only partially accurate. According to a source close to an MLC player, the policy is more nuanced than widely reported.
– Under the… pic.twitter.com/Ac0quvmPfT
— Rayham. (@RayhamUnplugged) July 13, 2026