BigTV English

SA Vs IND Second Test : పిచ్ బాగాలేపోతే.. ఎవరైనా ఇలా అవుట్ అయిపోతారా?

SA Vs IND Second Test : పిచ్ బాగాలేపోతే.. ఎవరైనా ఇలా అవుట్ అయిపోతారా?

SA Vs IND Second Test : ఈ డైలాగ్ గుర్తు పట్టారా? ఎక్కడో విన్నట్టే ఉంది కదా.. జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి స్టార్ డమ్ తెచ్చి, బ్లాక్ బ్లస్టర్ హిట్ ఇచ్చిన సినిమా ‘తొలిప్రేమ ’లోనిది… కమెడియన్ వేణుమాధవ్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. అప్పుడా..‘తల్లి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడని…ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా?’ అని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడదే మాట నెట్టింట వైరల్ గా మారిపోయింది.


సౌతాఫ్రికాలో జరుగుతున్న రెండో టెస్ట్ పై మీమ్స్ చెలరేగుతున్నాయి. అందులో ఇది కూడా ఒకటి గా ఉంది. అదేమిటంటే..‘పిచ్ బాగా లేకపోతే…ఎవరైనా ఇలా అవుట్ అయిపోతారా? ’అని ఏడుపు బొమ్మలు పెట్టి వదులుతున్నారు.అసలెందుకిలా జరిగిందని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ఇంత అడ్వాన్స్ యుగంలో కూడా, ఇంత టెక్నిక్ తెలిసిన ప్లేయర్లు ఉండి కూడా, ఇలా జరుగుతుందా? అని కొందరు సీనియర్లు ఆశ్చర్యపోతున్నారు.

మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఎమ్మెస్కే మాట్లాడుతూ ఒకప్పటి రోజుల్లో పాకిస్తాన్ లో వసీం అక్రమ్, యూసఫ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్, వెస్టిండీస్ లో మార్కం మార్షల్, వాల్ష్, ఆంబ్రోస్ ఆస్ట్రేలియా నుంచి మెక్ గ్రాస్, బ్రెట్ లీ, డెన్నీస్ లిల్లీ, మెక్ డెర్మట్, గిల్లెస్పీ, న్యూజిలాండ్ నుంచి రిచర్డ్ హ్యాడ్లీ, షేన్ బాండ్ ఇలాంటి వారెందరో ఉండేవారు.


అప్పుడు బ్యాటర్లకి ఇంత టెక్నాలజీ లేదు.సేఫ్ గార్డ్స్ కూడా ఎక్కువ ఉండేవి కావు.కోచ్ లు కూడా తక్కువే, సౌకర్యాలు నామమాత్రంగా ఉండేవి. అలాంటి సమయంలో అవుట్ అయిపోయారంటే అర్థం ఉంది. కానీ ఇప్పుడు కూడా ఇలా అయిపోయారేమిటి?అని ఆశ్చర్యపోతున్నారు.

సచిన్ టెండుల్కర్ లాంటి వాళ్లు ఎందరో అలాంటి వారి బౌలింగ్ ని ఎదుర్కొని నిలిచారు.రాటుదేలారు. అప్పటితో పోల్చుంటే అంత క్వాలిటీ బౌలర్లు నేడు తక్కువే. అయినా సరే వికెట్లు ఇలా టపటపా పడిపోవడం ఏమిటని అన్నాడు.అంతేకాదు ఒక్క టీమ్ ఇండియా అనే కాదు.. రెండు జట్ల బ్యాటర్లు వికెట్లు పారేసుకోవడం నమ్మశక్యంగా లేదని అన్నాడు.

ఇప్పుడింతమంది కోచ్ లు, మందీ మార్బలం, చుట్టూ ఆధునిక టెక్నాలజీ ఉండి, అత్యాధునిక బౌలింగ్ మిషన్లు, బౌలింగ్ స్టాఫ్, నేషనల్ క్రికెట్ అకాడమీ సకల హంగులు ఉండి కూడా ఇలా జరగడం.. అన్ని జట్లు ఆలోచించాల్సిన విషయమే అన్నాడు. పిచ్ లపై మరింత శ్రద్ధ తీసుకోవాలని పలువురు సూచించారు. ఐదురోజులు జరగాల్సిన టెస్ట్ మ్యాచ్ రెండు రోజుల్లో ముగిసిపోతే మజా ఏం ఉంటుందని అంటున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×