Ravindra Jadeja: ఛాంపియన్ టోపీ 2025 టోర్నమెంట్ లో ( Champions Trophy 2025 Tournament ) భాగంగా… నిన్న టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా ( Team India vs Australia ) మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మొదటి సెమీఫైనల్ లో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ టీమిండియా తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో అందరూ అనుకున్నట్లుగానే టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో చేసిన తప్పిదాలు మళ్లీ రిపీట్ కాకుండా… చాలా చక్కగా ఆడి కంగారులను ఇంటికి పంపించింది టీమిండియా.
Also Read: NZ VS SA: బ్యాటింగ్ తీసుకున్నన్యూజిలాండ్..సౌత్ ఆఫ్రికాకు నాకౌట్ సెంటిమెంట్
అయితే ఈ మ్యాచ్ లో… ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఇది వివాదంగా కూడా… మారడం జరిగింది. రవీంద్ర జడేజా నిన్నటి మ్యాచ్లో తన లెఫ్ట్ హ్యాండ్ కు… ఓ బ్యాండేజ్ వేసుకున్నాడు. ఆ బ్యాండేజ్ వేసుకొని బౌలింగ్ చేయడం జరిగింది. ఆ బ్యాండేజ్ వేసుకున్నప్పుడే లబుశాంగే వికెట్ తీశాడు రవీంద్ర జడేజా ( Ravindra Jadeja ). ఎల్ బి డబ్ల్యు రూపంలో.. ఆ వికెట్ తీశాడు జడేజా. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా ప్లేయర్లు కంప్లైంట్ ఇచ్చారు లేదో తెలియదు కానీ… వెంటనే ఆ బ్యాండేజ్ తీయాలని జడేజాకు తెలియజేశాడు ఫీల్డ్ అంపైర్.
అయితే ఈ విషయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ( Rohit Sharma ) అలాగే విరాట్ కోహ్లీ ( Virat Kohli ) కూడా.. కాస్త అభ్యంతరం చెప్పారు. జడేజా కు గాయమైంది… అందుకే బ్యాండేజ్ వేసుకున్నాడు.. దాన్ని తీయమంటే ఎలా అని రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అంపైర్ తో వాదించారు. జడేజా కూడా ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది. కానీ రూల్స్ ప్రకారం ఆ బ్యాండేజ్ తీసి ఆడాలని అంపైర్ హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక ఆ తర్వాత బ్యాండేజ్ తీసి వేశాడు జడేజా. ఈ తరుణంలోనే స్మిత్ కొట్టిన ఓ బంతిని అందుకోబోయి డైవ్ చేశాడు. అయితే బ్యాండేజ్ లేకపోవడంతో మరింత గాయమైంది.
Also Read: BCCI – IPL 2025: ఐపీఎల్ 2025లో కొత్త రూల్స్..ఇకపై ప్లేయర్స్ భార్యలపై ఆంక్షలు ?
అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి ?
ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాస్తవానికి… ఐసీసీ అంతర్జాతీయ కౌన్సిల్ రూల్స్ ప్రకారం… రవీంద్ర జడేజా ఇలాంటి బ్యాండేజ్ వేసుకోకూడదు. అలా వేసుకుంటే అతనిపై వేటు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఐసీసీ రూల్స్ ప్రకారం 28.1 ఆర్టికల్ ఈ అంశంపై స్పష్టంగా చెప్పడం జరిగింది. గ్రౌండ్ లో ఉన్న 11 మంది ఆటగాళ్లలో… వికెట్ కీపర్ మినహా ఎవరు చేతులకు ఎలాంటి గ్లౌజులు గాని… ఇతర బ్యాండేజ్ లు గాని పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే ఐసీసీ పెనాల్టీ వేస్తుంది. రవీంద్ర జడేజా విషయంలో కూడా అదే జరిగింది. ఇక ఈ మ్యాచ్లో విజయం సాధించిన టీమిండియా నేరుగా ఫైనల్ కు చేరింది. ఇక ఇవాళ లాహోర్లో గెలిచిన జట్టుతో టీమిండియా దుబాయ్ వేదికగా ఫైనల్ ఆడబోతుంది.