Riley Norton : సాధారణంగా క్రీడాకారులు ఆయా క్రీడారంగాల్లో క్రీడల్లో తమ ప్రతిభను చూపిస్తుంటారు. అయితే కొందరూ కేవలం క్రీడకు మాత్రమే పరిమితం కారు. నాలుగైదు రకాల క్రీడల్లో కూడా ప్రతిభను చాటుతుంటారు. కొందరూ ఒక్క క్రీడకే పరిమితం అవుతుంటారు. మరికొంరదూ రెండు, మూడు రకాల క్రీడలను అద్భుతంగా ఆడుతుంటారు. అలా చాలా మంది ఆటగాళ్లే ఉన్నారు. ఉదాహరణకు టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్ర సింగ్ తొలుత ఫుట్ బాల్ ఆడేవాడు. ఫుట్ బాల్ లో కూడా గోల్ కీపర్ గా అద్భుతంగా ఆడేవాడు. అయితే అతను క్రికెట్ లోకి మారి వికెట్ కీపర్ గా, కెప్టెన్ గా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. ధోనీ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
Also Read : Smriti Mandhana : ప్రియుడితో టీమిండియా ప్లేయర్ రొమాన్స్.. గట్టిగా హాగ్ చేసుకొని మరీ
రెండింటిలో..
తాజాగా మరో ఆటగాడు వెలుగులోకి వచ్చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు రిలే నార్టన్ ఇటు క్రికెట్, అటు రగ్బీ రెండింటిలో రాణిస్తూ అందరినీ ఆశ్యర్యపరుస్తున్నాడు. గత ఏడాది సౌతాఫ్రికా జట్టు తరుపున అతను అండర్ -19 వరల్డ్ కప్ ఆడారు. ఇప్పుడు ఆ దేశ అండర్ -20 రగ్బీ జట్టు కెప్టెన్ గా ఉండటం విశేషం. నార్టన్ నాయకత్వంలో సౌతాఫ్రికా అండర్ -20 రగ్బీ జట్టు పైనల్ కి దూసుకెళ్లింది. దీంతో రెండు ఆటలలో అసాధారణ ప్రతిభ చూపిస్తున్న నార్టన్ పై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇటలీలో జరుగుతున్న అండర్ -20 రగ్బీ వరల్డ్ కప్ ఫైనల్ కి చేరుకుంది. 2024 అండర్ 19 ప్రపంచ కప్ లో అతను ఫాస్ట్ బౌలింగ్ ఆల్ రౌండర్ గా తన ఆల్ రౌండ్ సామర్థ్యాలను ప్రదర్శించారు. 18.36 సగటుతో 11 వికెట్లు తీసుకున్నాడు.
తండ్రి అడుగు జాడల్లో..
అదేవిధంగా బ్యాటింగ్ సగటు 50 కొనసాగించాడు. మూడు ఇన్నింగ్స్ లలో ఒక్కసారి మాత్రమే ఔట్ అయ్యాడు. ఇక సౌతాఫ్రికా సెమీ ఫైనల్ కి చేరుకోవడంలో సహాయపడింది . అతని క్రికెట్ కెరీర్ ఆశాజనకంగా ఉన్నప్పటికీ నార్టన్ ఇటీవల రగ్బీ పై మరింత దృష్టి సారించాడు. ఈ క్రీడలో అతను కూడా గణనీయంగా రాణించాడు. 1991 నుండి 2003 వరకు మాటీస్ రగ్బీ కోసం ఆడిన అతని తండ్రి క్రిస్ నార్టన్ అడుగు జాడల్లో నడుస్తున్నారు. రిలే ఈ ఏడాది స్టెల్లెన్ బోష్ విశ్వవిద్యాలయంలో బీ కామ్ ఇన్వెస్ట్ మెంట్ డిగ్రీని అభ్యసించాడు. ఆ సమయంోలనే రగ్బీలో చేరాడు. రగ్బీలో తన ప్రతిభ ను కనబరిచి టీమిండియా కెప్టెన్ గా వ్యవహరించడం విశేషం. అతని కెప్టెన్సీలో ముఖ్యంగా 2025 వరల్డ్ రగ్బీ అండర్ 20 ఛాంపియన్ షిప్ లో స్పష్టంగా కనిపిస్తుంది. జూనియర్ స్ప్రింగ్ బాక్స్ కెప్టెన్ గా, నార్టన్ తన జట్టుకు ఆధిపత్య ప్రదర్శనల ద్వారా మార్గనిర్దేశం చేసాడు. ఇతను డ్యూయల్ స్పోర్ట్స్ అథ్లెట్ల సరసన నిలిచాడు. నమీబియాకి చెందిన రూడీ వాన్ వురెన్ వంటి వ్యక్తులతో పోల్చాడు. అతను కూడా క్రికెట్, రగ్బీ ప్రపంచ కప్ లలో ఆడాడు.