Priya saroj : టీమిండియా క్రికెటర్ రింకు సింగ్ కి సమాజ్ వాద్ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్ కి ఇటీవలే ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. వాస్తవానికి వీరిద్దరూ ఏడాది కాలం కంటే ఎక్కువనే ప్రేమలో ఉన్నారు. ఇరు కుటుంబాల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగిన తరువాత వీరి పెళ్లి నిశ్చయం అయింది. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చిన ఆటగాళ్లలో రింకూ సింగ్ ఒకడు. ముఖ్యంగా ఒకే ఓవర్ లో 5 సిక్సర్లు కొట్టిన ప్లేయర్ ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. తన ప్రదర్శనతో ఏకంగా భారత జట్టులో చోటు సంపాదించాడు. అందివచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ప్రియా సరోజ్ గత ఏడాది మచ్లిషహర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సమాజ్ వాది పార్టీ తరపున ఎంపీగా గెలిచారు. 25 ఏళ్ల వయస్సులోనే ఎంపీగా ఎన్నికైన ఆమె.. లోక్ సభ ఎంపీగా గెలిచిన రెండో పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించారు.
సాధారణంగా రింకూ సింగ్ క్రికెట్ లో సిక్సులు కొట్టడం సర్వసాధారణం. కానీ రింకూ సింగ్ భార్య ఎంపీ సరోజ్ కూడా బ్యాట్ పట్టి క్రికెట్ ఆడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రింకూ సింగ్ ఒక్కడే కాదు.. ఆయనకి కాబోయే భార్య కూడా సిక్సులతో చెలరేగుతోంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు 2024 లోక్ సభ ఎన్నికల అఫిడవిట్ ప్రకారం.. ప్రియా సరోజ్ ఆస్తుల విలువ రూ.11.25 లక్షల వరకు ఉన్నట్టు సమాచారం. ఆమె దగ్గర రూ.75వేల నగదు మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. కెనరా బ్యాంకులో రూ.8,719, యూనియన్ బ్యాంకులో రూ.10.10 లక్షలు ఉన్నట్టు తెలిపింది. మరోవైపు ప్రియా సరోజ్ కి ఎలాంటి స్థలం, ఇల్లు, కారు లేదని.. ఆమె వద్ద 5 గ్రాముల బంగారం మాత్రమే ఉన్నదని.. ఎలాంటి పెట్టుబడులు లేవని అఫిడవిట్ లో పేర్కొనడం గమనార్హం.
Also Read : Yograj Singh: Ms ధోని వల్ల 7 గురి క్రికెటర్ల జీవితాలు నాశనమయ్యాయి.. యోగ్ రాజ్ హాట్ కామెంట్స్!
మరోవైపు ప్రియా సరోజ్ తండ్రి తుఫాని సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేసారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. 25 ఏళ్లకే ఎంపీగా గెలిచినటువంటి ప్రియా సరోజ్.. లోక్ సభకు ఎన్నికైన రెండవ అత్యంత పిన్న వయస్సు క్యాండిడేట్ గా నిలిచారు. ఆమె ప్రజల అభిమానాన్ని చూరకొంది. సరోజ్ కి ఉత్తరప్రదేశ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. రాజకీయాలలోకి రాకముందు ఆమె సుప్రీంకోర్టులో న్యాయవాదిగా కూడా పని చేసింది. రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టు మంచి ఆటగాడిగా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం టీమిండియా టీ-20 జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగుతున్నాడు. వీరి నిశ్చితార్థంతో క్రీడా, రాజకీయ రంగాల కలయికగా ఈ జంట నిలిచింది. వీరి పెళ్లి నవంబర్ 18, 2025న వారణాసిలో జరుగనుంది.
?igsh=eGxzNm1yb2RsZzdw