Vaibhav Suryavanshi friend : వైభవ్ సూర్యవంశీ గురించి ఇప్పుడు దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. 14 ఏళ్ల వయస్సులోనే రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ లో తక్కువ బంతుల్లోనే సెంచరీ చేశాడు. 14 సంవత్సరాల వయస్సులోనే ఐపీఎల్ లోకి ఆరంగేట్రం చేసి తొలి బంతికే సిక్స్ బాది డ్రీమ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆ తరువాత 35 బంతుల్లో సెంచరీతో అదిరిపోయే రికార్డు నెలకొల్పాడు. ఇలా ఒక్క సీజన్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు రాజస్థాన్ రాయల్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. తోటి పిల్లలతో స్కూల్ కి వెళ్లాల్సిన సమయంలో బరిలోకి దిగి అంతర్జాతీయ బౌలర్లను చిత్తు చిత్తుగా బాదేశాడు. ఐపీఎల్ 2005లో 7 మ్యాచ్ ల్లో మొత్తం 252 పరుగులు చేశాడు. 18 బౌండరీలు.. ఏకంగా 24 సిక్సర్లతో హోరెత్తించాడు. వైభవ్ సూర్య వంశీ ఒక్కడే కాదు.. అతని 13 ఏళ్ళ స్నేహితుడు కూడా 300 కొట్టేసాడు.. 22 సిక్సర్లు, 41 బౌండరీలు బాదాడు.
Also Read : Yograj Singh: Ms ధోని వల్ల 7 గురి క్రికెటర్ల జీవితాలు నాశనమయ్యాయి.. యోగ్ రాజ్ హాట్ కామెంట్స్!
వైభవ్ సూర్యవంశీ మాదిరిగానే పదమూడేళ్ల అయాన్ రాజ్ జిల్లా క్రికెట్ మ్యాచ్‌లో అజేయంగా 327 పరుగులు చేశాడు. తాను చిన్నప్పుడు వైభవ్ సూర్యవంశీతో కలిసి ఆడేవాడినని తాజాగా రాజ్ వెల్లడించాడు. ప్రస్తుతం అతనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా మరో స్టార్ వెలుగులోకి వచ్చాడు. వైభవ్ మాదిరిగానే అయాన్ రాజ్ డిస్ట్రిక్ట్ లీగ్ క్రికెట్ లో అద్భుతమైన ట్రిపుల్ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షించాడు. సంస్కృతి క్రికెట్ అకాడమీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రాజ్ 30 ఓవర్ల మ్యాచ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్ లో కేవలం 134 బంతుల్లో 41 ఫోర్లు, 22 సిక్సర్లతో అజేయంగా 327 పరుగులు చేయడం విశేషం. అతని ఆట వైభవ్ సూర్యవంశీని గుర్తు చేసింది. స్థానిక లీగ్ లలో ఇలాంటి ఇన్నింగ్స్ చాలానే ఆడాడు. వాస్తవానికి వైభవ్ సూర్యవంశీకి అయాన్ మంచి స్నేహితుడు అంట. వీరిద్దరూ కలిసి చాలా వరకు క్రికెట్ మ్యాచ్ లు ఆడారట. వారి బ్యాటింగ్ శైలిలో సారూప్యత వివరిస్తుంది. అయాన్ తన స్నేహితుడు వైభవ్ సూర్యంశీ నుంచి ప్రేరణ కూడా పొందడం విశేషం.
ముఖ్యంగా రాజ్ తన తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అతను మాజీ క్రికెటర్ కూడా అయినప్పటికీ గొప్ప విజయాన్ని మాత్రం సాధించలేకపోయాడు. వైభవ్ సూర్యవంశీ 12 సంవత్సరాల వయస్సులో 2023లో తన రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేశాడు. టోర్నమెంట్ హిస్టరీలో బీహార్ తరపున రెండో అతి పిన్న వయస్కుడైన ఆటగాడు ఆరంగేట్రం చేసాడు. అతను అతి పిన్న వయస్కుడైన ఇండియా A లిస్ట్ ఆరంగేట్రటం చేసాడు. ఐపీఎల్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడే అవకాశం వచ్చినప్పుడు సౌత్ కి ప్రఖ్యాతి వచ్చేసింది. ఇటీవల ముగిసిన ఎడిషన్ లో అతను సెంచరీ.. ఒ ఫిప్టీ స్కోరుతో సహా 7 ఇన్నింగ్స్ లలో 252 పరుగులు చేసాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.