Virender Sehwag Divorce: టీమిండియా క్రికెట్ లో చాలా మంది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యకాలంలో క్రికెట్ సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఇటీవలే హార్దిక్ పాండ్యా, నటాషా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు చాలామంది క్రికెటర్లు విడాకులు తీసుకున్నప్పటికీ హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకోవడం హాట్ టాపిక్ అయింది. ఇక ఈ మధ్యకాలంలో చాహల్ అలాగే ధనశ్రీ కూడా విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Virat Kohli: జవాన్ ను కాదన్నాడు… వీళ్లకు ఆటోగ్రాఫ్ ఇస్తాడు.. కోహ్లీపై ట్రోలింగ్ ?
ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ) గురించి సంచలన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతి త్వరలోనే వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతోంది ఓ వార్త. నేషనల్ మీడియాలో కూడా దీనిపై రకరకాలుగా కథనాలు వస్తున్నాయి. దాదాపు 20 సంవత్సరాల అనుబంధాన్ని తెచ్చుకోబోతున్నాడట వీరేంద్ర సెహ్వాగ్. తన భార్య ఆర్తి అహ్లావత్ తో ( Aarti Ahlawat ) విడాకులు తీసుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడట.
Also Read: Michael Clarke: పెళ్ళాలను కాకుండా.. లవర్లను తీసుకుపోవాలా..? బీసీసీఐపై మాజీ కెప్టెన్ సీరియస్ ?
దీంతో ఈ వార్త… హాట్ టాపిక్ అయింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ… పెళ్లయిన 20 సంవత్సరాల తర్వాత తన భార్యకు వీరేంద్ర సెహ్వాగ్ విడాకులు ( Virender Sehwag Divorce ) ఇస్తున్నట్లు మాత్రం కథనాలు ప్రచురణ అవుతున్నాయి. ఇది ఇలా ఉండగా… 2004 సంవత్సరంలో వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆర్తి వివాహం జరిగింది. గత కొన్ని రోజులుగా… ఆర్తి ( Aarti Ahlawat ) అలాగే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ విడివిడి గానే ఉంటున్నారట. దీపావళి పండుగ నుంచి ఈ వాతావరణం నెలకొన్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు దీపావళి పండుగ సందర్భంగా… తన కొడుకుతోపాటు తను తల్లి ఫోటోలను షేర్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్… భార్య ఫోటోలను మాత్రం షేర్ చేయలేకపోయాడు. అప్పటి నుంచే వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆయన భార్య ఆర్తి అహ్లావత్ మధ్య గొడవలు ప్రారంభమైనట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే సాధారణంగా ఆమె వేడుకల్లో పాల్గొనలేదని కొంతమంది ప్రచారం చేశారు. కానీ ఇప్పుడిప్పుడే… ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. గత కొన్ని వారాల క్రితం, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పాలక్కాడ్‌లోని విశ్వ నాగయక్షి ఆలయానికి వెళ్ళిన ఫోటోలను పంచుకున్నారు వీరేంద్ర సెహ్వాగ్ ( Virender Sehwag ). అయితే అందులో ఆర్తి ( Aarti Ahlawat ) గురించి ఎటువంటి ప్రస్తావన లేదు. ఇలా ప్రతి చోటకు సింగల్ గానే వీరేంద్ర సెహ్వాగ్ వెళుతున్నారు. ఇక ఇప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ అలాగే ఆర్తి ఇద్దరు విడాకులు టీయూకుతున్నారని ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. అయితే, మాజీ క్రికెట్ ఐకాన్ వీరేంద్ర సెహ్వాగ్ నుండి… విడాకుల పై ( Virender Sehwag Divorce ) అధికారిక ప్రకటన రాలేదు.