BigTV English

Asia Cup 2025: ఆసియా కప్ ఆడే బంగ్లాదేశ్ జట్టు ఇదే.. ఏకంగా 16 మంది సభ్యులతో

Asia Cup 2025: ఆసియా కప్ ఆడే బంగ్లాదేశ్ జట్టు ఇదే.. ఏకంగా 16 మంది సభ్యులతో

Asia Cup 2025: 2025 సెప్టెంబర్ 9 నుండి ఆసియా కప్ 2025 ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఈ ఆసియా కప్ టోర్నీ కోసం తమ జట్టును ప్రకటించింది. అయితే ఈ ఆసియా కప్ టోర్నీ కోసం బంగ్లాదేశ్ లోని పలువురు స్టార్ ప్లేయర్లకు షాక్ ఇచ్చింది బంగ్లా క్రికెట్ బోర్డు. మొత్తం 16 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసింది బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్. ఈ జట్టుకు లిట్టన్ దాస్ కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. తాజా మాజీ కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో పై వేటు పడింది. ఫామ్ లేమి కారణంగా ఇతడిని పక్కకు పెట్టింది.


Also Read: Sanju Samson: మధ్యాహ్నం 3 గంటలకు సెలైన్… 5 గంటల్లోనే మళ్లీ బ్యాటింగ్ కు వచ్చిన సంజూ.. వీడు రా రియల్ హీరో

ఇక వికెట్ కీపర్, బ్యాటర్ నురుల్ హాసన్ మూడు సంవత్సరాల తరువాత టి-20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అలాగే ఆల్ రౌండర్ సైఫ్ హాసన్ కూడా ఏడాదిన్నర విరామం తర్వాత టి-20 జట్టులోకి పునరాగమనం చేశాడు. మరోవైపు టి-20 లలో పెద్దగా ప్రభావం చూపించలేకపోవడంతో స్టార్ ప్లేయర్ మోహిది హాసన్ మిరాజ్ ఆసియా కప్ జట్టులో తన స్థానాన్ని కోల్పోయాడు. మోహిది హాసన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, సౌమ్య సర్కార్, హాసన్ ముహమ్మద్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా స్టాండ్ బై జాబితాకు పరిమితమయ్యారు.


ఇక నురుల్ విషయానికి వస్తే.. ఇతడు గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇదే అతనికి మూడు సంవత్సరాల తర్వాత జట్టులో చోటు దక్కడానికి సహాయపడింది. 31 ఏళ్ల నురుల్ ఆస్ట్రేలియాలో జరిగిన 2022 టీ-20 వరల్డ్ కప్ లో చివరిసారిగా ఆడాడు. అయితే ఇదే జట్టు ఆసియా కప్ కి ముందు స్వదేశంలో నెదర్లాండ్స్ తో జరిగే మూడు మ్యాచ్ ల టీ-20 సిరీస్ ని కూడా ఆడబోతోంది. ఈ సిరీస్ ఆగస్టు 30, సెప్టెంబర్ 1, 3 తేదీలలో జరగనుంది. ఇక ఆసియా కప్ లో బంగ్లాదేశ్ ప్రయాణం సెప్టెంబర్ 11న మొదలవుతుంది. ఆరోజు జరిగే మ్యాచ్ లో బంగ్లాదేశ్ జట్టు హాంకాంగ్ తో పోటీ పడుతుంది.

ఇక ఈ టోర్నీలో బంగ్లాదేశ్, హాంకాంగ్, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంకతో పాటు.. గ్రూప్ ఎ లో భారత్, పాకిస్తాన్, ఒమన్ యూఏఈ జట్లు ఉన్నాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా మొత్తంగా 19 మ్యాచ్ లు ఈ టోర్నీలో జరుగుతాయి. కాగా ఆసియా కప్ 2025 కి నాయకత్వం వహించబోయే లిట్టన్ దాస్ కెప్టెన్సీలో బంగ్లాదేశ్ జట్టు శ్రీలంక పై మొదటిసారిగా టి-20 సిరీస్ గెలిచింది. అనంతరం స్వదేశంలో పాకిస్తాన్ పై కూడా టి-20 సిరీస్ గెలిచింది. దీంతో ఇతడికే ఆసియా కప్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.

ఆసియా కప్ కోసం బంగ్లాదేశ్ జట్టు:

లిట్టన్ కుమార్ దాస్ {కెప్టెన్}, తాంజిత్ హసన్, పర్వేజ్ హుస్సేన్, సైఫ్ హసత్, తౌహీద్ హృదయ్, జాకర్ అలీ అనిక్, షమీమ్ హుస్సేన్, క్వాజీ నూరుల్ హాసన్ సోహన్, షాక్ మహేదీ హసన్, రిషాద్ హుమ్మెద్, ముస్త్ అహ్మద్, తాంజిమ్ హాసన్ సాకీబ్, తస్కిన్ అహ్మద్, షోరీపుల్ ఇస్లాం, షైఫ్ ఉద్దీన్.

స్టాండ్ బై: సౌమ్య సర్కార్, మెహెది హాసిన్ మిరాజ్, తన్వీర్ ఇస్లాం, హాసన్ మహమ్మద్.

Related News

Rohit Sharma: గంభీర్ వ‌ల్ల ఒరిగిందేమీ లేదు, ద్రావిడ్ వ‌ల్లే ఛాంపియన్స్ ట్రోఫీ..ఇజ్జ‌త్ తీసిన రోహిత్ శ‌ర్మ

Yograj Singh: సిరాజ్‌ ప్ర‌మాద‌క‌ర‌మైన ఆల్ రౌండ‌ర్ అవుతాడు, కూర్చుని సిక్సులు కొట్టే వీరుడు

Aus vs Pak Women: ఆస్ట్రేలియాతో బిగ్ ఫైట్..ఓడితే పాకిస్థాన్ ఇంటికేనా

Prithvi Shaw: ముషీర్ ఖాన్ కాలర్ పట్టుకుని, బ్యాట్ తో కొట్టిన పృథ్వీ షా

Eng vs Ban Women: బంగ్లాపై ఇంగ్లాండ్ గ్రాండ్ విక్ట‌రీ..పాయింట్ల‌ ప‌ట్టిక‌లో దిగ‌జారిన టీమిండియా

Rohit Sharma: 10 కిలోలు త‌గ్గిన రోహిత్ శ‌ర్మ‌.. కొత్త లుక్స్ అదుర్స్‌..ఇక అత‌న్ని ఆప‌డం క‌ష్ట‌మే

Shikhar Dhawan: రెండో పెళ్లి చేసుకున్న శిఖ‌ర్ ధావ‌న్‌..చాహ‌ల్ కు భార్య‌ను ప‌రిచ‌యం చేస్తూ!

Team India: ఓరి మీ దుంపలు తెగ…ఇక ఆ టీమిండియా పేరు తీసేసి, KKR అని పెట్టుకోండి

Big Stories

×