E-Paper
Advertisement

Rinku Singh’s Father Dies: రింకూ సింగ్ తండ్రి మృతి..పెళ్లి కూడా వాయిదా?

Rinku Singh’s Father Dies: రింకూ సింగ్ తండ్రి మృతి..పెళ్లి కూడా వాయిదా?
Advertisement

Rinku Singh’s Father Dies: టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ ఇంట పెను విషాదం చోటు చేసుకుంది. టి20 వరల్డ్ కప్ ఆడుతున్న రింకూ సింగ్ తండ్రి మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ ఇవాళ వేకువ జామున మరణించారు. గ్రేటర్ నోయిడాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ వార్త వినగానే రింకూ సింగ్, మరోసారి టీమిండియాను వదిలి సొంతూరుకు బయలుదేరారు. ఇక రింకూ సింగ్ తండ్రి మ‌ర‌ణ‌వార్త బ‌య‌ట‌కు రాగానే, క్రికెట‌ర్లు, రాజ‌కీయా నాయ‌కులు సంతాపం తెలుపుతున్నారు.

Also Read: India Semifinal Qualification Scenario: వెస్టిండీస్ తో జ‌రిగే మ్యాచ్ కు వ‌ర్షం గండం ? టీమిండియా సెమీ ఫైన‌ల్ ఆశ‌లు గ‌ల్లంతేనా !

రింకూ సింగ్ తండ్రి ఖచంద్ర సింగ్ మృతి

Advertisement

టీమిండియా ఫినిషర్ రింకూ సింగ్ తండ్రి ఇవాళ ఉదయం మరణించారు. గత కొన్ని రోజులుగా రింకూ సింగ్ తండ్రి ఖ‌చంద్ర సింగ్ లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఆయనది ఫోర్త్ స్టేజ్ కావడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అందుకే ఎమర్జెన్సీ వార్డులో ఆయనకు గత నెల రోజులుగా చికిత్స అందించారు వైద్యులు. ఇటు టి20 వరల్డ్ కప్ ఉండడంతో టీమ్ ఇండియా కోసం బరిలోకి దిగాడు రింకూ సింగ్. ఈ నేపథ్యంలోనే ఆయన తండ్రి బాగోగులను కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు. అయితే మొన్న దక్షిణాఫ్రికా తో మ్యాచ్ అయిపోయిన తర్వాత తన తండ్రి ఆరోగ్యం విషమించిందని హటాహుటిన ఉత్తరప్రదేశ్ వెళ్లాడు రింకూ సింగ్.

ఈ నేపథ్యంలోనే తన తండ్రితో ఒకరోజు గడిపాడు. ఆసుపత్రిలోనే ఉన్నాడు. ఆ తర్వాత మళ్లీ తిరిగి జట్టులో చేరాడు రింకూ సింగ్. జట్టులో చేరి ఒక్కరోజు గడవకముందే రింకూ సింగ్ తండ్రి సింగ్ మృతి చెందారు. నిన్న మ్యాచ్ సమయానికి చేరుకోకపోవడంతో అతన్ని తుది జ‌ట్టు నుంచి తప్పించింది టీమిండియా యాజమాన్యం. అయినప్పటికీ మరొకరి స్థానంలో ఫీల్డింగ్ అయితే చేశాడు. కానీ ఇంతలోనే తండ్రి మరణించిన వార్త వచ్చింది. దీంతో మళ్లీ హుటాహుటిన తన సొంతూరుకు వెళ్ళాడు రింకూ సింగ్. ఇక ఆయన తండ్రి మరణించిన నేపథ్యంలో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 రింకూ సింగ్ పెళ్లి కూడా వాయిదా?

Advertisement

తన తండ్రి ఖ‌చంద్ర సింగ్ మరణించిన నేపథ్యంలో రింకూ సింగ్ పెళ్లి కూడా వాయిదా పడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. రింకూ సింగ్ కుటుంబ సంప్రదాయాల ప్రకారం ఎవరైనా చనిపోతే ఏడాది కాలం పాటు ఎలాంటి శుభకార్యాలు ఇంట్లో నిర్వహించబోరని సమాచారం అందుతోంది. దీంతో రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి కార్యక్రమం వచ్చే ఏడాది ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాస్తవంగా జూన్ 2026 లో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారట. కానీ ఇంతలోనే రింకూ సింగ్ తండ్రి మరణించారు. దీంతో ఈ పెళ్లి కాస్త ఏడాది కాలం పాటు వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా రింకూ సింగ్, ఎంపీ ప్రియా సరోజ్ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. 2025 జూన్ 8వ తేదీన ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అయితే పెళ్లి చేసుకునే సమయానికి ఈ పెను విషాదం చోటుచేసుకుంది.

Also Read: Daisy Shah On Palash: పలాష్ ముచ్చల్ చాలా మంచోడు..స్మృతినే కిలాడీ లేడీ ?..బాలీవుడ్ నటి సంచ‌ల‌నం !

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×