Riyan Parag : రాజస్థాన్ రాయల్స్ టీమ్ ఈ సీజన్ లో గత మూడు మ్యాచ్ ల్లో గెలిచే మ్యాచ్ లను ఓడిపోతున్న విషయం తెలిసిందే. చివర్లో ఒక మ్యాచ్ సూపర్ ఓవర్ జరగ్గా.. మరో మ్యాచ్ లాస్ట్ ఓవర్ లో 9 పరుగులు కూడా చేయలేకపోయింది. నిన్న బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో కూడా అలాంటి పరిస్థితే జరిగింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో పక్కటెముకల గాయంతో జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో రాజస్థాన్ జట్టుకు రియాన్ పరాగ్ కెప్టెన్ అయ్యాడు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న రియాన్ పరాగ్.. గతంలో ఆర్సీబీ కోసం స్టేడియం కి వెళ్లి మ్యాచ్ లు చూసేవాడు. ఒకప్పుడు బెంగళూరు గెలవాలని కోరుకున్న అతను.. ఇప్పుడు బెంగళూరును ఓడించేందుకు ఆడుతున్నాడు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read : SRH VS CSK: చెన్నైతో మ్యాచ్.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ ఒక్కటి SRH చేస్తే చాలు
రియాన్ పరాగ్ నిన్న బెంగళూరును ఓడిస్తాడని అంతా భావించినప్పటికీ చివర్లో బెంగళూరు బౌలర్ హెజిల్ వుడ్ అద్భుతమైన బౌలింగ్ వేసి రాజస్థాన్ రాయల్స్ ని కట్టడి చేశాడు. రియాన్ పరాగ్ ఐపీఎల్ లో 50 పరుగులు చేసిన అతిపిన్న వయస్కుడైన ఆటగాడు. కొంతకాలం దేశీయ క్రికెట్ లో అస్సాంకు కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు. 2022లో జరిగిన ఐపీఎల్ లో రియాన్ పరాగ్ 17 క్యాచ్ లు తీసుకున్నాడు. టోర్నమెంట్ లో ఏ భారతీయ ఫీల్డర్, వికెట్ కీపర్ కానీ అత్యధిక క్యాచ్ లు పట్టలేదు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన తక్కువ స్కోరింగ్ థ్రిల్లర్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున 56 నాటౌట్ గా నిలిచి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
రియాన్ పరాగ్ 2024 ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. నిన్న రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఓటమి చెందడం పై స్పందించాడు పరాగ్. స్పిన్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోకపోవడంతోనే గెలిచే మ్యాచ్ లో ఓటమి పాలయ్యామని తెలిపాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ 50 పరుగులు చేశాడు. రాజస్థాన్ బౌలర్లలో సందీప్ శర్మ రెండు వికెట్లు తీయగా.. ఆర్చర్, హసరంగ చెరో వికెట్ తీశారు. రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 194 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఆర్సీబీ బౌలర్లలో హజెల్ వుడ్ 33/4 రాజస్తాన్ రాయల్స్ పతనాన్ని శాసించగా.. భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్ చెరో వికెట్ పడగొట్టారు. కృణాల్ పాండ్యాకు రెండు వికెట్లు దక్కాయి. 19వ ఓవర్ లో హజెల్ వుడ్ మ్యాచ్ ను ఆర్సీబీ వైపు మలుపు తిప్పాడు. క్రీజులో సెట్ అయిన జురెల్ తో పాటు హసరంగలను ఔట్ చేసి ఒక్క పరుగు మాత్రమే ఇచ్చాడు. దీంతో ఆర్సీబీకి విజయం దక్కింది.