BigTV English

SRH VS CSK: చెన్నైతో మ్యాచ్.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ ఒక్కటి SRH చేస్తే చాలు

SRH VS CSK: చెన్నైతో మ్యాచ్.. ప్లే ఆఫ్ కు వెళ్లాలంటే ఈ ఒక్కటి SRH చేస్తే చాలు

SRH VS CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో.. తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ 43వ మ్యాచ్ చెన్నై లోని ఎంఏ చిదంబరం స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రంగం సిద్ధం చేశారు. ఎప్పటిలాగే ఈ మ్యాచ్ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు విజయం చాలా కీలకం. ఇందులో గెలిచిన జట్టే ప్లే ఆఫ్స్ బరిలో ఉంటుంది.


Also Read: SKY on Abhishek sharma : ఇదేం దౌర్జన్యం..మళ్ళీ అభిషేక్ శర్మ జేబులు చెక్ చేసిన SKY

ఇవాళ ఓడితే ఇంటికే..!


సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఇవాళ జరగనున్న మ్యాచ్లో ఎవరు గెలిస్తే.. వాళ్లకు అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ టోర్నమెంటులో ప్లే ఆఫ్ వెళ్లడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వరకు చెన్నై సూపర్ కింగ్స్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ రెండు జట్లు కూడా చెరో ఎనిమిది మ్యాచ్లు ఆడాయి. అంటే హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లకు మరో ఆరు మ్యాచులు వాడాల్సిన పరిస్థితి ఉంది. పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలంటే… లేదా ప్లే ఆఫ్స్ కు చేరాలంటే హైదరాబాద్ అలాగే చెన్నై సూపర్ కింగ్స్ రెండు జట్లు చెరో ఆరు మ్యాచ్లు గెలవాలి. ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా ప్రతి మ్యాచ్ గెలుచుకుంటూ ముందుకు వెళ్లాలి. అలా అయితే కచ్చితంగా ప్లే ఆఫ్ కు వెళ్తాయి. అలా కాదని ఇవాళ ఓడిపోయిన జట్టు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు హైదరాబాద్ గెలిస్తే… మరో ఐదు మ్యాచ్లు గెలిస్తే హైదరాబాద్ కు ప్లే ఆఫ్ ఆశలు ఉంటాయి. ఇవాళ గెలిచి మిగిలిన మ్యాచ్లు ఓడిపోయిన కూడా కష్టమే.

ఆరు మ్యాచ్లు గెలుస్తామంటున్న చెన్నై

చెన్నై సూపర్ కింగ్స్ హెడ్ ఫ్లెమింగ్ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన ఐదు మ్యాచ్ల్లో వరుసగా గెలిచి ప్లే ఆఫ్ కు చేరుతామని.. ఆయన ప్రకటించారు. 2024 ఐపీఎల్ టోర్నమెంట్లో… బెంగళూరు గెలిచినట్లుగా వరుసగా మేము కూడా గెలుస్తామని ఆయన ప్రకటించారు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయాలపై సర్వత్ర ఉత్కంఠత నెలకొంది.

Also Read: RR vs RCB: బెంగుళూరుతో చేతిలో ఓటమి.. నేరుగా వైన్స్ కు వెళ్లి పెగ్గు వేసిన రాజస్థాన్ CEO

హైదరాబాద్ వర్సెస్ చెన్నై జట్ల అంచనా

చెన్నై సూపర్ కింగ్స్ ప్రాబబుల్ XII: షేక్ రషీద్, రచిన్ రవీంద్ర/వంశ్ బేడీ, ఆయుష్ మ్హత్రే, రవీంద్ర జడేజా, శివమ్ దూబే, విజయ్ శంకర్/సామ్ కర్రాన్, జామీ ఓవర్టన్, MS ధోని (c, wk), నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, మతీషా పతిరణ, ఆర్.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ XII: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (wk), అనికేత్ వర్మ, పాట్ కమిన్స్ (c), హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, జీషన్ అన్సారీ, ఎషాన్ మలింగ, రాహుల్ చాహర్

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×