Black Rice: సాధారణంగా మనం అందరం తెల్లటి బియ్యంతో చేసిన ఆహార పదార్థాలను ప్రతి రోజూ తింటూ ఉంటాం. వీటిలో అనేక పోషకాలు ఉంటాయి. కానీ తెల్లటి బియ్యంతో పోలిస్తే..బ్రౌన్ రైస్, బ్లాక్ రైస్‌లల్లో పోషకాలు సమృద్దిగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తినడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గుతాయట. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నల్ల బియ్యంలోని పోషకాలు:
ఐరన్- 3.5 గ్రా
కార్బోహైడ్రేట్లు-34.39 గ్రా
ఫైబర్- 2-4.9 గ్రా
చక్కెర- 1గ్రా
కొలెస్ట్రాల్- 1-2 గ్రా
ప్రొటీన్-5- 8.5 గ్రా
జీర్ణ క్రియ:
బ్లాక్ రైస్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది పేగు కదలికలకు ఉపయోగపడుతుంది. అంతే కాకుండా మలబద్దకాన్ని తగ్గించడంలో కూడా మేలు చేస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలను కూడా తొలగిస్తుంది. ఆరోగ్యకరమైన పేగును ప్రోత్సహిస్తుంది. కడుపు ఉబ్బరంతో పాటు గ్యాస్ వంటి సమస్యలను తొలగించడంలో కూడా బ్లాక్ రైస్ మేలు చేస్తాయి.
ప్రొటీన్, ఐరన్ :
బ్లాక్ రైస్ లో పోషకాలు అధిక మోతాదులో ఉంటాయి. 100గ్రాముల వండిన నల్ల బియ్యంలో 9 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. అంతే కాకుండా ఇందులో 3.5 మిల్లీ గ్రాముల ఐరన్ కూడా లభిస్తుంది. ఇది శరీరం అంతా ఆక్సిజన్ రవాణాతో పాటు శక్తిని ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. బ్లాక్ రైస్ లో ఉండే ప్రొటీన్ తో పాటు అమైనో ఆమ్లాలు కణాల పనితీరును ప్రభావితం చేస్తాయి. అంతే కాకుండా మొత్తం శరీరం పని తీరును మెరుగుపరచడంలో కూడా ఉపయోగపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు:
బ్లాక్ రైస్ లో.. అన్ని బియ్యం రకాల కంటే అత్యధిక మోతాదులో యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ ఉంటుంది. అంతే కాకుండా బ్లాక్ రైస్ లోని ఆంథోసౌనిన్ లు గుండె జబ్బులు, అల్జీమర్స్ తో పాటు కొన్ని రకాల వ్యాధులను తగ్గించడంలో కూడా ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యం: బ్లాక్ రైస్‌లో ఉన్న ఆంటీ ఆక్సిడెంట్లు , ఫైబర్ వంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాకుండా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడంలో మేలు చేస్తాయి.
నాడీ వ్యవస్థ: బ్లాక్ రైస్‌లో ఉండే ఐరన్ , ఇతర ఖనిజాలు, రక్తాన్ని బలోపేతం చేసి, నరాలకు పోషణ అందిస్తాయి.
హై ఫైబర్ కంటెంట్: బ్లాక్ రైస్‌లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు సహాయపడుతుంది.
Also Read: అలోవెరాలో ఈ ఒక్కటి కలిపి వాడితే.. మొటిమలు మాయం
బరువు నియంత్రణ: వీటిలో ఫైబర్ ఉండటం వల్ల ఎక్కువ కాలం పాటు సంతృప్తిగా ఉండటం, ఆకలి తగ్గడం వల్ల, బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
విటమిన్లు , ఖనిజాలు: బ్లాక్ రైస్‌లో విటమిన్ E, విటమిన్ B6, మాంగనీస్ వంటి విలువైన పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి.
గ్లైసమిక్ ఇండెక్స్ : బ్లాక్ రైస్‌లో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. అంటే ఇది రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ ఉన్న వారు బ్లాక్ తినడం మంచిది.