Mahvash – Chahal : టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ ( Yuzvendra Chahal ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన మొదటి భార్య ధన శ్రీ వర్మ కు ( Dhana Shree Verma) విడాకులు ఇచ్చి ప్రస్తుతం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League ) కంటే ముందే తన భార్యకు విడాకులు ఇచ్చి ఇప్పుడు… తన ప్రియురాలతో ఎంజాయ్ చేస్తున్నాడు చాహల్. టీమిండియా జట్టు ఏ దేశానికి వెళ్లిన అక్కడికి తన ప్రియురాలినితో కలిసి వెళుతున్నాడు. ఇక తాజాగా తన పుట్టినరోజు సందర్భంగా… ప్రియురాలితో కలిసి నైట్ పార్టీలో ఎంజాయ్ చేశాడు. ఈ సందర్భంగా ఆమెకు టైట్ హాగ్ ఇస్తూ.. అడ్డంగా దొరికిపోయాడు చాహల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ధనశ్రీ కి విడాకులు ఇచ్చిన చాహల్
2020 ఆ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ధన శ్రీ వర్మ అలాగే టీమిండియా స్టార్ ఆటగాడు చాహల్. దాదాపు రెండు సంవత్సరాల పాటు వీళ్ళ కాపురం చాలా ప్రశాంతంగా కొనసాగింది. కానీ రెండు సంవత్సరాల తర్వాత అంటే 2022 నుంచి చాహల్ అలాగే ధనశ్రీ వర్మ మధ్య గ్యాప్ పెరిగింది. ఇద్దరు విడివిడిగానే కొన్ని రోజులపాటు జీవించారు. ఇద్దరు సోషల్ మీడియా వేదికగా… కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశారు.
ఆ తర్వాత కోర్టులో విడాకుల కోసం అప్లై చేశారు. ఈ తరుణంలోనే మొన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కంటే ముందు విడాకులు… మంజూరు అయ్యాయి. ముంబై ఫ్యామిలీ కోర్టు వీళ్ళిద్దరికీ విడాకులు ఇచ్చింది. ఈ సందర్భంగా నాలుగు కోట్లకు పైగా… ధనశ్రీ వర్మ కు భరణం కింద చాహల్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో అప్పటినుంచి సింగిల్గానే ఉంటున్నాడు చాహల్. ఇక అటు… ధనశ్రీ వర్మ మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసేందుకు సిద్ధమవుతోంది.
లండన్ లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న చాహల్
తాజాగా టీం ఇండియా స్టార్ ఆటగాడు చాహల్ బర్త్డే జరిగింది. జూలై 23వ తేదీకి 35 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు చాహల్. అంటే నిన్నటి రోజున చాహల్ బర్త్డే గ్రాండ్గా జరిగింది. చాహల్ అలాగే ఆయన ప్రియురాలు ఆర్జే మహ్వాష్ ఇద్దరు కూడా ప్రస్తుతం లండన్ లోనే ఉన్నారు. లండన్ లో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే బర్త్డే వేడుకలు కూడా తాజాగా అర్ధరాత్రి పబ్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా తన ప్రియురాలు ఆర్జే మహ్వాష్ కు టైట్ హగ్ కూడా ఇచ్చాడు చాహల్. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన క్రికెట్ అభిమానులు… వాళ్ళిద్దరూ ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని… అందుకే ఇలా ఎంజాయ్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
?igsh=N3EyOWxjYXFxZDR5