BigTV English

BCCI: జై షా వారసుడొచ్చాడు.. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ?

BCCI: జై షా వారసుడొచ్చాడు.. బీసీసీఐ కార్యదర్శిగా రోహన్ జైట్లీ?

BCCI:  ఐసీసీ ఛైర్మన్‌గా జై షా నామినేషన్ వేస్తున్నారా? తర్వాత బీసీసీఐ సెక్రటరీ ఎవరు? కాబోయే కార్యదర్శి వెస్ట్ నుంచి వస్తున్నాడా? నార్త్ లేక సౌత్‌కు ప్రయార్టీ ఇస్తున్నారా? రేసులో రోహన్ జైట్లీ ఉన్నారా? ఇవే ప్రశ్నలు క్రీడాభిమానులను వెంటాడుతోంది.


ప్రపంచంలో క్రికెట్‌ను శాసిస్తోంది బీసీసీఐ. అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా ఎదిగింది కూడా. అలాంటి బోర్డులో పదవి అంటే ఆశామాషీ కాదు. దానికి రాజకీయ అండదండలు కూడా ఉండాల్సిందే. లేకుంటే అందులో అడుగుపెట్టడం కష్టమన్నది చాలామంది చెబుతున్నారు.

బీసీసీఐ సెక్రటరీ పదవిపై అందులోని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతమున్న కార్యదర్శి జై షా.. ఐసీసీ ఛైర్మన్ పదవి చేపడితే, ఆయన బీసీసీఐ పదవికి రాజీనామా చేయాల్సిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ ఎవరు? అనేదానిపై కొద్దిరోజులుగా బోర్డులో ఎడతెగని చర్చ జరుగుతోంది. తమకే దక్కుతుందని చాలా మంది ధీమాగా ఉన్నారు. కానీ, ఏ ఒక్కరూ నోరు విప్పలేదు.


ALSO READ: అట్టడుక్కి పడిపోతున్న.. పాకిస్తాన్

జై షా వారసుడిగా తొలుత ముగ్గురు పేర్లు వినిపించాయి. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, జాయింట్ కార్యదర్శి ఆశిష్ సెల్లార్, ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్‌ల్లో ఒకరు బీసీసీఐ కార్యదర్శి పదవి చేపట్టే అవకాశమున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా తెరపైకి రోహన్ జైట్లీ పేరు వచ్చింది.

ఇంతకీ రోహన్ జైట్లీ ఎవరు? బీజేపీ దివంగత నేత అరుణ్ జైట్లీ కొడుకు. తండ్రి మాదిరిగానే రోహన్ కూడా అడ్వకేట్. నాలుగేళ్ల కిందట ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు కూడా. ఈ క్రమంలో రోహన్ పేరు బయటకు రావడం, దాదాపు ఖరారైనట్టు బీసీసీఐ వర్గాలు చెబుతున్నమాట. అంతకుమించి బీజేపీకి చెందిన వ్యక్తి కూడా.

ఇక ఐసీసీ ఛైర్మన్‌గా జై షా బాధ్యతలు అందుకోవడం దాదాపు ఖాయమైంది. మొత్తం 16 మంది సభ్యుల్లో 15 మంది అతడికి సపోర్టు ఉంది. నామినేషన్‌ను ఆగష్టు 27 (నేటితో)తో ముగియనుంది. షా ఎన్నిక లాంఛనం కానుంది. అదే జరిగితే రోహన్ బీసీసీఐ కార్యదర్శిగా బాధ్యతలు చేపడతాడు.

జై షా ఆలోచనలు చూస్తుంటే.. బీసీసీఐని తన కంట్రోల్‌లో ఉంచుకునేందుకు స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది.  గతంలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ బాధ్యతలు చూసేశారు. అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకున్న తర్వాత జై షా వచ్చాడు. ఇప్పుడు రోహన్ వంతు అయ్యింది. మొత్తానికి బీసీసీఐని బీజేపీ కంట్రోల్‌లో ఉందన్నది క్రీడా విశ్లేషకుల మాట.

Tags

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×