BigTV English

ICC World Test Championship: అట్టడుక్కి పడిపోతున్న.. పాకిస్తాన్

ICC World Test Championship: అట్టడుక్కి పడిపోతున్న.. పాకిస్తాన్

ICC World Test Championship Pakistan in dire straits after Bangladesh loss: రావల్పిండిలో జరిగిన తొలిటెస్టు మ్యాచ్ లో ఓడిపోతుందనుకున్న బంగ్లాదేశ్ అనూహ్యంగా పుంజుకుని, బలమైన పాకిస్తాన్ పై గెలిచి ఘన  విజయం సాధించింది.  అది కూడా 10 వికెట్ల తేడాతో వారి దేశంలోనే చిత్తు చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో పాకిస్థాన్‌ను.. బంగ్లాదేశ్‌ ఓడించడం ఇదే తొలిసారి.


ఈ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు టెస్ట్ క్రికెట్ ఆడుతున్న 9 దేశాల్లో చూస్తే, పాక్ ఇప్పుడు 8 వ స్థానానికి పడిపోయింది. బహుశా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ నకు అర్హత కోల్పోయినట్టే అంటున్నారు. జట్టు, కెప్టెన్ అందరినీ మార్చినా సరే, పరిస్థితుల్లో మార్పులు రాకపోవడంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తల పట్టుకుంది.

టీ 20 ప్రపంచకప్ 2024, వన్డే ప్రపంచకప్ 2023 రెండింట్లో కూడా పాకిస్తాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. అంతేకాదు  టీ 20 ప్రపంచకప్ లో చిన్న జట్లయిన అమెరికా చేతిలో ఓడిపోతే, వన్డే వరల్డ్ కప్ లో ఆఫ్గాన్ చేతిలో ఓటమిపాలైంది. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ లో బంగ్లాచేతిలో పరాజయం పాలైంది.


Also Read: అంతా నీవల్లే: కోచ్ పై పాక్ కెప్టెన్ ఆగ్రహం

ఇప్పుడిదే పాక్ అభిమానులకు వళ్లు మండిపోతుందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ (30.56 %) తో 8వ స్థానానికి దిగజారిపోయింది. ఈ గెలుపుతో బంగ్లా దేశ్  (40.00 %) కి చేరి, ఐదో స్థానానికి ఎగబాకింది. ఇకపోతే టీమ్ ఇండియా ( (68.52%)తో అగ్ర స్థానంలో ఉంది. తన వెనుకే ఆస్ట్రేలియా (62.50 %)తో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (50.00%) తో మూడో స్థానంలో ఉంది.

ఇంగ్లండ్ (41.07%) తో నాలుగో స్థానం, శ్రీలంక (40.00%)తో ఆరో స్థానం, దక్షిణాఫ్రికా (38.89%) ఏడో స్థానంలో ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు వీటి తర్వాత పాకిస్తాన్ 8వ స్థానంలో ఉంది. ఇంక ఆఖరున అట్టడుగు స్థానంలో వెస్టిండీస్ (18.52%)తో ఉంది. ఇప్పటికి వెస్టిండీస్ 9 టెస్ట్ మ్యాచ్ లు ఆడి, ఒకటే విజయం సాధించింది. అందువల్లే అడుక్కి పోయింది.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×