BigTV English

Canada Mark Carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ.. లిబరల్ పార్టీ నాయకుడిగా ఎన్నిక

Canada Mark Carney: కెనడా కొత్త ప్రధానిగా మార్క్ కార్నీ.. లిబరల్ పార్టీ నాయకుడిగా ఎన్నిక

Canada Mark Carney| కెనడాలో అధికార లిబరల్ పార్టీ నేతగా మార్క్ కార్నీ ఎన్నికయ్యారు. దీంతో తదుపరి కెనడా ప్రధానమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగనున్నట్లు జస్టిన్ ట్రూడో జనవరిలో ప్రకటించిన నేపథ్యంలో లిబరల్ పార్టీకి కొత్త నాయకుని ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికలో బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్ మార్క్ కార్నీ విజేతగా నిలిచారు. 59 ఏళ్ల కార్నీ రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్ను ఓడించి పార్టీ కొత్త నాయకునిగా ఎన్నికయ్యారు. దీంతో తొమ్మిదేళ్ల ట్రూడో పాలనకు తెరపడినట్లైంది.


మొత్తం 150,000 పార్టీ సభ్యులు ఓటింగ్లో పాల్గొనగా, కార్నీకు 131,674 ఓట్లు వచ్చాయి. ఇవి 85.9 శాతం ఓట్లకు సమానం. రెండో స్థానంలో ఉన్న క్రిస్టియా ఫ్రీలాండ్కు 11,134, కరినా గౌల్డ్కు 4,785, ఫ్రాంక్ బేలిస్కు 4,038 ఓట్లు వచ్చాయి. డొనాల్డ్ ట్రంప్ నుంచి సుంకాల ముప్పు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్న వేళ కార్నీ 24వ ప్రధానమంత్రిగా కెనడా పాలన పగ్గాలు చేపట్టనున్నారు.

Also Read: నేను ఒక్క బటన్ నొక్కితే ఉక్రెయిన్ సైన్యం ఫినిష్.. జెలెన్‌స్కీని బెదిరించిన మస్క్‌


ఈ నేపథ్యంలో ఓ మీడియా సమావేశంలో ప్రసంగిస్తూ.. కెనడాను తమ దేశంలో 51వ రాష్ట్రంగా చేర్చుకుంటామని పలు సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన బెదిరింపులపై స్పందించారు. ఒట్టావా ఏ విధంగానూ, ఏ రూపంలోనూ అమెరికాలో భాగం కాదని ఆయన వ్యాఖ్యానించారు. తమ దేశం అప్పటికీ, ఇప్పటికీ బలంగా ఉందని అన్నారు. వాణిజ్యం అయినా, క్రీడలు అయినా చివరికి విజయం సాధించేది కెనడాయేనని పేర్కొన్నారు.

‘‘కెనడాను తమలో కలుపుకొని, దేశంలో ఉన్న వనరులు, నీరు, భూమి వంటి వాటిని తమ స్వాధీనం చేసుకోవాలనే ఉద్దేశంతో అగ్రరాజ్యం ఉంది. అలాంటి వారు విజయం సాధిస్తే, మన సంపద పూర్తిగా నాశనం చేస్తారు. కాబట్టి ట్రంప్‌ని ఎప్పటికీ ఈ విషయంలో విజయం సాధించనివ్వను. కెనడాతో స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యంపై విశ్వసనీయమైన నిబద్ధత చూపించే వరకు అమెరికాపై ప్రతీకార చర్యలు కొనసాగుతాయి’’ అని కార్నీ అన్నారు.

ఎవరీ మార్క్ కార్నీ?

1965లో అమెరికాలోని అర్కాన్సాస్ భూభాగం.. ఫోర్ట్ స్మిత్ లో జన్మించిన మార్క్ కార్నీ, హార్వర్డ్లో ఉన్నత విద్య అభ్యసించారు. గోల్డ్ మెన్ శాక్స్‌లో 13 ఏళ్లు పనిచేసిన కార్నీ, 2003లో బ్యాంక్ ఆఫ్ కెనడా డిప్యూటీ గవర్నర్గా ఎన్నికయ్యారు. 2004లో గవర్నర్ బాధ్యతల నుంచి వైదొలగి ఆర్థిక మంత్రి పదవిని చేపట్టారు. అనంతరం 2008 ఫిబ్రవరి 1న సెంట్రల్ బ్యాంక్ గవర్నర్గా నియమితులయ్యారు. 2008-09 ఆర్థిక సంక్షోభం సమయంలో పరిష్కార మార్గాల్లో కీలక పాత్ర పోషించారు. వడ్డీ రేట్లను సున్నాకు తగ్గించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి అవసరమైన చర్యలను సమన్వయపరచడంలో కీలకంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకున్నారు.

2013లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ గా ఎన్నికైన కార్నీ, మూడు శతాబ్దాల చరిత్ర కలిగిన ఆ సెంట్రల్ బ్యాంక్‌ని  మొట్టమొదటి నాన్-బ్రిటిష్ గవర్నర్‌గా నిలిచారు. అంతేకాదు, జీ7లోని రెండు సెంట్రల్ బ్యాంకులకు నాయకత్వం వహించిన వ్యక్తిగానూ రికార్డ్ సృష్టించారు. 2020లో బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ను వీడిన మార్క్, ఐరాస ఆర్థిక, వాతావరణ మార్పుల విభాగం రాయబారిగా సేవలందించారు.

ట్రూడో రాజీనామా ప్రకటన అనంతరం లిబరర్స్ లో ప్రధానమంత్రి రేసులో ఉన్న నలుగురు అభ్యర్థుల్లో అత్యధిక ఆదరణ పొందారు. దీంతోపాటు ఎక్కువ విరాళాలు సేకరించిన అభ్యర్థిగా నిలిచారు. ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయని, కేబినెట్లో పనిచేసిన అనుభవం లేని కార్నీ, కెనడా తదుపరి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×