Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ… చాలా సీరియస్ గా కనిపించారు. తాజాగా ఎయిర్ పోర్టులో… రోహిత్ శర్మ సీరియస్ అయిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బ్లాక్ టీషర్ట్ లో ఉన్న రోహిత్ శర్మ… తన ఆగ్రహాన్ని… ఎయిర్ పోర్టులో చూపించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ముగిసిన తర్వాత… తన కుటుంబంతో జాలీగా గడిపాడు రోహిత్ శర్మ. ఈ తరుణంలోనే మాల్దీవుల పర్యటనకు కూడా రోహిత్ శర్మ ( Rohit Sharma )వెళ్లడం జరిగింది. అయితే తాజాగా మాల్దీవుల పర్యటన ముగించుకొని…. ఇండియాకు తిరిగి వచ్చాడు రోహిత్ శర్మ. తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలోని… ఎయిర్ పోర్టులో రోహిత్ శర్మ కుటుంబం దిగింది. అయితే ఈ సందర్భంగా… అక్కడికి టీమిండియా అభిమానులు అలాగే… జర్నలిస్టులు కూడా చేరుకున్నారు.
Also Read: Ms Dhoni: వాళ్ల బౌలింగ్ లో బ్యాటింగ్ చేయలేను.. ధోని షాకింగ్ కామెంట్స్
రోహిత్ శర్మ బయటికి వస్తున్న వీడియోను అలాగే ఫోటోలను తీయడం మొదలుపెట్టారు ఫోటోగ్రాఫర్లు. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మ కాస్త అసహనానికి గురయ్యాడు. ఫోటోగ్రాఫర్లపై కోపంతో ఊగిపోయాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. తన కుటుంబ సభ్యులు ఎక్కేందుకు వీలు లేకుండా… కొంతమంది ఫోటోగ్రాఫర్లు అక్కడ రచ్చ చేశారు. వాళ్లను ఫోటోలు తీస్తూ ఇబ్బంది పెట్టారు. దీంతో పక్కకు తప్పుకోవాలంటూ వారిపై రోహిత్ శర్మ ఫైర్ కావడం జరిగింది. కండ్లు దొబ్బాయా అంటూ.. ఎన్నడూ లేని విధంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెచ్చిపోయాడు. ఇక ఫోటోగ్రాఫర్లపై రోహిత్ శర్మ చిందులు వేసిన వీడియో అలాగే ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ వీడియోని చూసిన టీమిండియా అభిమానులు అలాగే రోహిత్ శర్మ ఫ్యాన్స్… భిన్నంగా స్పందిస్తున్నారు. రోహిత్ శర్మకు సపోర్ట్ గా నిలుస్తూ పోస్టులు పెడుతున్నారు. ఏదో జాలిగా వెళ్లి వచ్చిన రోహిత్ శర్మ కుటుంబాన్ని… ఫోటోలతో ఇబ్బంది పెట్టకండి అయ్యా… అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా… చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియాను ఫైనల్ మ్యాచ్లో గెలిపించడంలో రోహిత్ శర్మ తన పాత్రను పోషించాడు. కెప్టెన్ గా రాణించడమే కాకుండా ఫైనల్ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి దుమ్ము లేపాడు.
Also Read: IPL 2025: జియో నుంచి అదిరిపోయే ప్లాన్.. ఇక ఫ్యాన్స్ కు జాతరే ?
ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా… టీ మిండియా నిలిచింది. అయితే ఈ టోర్నమెంట్ పూర్తి కాగానే తన కుటుంబ సభ్యుల తో కలిసి మాల్దీవులకు వెళ్ళాడు రోహిత్ శర్మ. అక్కడ దాదాపు నాలుగు ఐదు రోజులుగా ఎంజాయ్ చేసి ఇవాళ ముంబైలో దిగాడు. అతి త్వరలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) ప్రారంభం కానుంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలోనే ముంబై జట్టులో చేరేందుకు ఇండియాకు వచ్చాడు రోహిత్ శర్మ.
Captain Rohit Sharma Setting the field, even at the airport.😂😂
(The family was getting into the car, so he wanted to keep everyone away from them) pic.twitter.com/vq3HHERI1i
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 17, 2025