BigTV English
Advertisement

Kingdom Movie: ‘కింగ్‌డమ్’ సౌండ్ ట్రాక్ రిలీజ్.. మర్చిపోలేని మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్..

Kingdom Movie: ‘కింగ్‌డమ్’ సౌండ్ ట్రాక్ రిలీజ్.. మర్చిపోలేని మ్యూజిక్ ఇచ్చిన అనిరుధ్..

Kingdom Movie: ఈరోజుల్లో సినిమాలకు సంబంధించిన ప్రతీ అంశాన్ని ప్రేక్షకులు చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు. అందులోనూ ముఖ్యంగా మ్యూజిక్ వల్ల హిట్ అయిన సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఒకప్పుడు సినిమాల నుండి కేవలం పాటలను విడుదల చేస్తే ఆ పాటలే వింటూ ఎంజాయ్ చేసేవాళ్లు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు అలా కాదు.. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాల విషయంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని సినిమాలు యావరేజ్‌గా ఉన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఎలివేషన్స్ వల్లే హిట్ అవుతున్నాయి అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. అందుకే మూవీని ప్రమోట్ చేయడం కోసం ముందుగా మ్యూజిక్‌ను వదిలి కొత్త స్టైల్‌లో ప్రమోషన్స్ మొదలుపెట్టాడు విజయ్ దేవరకొండ.


అప్డేట్స్ మొదలు

ప్రస్తుతం రౌడీ హీరో విజయ్ దేవరకొండకు హిట్ చాలా అవసరం. తను హీరోగా నటించిన గత కొన్ని సినిమాలు డిశాస్టర్ అవ్వడం మాత్రమే కాకుండా దాని వల్ల తను ఓవర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు అంటూ ట్రోల్స్ కూడా ఎక్కువయ్యాయి. అందుకే ఒక సినిమాను హిట్ కొట్టి చూపించాలని విజయ్ చాలా పట్టుదలతో ఉన్నాడు. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ దేవరకొండ చేస్తున్న చిత్రమే ‘కింగ్‌డమ్’. చాలాకాలంగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. అయినా దీని నుండి ఎలాంటి అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్‌లో ఓపిక పోయింది. అందుకే వారిని హ్యాపీ చేయడం కోసం మెల్లగా అప్డేట్స్ విడుదల చేయడం మొదలుపెట్టారు మేకర్స్.


సౌండ్ ట్రాక్ అదిరింది

కొన్నిరోజుల క్రితం గౌతమ్, విజయ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మూవీకి ‘కింగ్‌డమ్’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా టైటిల్‌ను రివీల్ చేస్తూ గ్లింప్స్ విడుదల చేశారు. ఆ తర్వాత సినిమాకు సంబంధించిన టీజర్‌ను కూడా విడుదల చేశారు. ఇక ఈ టీజర్‌లో మ్యూజిక్ హైలెట్‌గా నిలిచిందని చాలామంది ప్రేక్షకులు ప్రశంసించారు. అందుకే మ్యూజిక్ నుండే ప్రమోషన్స్ ప్రారంభించాలని ఫిక్స్ అయిన మేకర్స్.. దీని ఒరిజినల్ సౌండ్ ట్రాక్‌ను ముందే రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. చెప్పినట్టుగానే తాజాగా అనిరుధ్ అందించిన ఒరిజినల్ సౌండ్ ట్రాక్ సంగీతాన్ని తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు హీరో విజయ్ దేవరకొండ.

Also Read: అన్న రూటు ఫాలో అవుతున్న అఖిల్.. అప్‌కమింగ్ సినిమా కోసం ఎన్ని కష్టాలో.!

మ్యూజిక్‌తో హిట్

‘కింగ్‌డమ్’ (Kingdom) సినిమా కథేంటి, అందులో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పాత్ర ఎలా ఉంటుంది లాంటి విషయాలను రివీల్ చేయకుండానే టీజర్ ముగించారు మేకర్స్. కానీ మ్యూజిక్ వింటుంటే విజయ్ ఇందులో చాలా ఇంటెన్స్ రోల్ చేస్తున్నాడనే విషయం మాత్రం అర్థమవుతుంది. ఇప్పుడు అదే మ్యూజిక్‌తో సినిమాపై ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేయాలనుకున్న మేకర్స్ ప్లాన్ కూడా దాదాపుగా సక్సెస్ అని అర్థమవుతోంది. అనిరుధ్ ఒక సినిమాకు సంగీతం అందిస్తున్నాడంటే తన మ్యూజిక్ వల్ల అయినా మూవీ హిట్ అవుతుందని చాలామంది నమ్ముతారు. ఇక ‘కింగ్‌డమ్’ కూడా అదే కేటగిరిలో చేరుతుందని విజయ్ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×