Virender Sehwag: టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan) మధ్య నిన్న మొదటి వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా జరిగిన ఈ మ్యాచ్ నేపథ్యంలో 7 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాల్లో అదరగొట్టిన టీమిండియా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో 16 పరుగుల వద్ద రోహిత్ శర్మ రనౌట్ ( Rohit Sharma run out) అయిన సంగతి తెలిసిందే. టీమిండియా కెప్టెన్ శుభమాన్ గిల్ ( Shubman Gill) సెల్ఫిష్ నెస్ కారణంగానే రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడని సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ సంఘటనపై టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) తన స్టైల్లో స్పందించారు. గౌతమ్ గంభీర్, గిల్ ఇద్దరు కలిసి రోహిత్ శర్మను రనౌట్ అయ్యేలా కుట్రలు చేశారని బాంబు పేల్చారు. రోహిత్ శర్మ తక్కువ స్కోర్ చేస్తూ వరుసగా విఫలమైతే, అతన్ని జట్టులోంచి పంపించాలనే కుట్ర జరుగుతోందని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య నిన్న ధర్మశాల వేదికగా మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇండియా అద్భుతంగా రానించి గెలిచింది. అయితే.. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ 16 పరుగుల వద్ద రన్ అవుట్ అయిన సంగతి తెలిసిందే. సింగిల్ కోసం రోహిత్ శర్మ ప్రయత్నించగా.. గిల్ మాత్రం పిచ్ మధ్యలోకి వచ్చి వెనక్కి వెళ్ళాడు. ఈ క్రమంలో రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత గిల్ ను బండ బూతులు తిట్టాడు రోహిత్ శర్మ. అటు రోహిత్ శర్మ అభిమానులు కూడా గిల్ ను టార్గెట్ చేసి పోస్టులు పెడుతున్నారు. రోహిత్ శర్మను కావాలనే రన్ అవుట్ చేయించాడని ఆగ్రహిస్తున్నారు.
ఇదే అంశంపై తాజాగా టీమ్ ఇండియా డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ స్పందించారు. రోహిత్ శర్మ ను టీమిండియా నుంచి బయటకు పంపించే.. రాజకీయాలు కొనసాగుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా రోహిత్ శర్మ తుది జట్టులో ఉండకుండా గౌతమ్ గంభీర్ అలాగే గిల్ కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపణలు చేశారు. ఈ కుట్రల నేపథ్యంలోనే ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా రోహిత్ శర్మను పక్క ప్లాన్ ప్రకారం రనౌట్ చేశారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలా వరుసగా రోహిత్ శర్మ విఫలమైతే కచ్చితంగా వన్డే వరల్డ్ కప్ స్క్వాడ్ లో ఉండడం కష్టమేనన్నారు. దానికోసమే గిల్ అలాగే గంభీర్ ప్రయత్నాలు చేస్తున్నారని బాంబు పేల్చాడు. రోహిత్ శర్మ పక్కకు జరిగితే ఇషాన్ కిషన్ అలాగే గిల్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారని.. ఇదంతా గంభీర్ నడిపిస్తున్నాడని వీరేంద్ర సెహ్వాగ్ ఆరోపణలు చేసినట్లు ఓ పోస్ట్ వైరల్ గా మారింది.
?utm_source=ig_web_copy_link&igsh=NTc4MTIwNjQ2YQ==