Hafthor Bjornsson 510 kg: రియల్ బాహుబలిని ఎప్పుడైనా చూశారా? ఏకంగా 510 కిలోలు ఎత్తి… సరికొత్త చరిత్ర సృష్టించాడు ఈ మానవ మృగం. అతను ఎవరో కాదు హాఫ్‌థోర్ బ్జోర్న్సన్ ( Hafthor Bjornsson ). గేమ్స్ ఆఫ్ త్రోన్స్ సినిమాలో ది మౌంటెన్ గా గ్రేగర్ క్లెగన్ పాత్ర పోషించాడు హాఫ్‌థోర్ బ్జోర్న్సన్. అలా పాపులర్ అయిన ఈ వెయిట్ లిఫ్టర్ హాఫ్‌థోర్ బ్జోర్న్సన్… తాజాగా సరికొత్త రికార్డు సృష్టించాడు. వెయిట్ లిఫ్టింగ్ లో ఏకంగా 510 కిలోలు ఎత్తి… రికార్డు లోకి ఎక్కాడు. స్ట్రాంగ్ మ్యాన్ 2025 కాంపిటీషన్ లో ( Strong man 2025 Competition ) ఈ సంఘటన చోటుచేసుకుంది. 510 కిలోలు అంటే దాదాపు 1124 పౌండ్ల బరువెత్తి చరిత్ర సృష్టించాడు హాఫ్‌థోర్ బ్జోర్న్సన్. అంతకుముందు ఇదే హాఫ్‌థోర్ బ్జోర్న్సన్… 505 కిలోలు లిఫ్ట్ చేసి తన రికార్డును ఇప్పుడు బ్రేక్ చేసుకున్నాడు. దీంతో హాఫ్‌థోర్ బ్జోర్న్సన్ ( Hafthor Bjornsson ) గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా 510 కిలోల బరువు లిఫ్ట్ చేసిన తరుణంలోనే.. హాఫ్‌థోర్ బ్జోర్న్సన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.
హెవీ వెయిట్ లిఫ్టర్ కం సినీ యాక్టర్ అయిన హాఫ్‌థోర్ బ్జోర్న్సన్ ( Hafthor Bjornsson )… తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం 2025 సంవత్సరానికి సంబంధించిన వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ ( Strong man 2025 Competition ) జరుగుతోంది. అయితే ఈ కాంపిటీషన్ లో ఏకంగా 510 కిలోలు బరువు ఎత్తి చరిత్ర సృష్టించాడు. అంతకు ముందు 505 కిలోల బరువు లిఫ్ట్ చేసి.. ఇప్పుడు 510 కిలోలు కూడా ఎత్తేశాడు. దీంతో సరికొత్త చరిత్ర సృష్టించాడు. 2018లో స్ట్రాంగ్ మ్యాన్ గా కూడా గుర్తింపు తెచ్చుకున్న హాఫ్‌థోర్ బ్జోర్న్సన్… ఇప్పుడు 510 కిలోలు బరువు ఎత్తి… రియల్ బాహుబలి గా చరిత్ర సృష్టించారు.
510 కిలోలు ( Hafthor Bjornsson 510 kg ) ఎత్తడం తనకు… పెద్ద సమస్య కాదని… రికార్డు సృష్టించిన అనంతరం హాఫ్‌థోర్ బ్జోర్న్సన్ స్పష్టం చేశారు. చరిత్ర సృష్టించిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడుతూ… బరువు ఎత్తడం తనకు చాలా సులభమని.. తల కసితో ప్రాక్టీస్ చేసినట్లు వెల్లడించారు. వెయిట్ లిఫ్టింగ్ చేసేందుకు తన రోజువారి ఆహారం అలాగే ప్రణాళికలో ఎలాంటి మార్పులు అస్సలు చేయబోనని… వివరించారు. తన పొట్టను హాయిగా ఉండేలా చూస్తానని… వెయిట్ లిఫ్టింగ్ పైన ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల సక్సెస్ అవుతానని చెప్పుకొచ్చారు హాఫ్‌థోర్ బ్జోర్న్సన్. 510 కిలోల బరువు లిఫ్ట్ చేసిన తరుణంలోనే.. హాఫ్‌థోర్ బ్జోర్న్సన్ పై ప్రశంసల జల్లు కురుపిస్తున్నారు ఆయన అభిమానులు.
Look at how SMOOTHLY Hafthor Bjornsson deadlifts a world record 510kg (~1124lbs).
That is absurd. pic.twitter.com/ubgXqukKQM
— Luke Thomas🏋️♀️ (@lthomasnews) September 6, 2025