BigTV English

Rohith Sharma Scared: ‘భయపడ్డావా రోహిత్ భయ్యా’.. ఫ్యాన్‌ను చూసి ఉలిక్కిపడ్డ హిట్ మ్యాన్.. వీడియో వైరల్

Rohith Sharma Scared: ‘భయపడ్డావా రోహిత్ భయ్యా’.. ఫ్యాన్‌ను చూసి ఉలిక్కిపడ్డ హిట్ మ్యాన్.. వీడియో వైరల్


Rohith Sharma Scared: ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. ఏకంగా హిట్ మ్యాన్ రోహిత్ శర్మనే ఓ అభిమాని భయపెట్టేశాడు. అప్పటిదాకా మ్యాచ్ ఓడిపోతుందనే టెన్షన్ లో ఉన్న రోహిత్‌ను ఒక్కసారిగా వెనుక నుంచి వచ్చి ఓ అభిమాని హత్తుకోగా రోహిత్ భయపడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అది అసలే ముంబై. అందులోను ముంబై ఇండియన్స్ మ్యాచ్. ఇక మీరే చెప్పండి అభిమానులు ఎలా తరలివస్తారో. సొంత గడ్డపై ఆడుతున్న ముంబై మ్యాచ్ చూసేందుకు అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. వాంఖడే స్టేడియంలో ఎటు వైపు చూసినా నీలి రంగులతో మెరిసిపోయేలా చేశారు. ముంబై ఇండియన్స్ అంటూ కేకలు వేస్తూ స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఈ క్రమంలో అభిమాన క్రికెటర్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంట్రీ ఇవ్వగానే ఫ్యాన్స్ అరుపులు, కేకలతో ఉర్రూతలూగిపోయారు. ముంబై కెప్టెన్ హర్థిక్ పాండ్యా అయినా సరే హిట్ మ్యాన్ కు ఉండే ఫాలోయింగ్ వేరు మరి.


ముంబై, రాజస్థాన్ మ్యాచ్ కోసం తరలి వచ్చిన ఫ్యాన్స్.. సొంత గడ్డపై కప్పు కొట్టాలని ముంబైకు సపోర్ట్ చేస్తుంది. దీంతో స్టేడియం అంతా రోహిత్ పేరుతో మారుమోగిపోయింది. ఇక ఏముంది తమ అభిమాన క్రికెటర్‌ను దగ్గరగా చూడాలని.. కలిసి హగ్ చేసుకోవాలని ఎన్నో సాహసాలు చేస్తుంటారు. ఈ తరుణంలో ఓ అభిమాని తన హీరో రోహిత్ శర్మ కోసం స్టేడియంలోకి ప్రవేశించాడు.

Also Read: ఓటమికి నాదే బాధ్యత.. హార్దిక్ పాండ్యా

రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్ చేస్తుండగా.. ముంబై ఇండియన్స్ ఫీల్డింగ్ చేస్తోంది. ఈ తరుణంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న రోహిత్ శర్మను కలిసేందుకు ఓ అభిమాని తీవ్ర ప్రయత్నాలు చేశారు. బౌండరీ లైన్ దాటేసి మరి రోహిత్ శర్మను కలిసేందుకు పరుగులు తీసుకుంటూ స్టేడియంలోకి దూకాడు. రోహిత్ శర్మను హత్తుకునేందుకు ఆయన వద్దకు పరుగుతు తీస్తూ వెళ్లాడు.. అయితే రోహిత్ అటు వైపు తిరిగి ఉండడంతో ఫ్యాన్ రావడాన్ని గమనించలేదు. దీంతో ఒక్కసారిగా అభిమానిని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒక్క క్షణంలో కంగారుతో రెండు అడుగులు వెనక్కి వేశాడు. తర్వాత అభిమాని వచ్చాడని తేరుకుని కాస్త ఊపిరి పీల్చుకున్నాడు. ఇక వెంటనే రోహిత్‌ను అభిమాని హత్తుకుని.. పక్కనే ఉన్న ఇషాన్ కిషన్ ను సైతం హగ్ చేసుకుని తిరిగి వెనక్కి పరుగులు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Tags

Related News

Swastik Chikara’s father: నా కొడుకు క్రికెట్ ఆడకున్నా పర్వాలేదు… కోహ్లీకి నీళ్లు ఇచ్చి బతికేస్తాడు

Indian Cricketers: ఆ ఒక్క నిర్ణయం… టీమిండియా క్రికెటర్లకు రూ.250 కోట్ల నష్టం!

Shubman Gill: సారాతో డేటింగ్… టాలీవుడ్ హీరోయిన్ తో పెళ్లి…చిల్ అవుతున్న గిల్ ?

Manoj Tiwari: రోహిత్‌ను తప్పించేందుకు కుట్ర… అందుకే ప్లేయర్లకు బ్రాంకో టెస్టులు

Kuldeep Yadav: పెళ్లికి ముందే ఆ పని…ఆ లేడీతో కుల్దీప్ యాదవ్ ఎంజాయ్

Manoj Tiwary: ధోని పెద్ద దుర్మార్గుడు… నన్ను జట్టులోంచి కావాలనే తొలగించాడు.. మనోజ్ తివారి సంచలన వ్యాఖ్యలు

Big Stories

×