BigTV English

Rohit Sharma: ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిపించిన రోహిత్‌ కు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త !

Rohit Sharma:  ఛాంపియన్స్‌ ట్రోఫీ గెలిపించిన రోహిత్‌ కు బీసీసీఐ అదిరిపోయే శుభవార్త !

Rohit Sharma:  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు సమాచారం. రోహిత్ శర్మకు ప్రమోషన్‌ ఇవ్వనుందట బీసీసీఐ. టెస్ట్‌ కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మను కొనసాగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఛాంపియన్స్‌ ట్రోఫీలో కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్‌ గా నిలిచింది. దీంతో టెస్ట్‌ కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మను కొనసాగించాలని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి నిర్ణయం తీసుకుందని కథనాలు వస్తున్నాయి. అటు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ విధానంలో మార్పులు కనిపిస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ పవర్ ప్లే లో నిర్భయంగా బ్యాటింగ్ చేయడం మనకు కనిపించింది.


ఛాంపియన్స్ ట్రోఫీ 2024 ఫైనల్ మ్యాచ్ ను ఆరంభం నుంచి దూకుడుగా ఆడాడు రోహిత్ శర్మ. కెప్టెన్‌ రోహిత్ శర్మ దెబ్బకు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో మిగిలిన భారత బ్యాటింగ్ ఆర్డర్ మరింత స్వేచ్ఛగా ఆడింది. రోహిత్ అర్థ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా భారత్ పవర్ ప్లేలో 65 పరుగులు చేసింది. అయితే ఇది ప్రతిసారి వర్కౌట్ అవ్వకపోవచ్చు. ట్రోఫీని పక్కన పెడితే గత దశాబ్దంలో అంతర్జాతీయ క్రికెట్ లో మనం చాలా విజయాలను సాధించాం. కానీ ట్రోఫీలో కూడా గెలవాలి. ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన అనంతరం రోహిత్ స్టార్ స్పోర్ట్స్ తో ఇదే విషయాన్ని గుర్తు చేశాడు.

Also Read: IPL 2025 teams: ఐపీఎల్‌ 2025 ట్రోఫీ 10 జట్ల కెప్టెన్లు వీళ్లే..ఒకే ఒక్కడు విదేశీయుడు ?


ఒక కెప్టెన్ గా మ్యాచ్ ని ఎలా గెలవాలి మరియు ట్రోఫీని ఎలా దక్కించుకోవాలి అనేదానిపై నేను ఎక్కువ దృష్టిని పెట్టాలి అని అనుకున్నాను. దీనికోసం నా వ్యక్తిగత విజయాలను పక్కన పెట్టాల్సి వచ్చింది. మా మిడిలార్డర్ మరియు లోయర్ ఆర్డర్ నాకు చాలా ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి. ఆ తర్వాత ఆడే బ్యాటర్లు రాణించకపోతే నా మీద ఒత్తిడి పడే ప్రమాదం ఉంది. టీమిండియాలో మూడవ నంబర్ నుండి 8వ నంబర్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ ఉంది. పిచ్ ను బట్టి పవర్ ప్లేలో పరుగులు రాబట్టడం చాలా అవసరం. ఇలా చేస్తే బౌలర్లపైన ఒత్తిడి పెరుగుతుంది.

ఒక బ్యాట్స్మెన్ గ్రౌండేడ్ షాట్స్ కొడుతుంటే మరొక బౌలర్ వైమానిక షాట్లు కొట్టాలి. ఇది ప్రత్యర్థి బౌలర్లను కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను ఇలాగే ఆడాలి అని అనుకుంటున్నాను. మ్యాచ్ ను గెలిచి ట్రోఫీని గెలవకపోతే పరుగులు సాధించి ప్రయోజనం ఉండదు. పరుగులు సాధించినప్పుడు కప్పును కూడా గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఇకపై నుంచి నేను ఇదే పద్ధతిని అనుసరిస్తానని రోహిత్ చెప్పుకొచ్చాడు. అయితే.. ఈ తరుణంలోనే… కెప్టెన్ రోహిత్ శర్మకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అదిరిపోయే శుభవార్త చెప్పినట్లు సమాచారం. టెస్ట్‌ కెప్టెన్‌ గా రోహిత్‌ శర్మను కొనసాగించాలని అనుకుంటున్నారట. ఇంగ్లాండ్‌ తో టూర్‌ కు కెప్టెన్‌ గా రోహితే ఉండనున్నాడట.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×