Bollywood:..బాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న హృతిక్ రోషన్ (Hrithik Roshan) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. బాలీవుడ్ లోనే కాదు తెలుగులో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఈయన వార్ -2 (War -2) సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కీలకపాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే హృతిక్ రోషన్ కెరియర్ పరంగా బిజీగా దూసుకుపోతున్నారు.
రోజుకు 9గంటలు నరకం అనుభవించాను- సునయన రోషన్..
ఇదిలా ఉండగా హృతిక్ రోషన్ కి సునయన రోషన్(Sunaina Roshan) అనే చెల్లెలు కూడా ఉంది. తాజాగా ఈమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె పంచుకుంది. ముఖ్యంగా తాను మద్యానికి బానిస అయ్యానని, ఆ వ్యసనం నుంచి బయటపడడానికి అంతకుమించి ఇబ్బందులు పడినట్లు తెలిపింది. రిహాబిలిటేషన్ సెంటర్లో నరకం అనుభవించాను అంటూ సునయన చెప్పుకొచ్చింది. సాధారణ పునరావాస కేంద్రం కంటే అక్కడ ఇంకా అద్వానంగా ఉంటుందని కూడా తెలిపింది. దీనిపై సునయన మాట్లాడుతూ.. “మద్యం మానడానికి అది మొత్తం 28 రోజుల కోర్సు. అయితే ఇది సాధారణ పునరావాసం లాంటిది కాదు. ప్రాథమికంగా అక్కడ ఎలాంటి వ్యసనానికైనా కూడా చికిత్స అందిస్తారు. దాదాపు ఆ సెంటర్లో 56 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే అక్కడ వాతావరణం సాధారణం కంటే అత్యంత దారుణంగా ఉంటుంది. నార్మల్ రిహాబిలిటేషన్ సెంటర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు . కానీ రోజుకు 9 గంటల పాటు నన్ను ఒకే గదిలో ఉంచేవారు. అలా నిత్యం ప్రత్యక్షంగా నరకం అనుభవించాను” అంటూ తెలిపింది సునయన రోషన్.
జీవితంలో బాగుపడడానికే అక్కడికి వెళ్లాను- సునయన
ఇక అలాంటి నరకాన్ని తన జీవితంలో ఎప్పుడూ అనుభవించలేదు అని చెప్పిన ఆమె.. మద్యానికి బానిసను అయ్యాను కాబట్టే ఆ బానిసత్వం నుండి బయట పడడానికే అక్కడికి వెళ్లానని తెలిపింది. ముఖ్యంగా మద్యం వ్యసనం నుండి బయట పడేందుకు, జీవితంలో ముందుకు సాగడానికి ఇది ఒక అడుగుగా భావించినట్లు తెలిపింది సునయన. ఇక ఆ సమయంలో కేవలం నాకు కాల్ చేసే వ్యక్తుల నంబర్లు మాత్రమే అమ్మ వారికి ఇచ్చింది. అక్కడికి సెల్ ఫోన్లు, షుగర్, కాఫీ, పెర్ఫామ్ , చాక్లెట్ వంటివి అనుమతించారు. అయితే పునరావాసం నుంచి బయటపడిన క్షణంలోనే నా తండ్రి రాకేష్ రోషన్ కు క్యాన్సర్ ఉందని తెలిసింది. ఇక ఆరోజు రాత్రి నిద్ర పట్టలేదు అని కూడా ఆమె తెలిపింది. ఇక అలా మొత్తానికైతే మద్యం బానిసత్వం నుండి బయటపడడానికి కోర్సు తీసుకున్నానని చెప్పిన ఈమె, ఆ కోర్స్ లో భాగంగానే నరకం అనుభవించానని, ప్రస్తుతం సంతోషంగా జీవితాన్ని లీడ్ చేస్తున్నానని కూడా తెలిపింది సునయన రోషన్. ఏది ఏమైనా ఈమె చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.