IPL 2025 teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు ( Indian Premier League 2025 Tournament ) కౌంట్ కౌంట్ డౌన్ షురూ అయింది. మరో వారం రోజుల్లోనే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ప్రారంభం కాబోతుంది. దీంతో… తమ ఫ్రాంచైజీ జట్లలో ప్లేయర్ లందరూ చేరిపోతున్నారు. గ్రౌండ్ లో దిగి నెట్ ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. మరో వారం రోజుల్లో టోర్నమెంట్ ప్రారంభం కానున్న నేపథ్యంలో…కెప్టెన్ ను ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పటి వరకు 9 మంది జట్ల కెప్టెన్లను ప్రకటించగా… తాజాగా కెప్టెన్ ను ప్రకటించింది ఢిల్లీ క్యాపిటల్స్.
Also Read: Nitish Kumar Reddy: SRH అభిమానులకు గుడ్ న్యూస్… వీరుడు వస్తున్నాడు!
దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో పది జట్లకు కెప్టెన్లు రెడీ అయ్యారు. అయితే… ఈ పది జట్లలో… దాదాపు అందరూ ఇండియాకు చెందిన వారే ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ( Sunrisers Hyderabad) కెప్టెన్ మినహా.. మిగిలిన అందరూ కూడా ఇండియాకు చెందిన వారే ఉన్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ( Pat Cummins ) ఒకే ఒక్కడు… ఫారెన్ కు చెందిన వాడు. చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ , రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు అందరూ ఇండియాకు చెందిన వారే కెప్టెన్లుగా కొనసాగుతున్నారు.
గతంలో… పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కూడా విదేశీ ప్లేయర్లే కెప్టెన్లుగా కొనసాగారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఒక్కడే విదేశీ కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. అయితే.. ఇటీవల గాయపడిన ప్యాట్ కమిన్స్..కోలుకున్నాడు. లేకపోతే.. ఈ సారి సన్‌రైజర్స్ హైదరాబాద్ కు ఇండియా వాడే కెప్టెన్ అయ్యేవాడు. కాగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ మార్చి 22వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. మే 25 వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్ ఉంటుంది. ఈ సారి ఫైనల్ మ్యాచ్, ఫస్ట్ మ్యాచ్ రెండు కూడా… కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరుగుతుంది. ఇక ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ కేకేఆర్ మధ్య జరుగనుంది.
Also Read: Jasprit Bumrah: ముంబైకి షాక్… బుమ్రా ఇక రావడం కష్టమే!
1. చెన్నై సూపర్ కింగ్స్ – రుతురాజ్ గైక్వాడ్
2. ఢిల్లీ క్యాపిటల్స్ – అక్షర్ పటేల్
3. గుజరాత్ టైటాన్స్ – శుభ్‌మన్ గిల్
4. కోల్‌కతా నైట్ రైడర్స్ – అజింక్య రహానె
5. లక్నో సూపర్ జెయింట్స్ – రిషబ్ పంత్
6. ముంబై ఇండియన్స్ – హార్దిక్ పాండ్యా
7. పంజాబ్ కింగ్స్ – శ్రేయాస్ అయ్యర్
8. రాజస్థాన్ రాయల్స్ – సంజు శాంసన్
9. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – రజత్ పాటిదార్
10. సన్‌రైజర్స్ హైదరాబాద్ – పాట్ కమిన్స్