Big Stories

Rohit Sharma: మేం ముగ్గురం కలవలేదు.. ధోనీ గురించి చెప్పలేను: రోహిత్ శర్మ

Rohit Sharma: ఒకవైపు ఐపీఎల్ మ్యాచ్ లు బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇవిలా ఉండగానే టీ 20 వరల్డ్ కప్ నకు సంబంధించి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందులో టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ వెళ్లి అజిత్ అగార్కర్, రాహుల్ ద్రవిడ్ తో కలిశాడని, జట్టుపై ఒక అంచనాకు వచ్చేశారని అంటున్నారు.

- Advertisement -

ఈ విషయమై రోహిత్ శర్మ మాట్లాడుతూ.. అవన్నీ ఊహాగానాలేనని కొట్టి పారేశాడు. ఇంతకీ తనేమన్నాడంటే అజిత్ అగార్కర్ దుబాయ్ లో ఉన్నాడు. గోల్ఫ్ ఆడేందుకు వెళ్లాడు. ఇక రాహుల్ ద్రవిడ్ బెంగళూరులో ఉన్నాడు. తన పిల్లలతో ఆడుకుంటున్నాడు. ఇంక మేం ముగ్గురం ఎప్పుడు కలుసుకుంటాం.. ఎప్పుడు జట్టుని ఫైనలైజ్ చేస్తామని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

- Advertisement -
Rohit Sharma
Rohit Sharma

నిజానికి మేం ముగ్గురం కలిస్తే మాత్రం ప్రజలకి, ముఖ్యంగా మీడియాకి తప్పకుండా చెబుతామని, ఎవ్వరూ కంగారు పడాల్సిన పనేలేదని అన్నాడు. అంతేకాదు ఇదేమీ దాచుకునే విషయం కాదని అన్నాడు. ఐపీఎల్ లో కుర్రాళ్లు అద్భుతంగా ఆడుతున్నారని తెలిపాడు. ఇప్పుడు టీ 20 వరల్డ్ కప్ జట్టుని ఎంపిక చేయడం కత్తిమీద సాములా మారిందని అన్నాడు.

ఇక మహేంద్రసింగ్ ధోనీ విషయంపై పలు అంశాలు మాట్లాడాడు. టీ 20 వరల్డ్ కప్ కి ధోనీ మెంటర్ గా రావడం కష్టమేనని అన్నాడు. 2021 వరల్డ్ కప్ కి తను మెంటర్ గా ఉండటం అందరికీ తెలిసిందే. తనిప్పుడు మోకాలినొప్పితో బాధపడుతున్నాడు. ఐపీఎల్ అయిన వెంటనే టీ 20 ప్రపంచ కప్ సన్నాహక శిబిరం ప్రారంభమవుతుంది.

ఇక అప్పటి నుంచి తను మాతోనే ఉండాల్సి ఉంటుంది. సుమారు నెల రోజులు మళ్లీ అలుపెరగని ప్రయాణం ఉంటుంది. అంతేకాదు వెస్టిండీస్ వెళ్లాల్సి ఉంటుంది. అదొక సుదీర్ఘ ప్రయాణం. ఇవన్నీ తను ఒప్పుకుంటాడని అనుకోవడం లేదని అన్నాడు.

Also Read: సంజూ.. నీకిది తగదు.. జోస్ బట్లర్ ని విమర్శిస్తావా? నెట్టింట ఫైర్

కాకపోతే అమెరికా రావచ్చని అన్నారు. ఎందుకంటే గోల్ఫ్ ఆడేందుకు తనక్కడికి వస్తాడని తెలిపారు. ఆ సమయంలో తమతో పాటు ఉండమంటే, అంగీకరించే అవకాశాలున్నాయని అన్నాడు.
తను మొన్న జరిగిన మ్యాచ్ లో 4 బంతుల్లో 20 పరుగులు చేసి, మ్యాచ్ ని మా నుంచి లాగేసుకున్నాడని నవ్వుతూ తెలిపాడు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News