BigTV English

YS Vivekananda Case Updates: వివేకా పీఏ ఫిర్యాదుపై నివేదిక.. న్యాయస్థానం తీర్పు ఎటు

YS Vivekananda Case Updates: వివేకా పీఏ ఫిర్యాదుపై నివేదిక.. న్యాయస్థానం తీర్పు ఎటు

YS Vivekananda Case Updates: వైఎస్ వివేకానంద హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు వ్యవహారం ఒక అడుగు ముందుకేస్తే.. మూడు అడుగులు వెనక్కి వెళ్తోంది. తాజాగా వివేకానంద పీఏ కృష్ణారెడ్డి వేసిన ప్రైవేటు కేసుపై పులివెందుల పోలీసులు విచారణ చేపట్టారు. నివేదికను పులివెందుల న్యాయస్థానానికి అందజేశారు. వచ్చవారంలో తీర్పు వెల్లడించే అవకాశముంది.


అసలేం జరిగింది?

వివేకానంద హత్య కేసులో ఒక్కో చిక్కుముడి వీడుతున్నట్లు కనిపిస్తోంది. మూడేళ్లు కిందట అంటే 2022లో పులివెందుల కోర్టులో ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేశారు వైఎస్ వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి.వివేకా హత్య కేసులో వైసీపీ నాయకుల పేర్లు చెప్పాలంటూ అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్ కొట్టారన్నది ప్రధాన ఆరోపణ.  ఆయన చెప్పినట్లు వినాలని వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖరరెడ్డి తమను బెదిరించారని ఫిర్యాదులో ప్రస్తావించారు. న్యాయస్థానం ఆదేశాలతో ముగ్గురిపై కేసు నమోదయింది.


పులివెందుల పోలీసులు దర్యాప్తు

కేసు నమోదుపై గతేడాది హైకోర్టుకు వెళ్లారు సునీత, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డి. అక్కడా వారికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. దీనిపై న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి పలుమార్లు హోంమంత్రి అనిత, సీఎం చంద్రబాబును వైఎస్ వివేకానంద కూతురు సునీత దంపతులు కలిశారు. ఈ క్రమంలో తమపై వేసిన కేసు గురించి చర్చించారంటూ వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో విచారణ చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. నాలుగు నెలలు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన విషయం తెల్సిందే.

ఈ కేసులో మొత్తం 23 మంది సాక్షులుగా ఉన్నవారందరినీ విచారించారు. వారందరి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. వారిలో వైఎస్ మనోహర్ రెడ్డి, న్యాయవాది ఓబుల్ రెడ్డితోపాటు పీఏ కృష్టారెడ్డి కూడా ఉన్నారు. సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా నివేదికను సిద్ధం చేశారు పులివెందుల పోలీసులు.

ALSO READ: 55 మంది వైద్యులకు ఝలక్ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

రిపోర్టు మాటేంటి?

వివేకా హత్య కేసులో అప్పటి సీబీఐ ఎస్పీ రాంసింగ్, సునీత, రాజశేఖర్ రెడ్డి బెదిరించారనే ఫిర్యాదులో వాస్తవం లేదని తేల్చారు. ఈ మేరకు పులివెందుల కోర్టులో డీఎస్పీ మురళీ నాయక్ తుది నివేదికను అందజేశారు. పోలీసులు సమర్పించిన ఈ నివేదికను మెజిస్ట్రేట్ పరిశీలించి ఓ నిర్ణయానికి రానున్నారు.

ఫిర్యాదు దారుడు కృష్ణారెడ్డికి పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు పెట్టిన కేసు తప్పుడు కేసని తేల్చారు. ఈనేపథ్యంలో పులివెందుల కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉంది. ముగ్గురి పిటిషన్లపై ఈనెల 22న సుప్రీంకోర్టులో విచారణ జరపనుంది. దీనిపై సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కేసు విచారణ జరుగుతుండగా ఎందుకు దర్యాప్తు చేశారని ప్రశ్నిస్తుందా? లేక కింది కోర్టులో తేల్చుకోమని చెబుతా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు న్యాయస్థానానికి పులివెందుల పోలీసులు రిపోర్టు సమర్పించగానే గురువారం పులివెందుల వెళ్లారు వివేకానంద కూతురు. ఇప్పుడు వివేకానంద ఫ్యామిలీ సభ్యులు న్యాయస్థానం తీర్పు ఎలా ఉంటుందనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×