E-Paper
Advertisement

T20 world cup : కెప్టెన్‌గా T20ల్లో రోహిత్‌ మరో రికార్డ్

T20 world cup : కెప్టెన్‌గా T20ల్లో రోహిత్‌ మరో రికార్డ్
Advertisement

T20 world cup : T20 వరల్డ్ కప్ లో భారత ఆటగాళ్లు మ్యాచ్ మ్యాచ్ కూ సరికొత్త రికార్డులు నెలకొల్పుతున్నారు. సూపర్-12లో జింబాబ్వేపై ఘన విజయం తర్వాత… టీమిండియా కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది కెప్టెన్ గా 21 T20 మ్యాచ్ ల్లో విజయాన్ని అందుకున్నాడు… రోహిత్ శర్మ. దాంతో… ఒక ఏడాదిలో అత్యధిక T20 విజయాలు అందుకున్న కెప్టెన్ గా రోహిత్‌ శర్మ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకుముందు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పేరిట ఈ రికార్డు ఉండేది. 2021లో పాకిస్తాన్‌ కెప్టెన్‌గా బాబర్‌ 20 T20 మ్యాచ్ ల్లో విజయాలు సాధించాడు. ఇప్పుడు బాబర్‌ను వెనక్కి నెట్టిన హిట్‌మ్యాన్‌… తొలిస్థానంలో నిలిచాడు. 2018లో పాక్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ 18 T20 విజయాలు అందుకోగా… 2016లో కెప్టెన్ గా ధోనీ 15 విజయాలు సాధించాడు.

T20ల్లో ఆటగాడిగా కూడా రోహిత్ శర్మ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్‌గా 100 T20ల్లో గెలిచిన ఆటగాడిగా… రోహిత్ శర్మ విజయాల సెంచరీ కొట్టాడు. రోహిత్ తర్వాత 87 T20 విజయాలతో పాక్ సీనియర్ క్రికెటర్ రెండోస్థానంలో ఉండగా… మూడో స్థానంలో 75 T20 విజయాలతో విరాట్ కోహ్లీ ఉన్నాడు.

Advertisement

జింబాబ్వేపై ఘనవిజయంతో… ఓ ఏడాది 50 పరుగులకు పైగా తేడాతో 10 సార్లు గెలిచిన జట్టుగా రోహిత్ సేన రికార్డు సృష్టించింది. ఇక న్యూజిలాండ్… ఈ ఏడాది 50కి పైగా పరుగుల తేడాతో 6 విజయాల్ని అందుకుని రెండో స్థానంలో ఉంది. 2018లో 5 సార్లు ఈ ఫీట్ అందుకున్న పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×