Saaniya Chandhok : టీమిండియా మాజీ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. ఎందుకంటే..? సచిన్ పేరుకే బ్రాండ్ ఉంటుంది. ఇటీవలే అతని కుమారుడు అర్జున్ టెండూల్కర్ కి ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. దీంతో అర్జున్ టెండూల్కర్ కొత్త ఇన్నింగ్స్ ని ప్రారంభించాడు. తన స్నేహితురాలు సానియా చందోక్ తో పాటు నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆగస్టు 13న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం జరుపుకున్నారు. అయితే ఈ వేడుక అర్జున్ తనకంటే వయస్సులో పెద్దదైన అమ్మాయిని జీవిత భాగస్వామిగా ఎంపిక చేసుకోవడం ఆసక్తికరంగా మారింది. సచిన్ భార్య అంజలి కూడా తనకంటే వయస్సులో పెద్దదే కావడం విశేషం. దీంతో పెళ్లి విషయంలో సచిన్ ని తన కుమారుడు అర్జున్ అనుసరించడం గమనార్హం.
Also Read : Rohit – Haridk : గణపతి పూజలో రోహిత్ శర్మ… అదిరిపోయే లుక్ లో హార్దిక్… దుబాయ్ కి జంప్
అర్జున్ టెండూల్కర్ ప్రస్తుతం వయస్సు 25 సంవత్సరాలు. 1999 సెప్టెంబర్ 24. అర్జున్ కాబోయే భార్య సానియా చందోక్ 1998 జూన్ 23న జన్మించింది. అర్జున్ కంటే ఆమె దాదాపు 15 నెలలు పెద్దది. ఇలాంటి విషయం సచిన్ జీవితంలో కూడా చోటు చేసుకుంది. సచిన్ 1973లో జన్మించగా..అంజలి 1967లొ జన్మించింది. సచిన్ కంటే అతని భార్య ఆరేళ్లు పెద్దది. అయితే అర్జున్ టెండూల్కర్-సానియా చందోక్ కి వివాహం కాకముందే ఇటీవల గణేష్ మండపాన్ని సందర్శించారు. తాజాగా సచిన్ ఫ్యామిలీ మధ్యప్రదేశ్ లోని మహేశ్వర్ ను సందర్శించారు. సచిన్, అంజలి, సారా, సచిన్ తల్లి, కాబోయే కోడలు సానియా చందోక్ ఉన్నారు. అర్జున్ టెండూల్కర్ మాత్రం మధ్యప్రదేశ్ వెళ్లలేదు. ఈ తరుణంలోనే సచిన్ మహేశ్వర్ అందాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే అందులో సానియా కూడా ఉండటంతో పెళ్లికి ముందే కుటుంబంతో పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఏంటి..? అని కొందరూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరూ మాత్రం తన స్నేహితురాలు సారా టెండూల్కర్ తో కలిసి వెళ్లింది. అయితే ఇందులో తప్పేముంది అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు సచిన్ తన ఇన్ స్టాగ్రామ్ లో అద్భుతమైన ఫొటోలను షేర్ చేశాడు. ముఖ్యంగా “మధ్యప్రదేశ్ ను అద్భుత భారతదేశం హృదయం” అని అభివర్ణించారు. ఇక మహేశ్వర్ సంస్కృతి, చరిత్ర, వారసత్వం, ఆతిథ్యం అన్నీ ఒకే చోట కనిపిస్తాయయి. అహల్య కోట నుంచి ప్రశాంతమైన నర్మదానది వరకు ప్రతిదీ అద్భుతమే. కుటుంబంతో గడిపిన క్షణాలు మాత్రం మరుపురానివి అంట పోస్ట్ చేశాడు సచిన్. అహల్య కోట ప్రశాంతమైన నర్మదా నది ఒడ్డున గడిపిన క్షణాలు తమకు ఎంతగానో నచ్చాయన్నారు. ముఖ్యంగా మహేశ్వర్ పట్టణం నర్మదా నది ఒడ్డున ఒకప్పుడు మరాఠా రాణి అహల్యా బాయి హోల్కర్ రాజధానిగా ఉండే దట. ఈ పట్టణం చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. 1818లో రాజధాని ఇండోర్ కి మారే వరకు.. ఇది మాల్వాకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇక మహేశ్వర్ పర్యటనలో సచిన్ మంచి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు.