Rohit – Haridk : ప్రస్తుతం దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రిటీలు గణపతిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. మరో రెండు రోజుల్లో గణేషుడిని నిమజ్జనం చేయనుండటంతో సెలబ్రిటీలు వినాయకుడిని దర్శించుకుంటున్నారు. తాజాగా టీమిండియా వన్డే క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై లోని వర్లిలో వినాయకుడిని దర్శించుకున్నారు. రోహిత్ శర్మ నిన్నరాత్రి గణపతిని దర్శించుకునేందుకు రాగా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి తరలివచ్చారు. గణపతిని దర్శించుకునే సమయంలో రోహిత్ చుట్టూ పెద్దగా బారులు తీరారు. గణేషుడి ఆశీస్సులు తీసుకున్న హిట్ మ్యాన్ కి నిర్వాహకులు లంబోదరుడి ఫొటోను అందజేసారు. రోహిత్ శర్మ గత నెలలో కాస్త లావుగా, బొద్దుగా కనిపించేవాడు. కేవలం 22 రోజుల వ్యవధిలోనే దాదాపు 10 కేజీల బరువు తగ్గడం విశేషం. రోహిత్ సన్నబడి.. ఫిట్ గా మారాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కొత్త లుక్ తో ఫ్యాన్స్ ని సర్ ఫ్రైజ్ చేసారు. ప్లాటినం బ్లాండ్ హెయిర్ స్టైల్తో కనిపించారు. ఈ న్యూ లుక్ ఫొటోలను ఇన్ స్టాలో షేర్ చేశారు. ఆసియా కప్ కోసం హార్దిక్ పాండ్యా రెడీ అయ్యారని.. అతని ట్రాన్స్ ఫమేషన్ అదిరిపోయిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సెప్టెంబర్ 09న మొదలయ్యే ఈ టోర్నీ కోసం ఇప్పటికే హార్దిక్ పాండ్యా దుబాయ్ చేరుకున్నారు. ప్రస్తుతం హార్దిక్ పాండ్యా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో యోయో, బ్రాంకో టెస్ట్ కి హాజరయ్యారు. టెస్ట్ ఫార్మాట్, టీ-20 క్రికెట్ కి వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. కేవలం వన్డే మ్యాచ్ లు మాత్రమే ఆడుతున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్ ఆడిన తరువాత రోహిత్ శర్మ మైదానానికి దూరంగా ఉన్నాడు. బ్రాంకో టెస్ట్ లో సక్సెస్ సాధించి సూపర్ ఫిట్ గా ఉన్నానని నిరూపించుకున్నాడు.
రోహిత్ ఏకంగా 20 కిలోల బరువు తగ్గాడట. రోహిత్ బరువు 3 నెలల కిందట 95 కేజీలుంటే.. ప్రస్తుతం 75 కేజీలున్నట్టు సమాచారం. ముఖ్యంగా రోహిత్ మంచి భోజన ప్రియుడు.. దాల్ చావల్, వడా పావ్, చికెన్, బిర్యానీ వంటి వంటకాలను చాలా ఇష్టంగా తింటాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా న్యూ లుక్ లో కనబడి వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 09 నుంచి 28 వరకు యూఏఈ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీ కోసం భారత క్రికెట్ జట్టు యూఏఈ కి బయలుదేరింది. తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో, రెండో మ్యాచ్ ని సెప్టెంబర్ 14న పాకిస్తాన్ తో తలపడనుంది. ఈ టోర్నీలో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగనుంది. అయితే ఆసియా కప్ లో హార్దిక్ పాండ్యా చాలా కీలకంగా మారనున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ గా రికార్డును నెలకొల్పనున్నాడు. 6 వికెట్ల తీస్తే.. 100 వికెట్లు తీసిన తొలి భారతీయుడిగా.. ప్రపంచంలో రెండో ఆటగాడిగా నిలుస్తాడు.
VIDEO OF THE DAY.
Rohit Sharma offered prayers & taking blessings from Lord Ganpati Bappa. 🥹 pic.twitter.com/1ZHOJueuOq
— Johns. (@CricCrazyJohns) September 4, 2025