BigTV English

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Madharaasi Movie Review : ‘మదరాసి’ మూవీ రివ్యూ: ‘తుపాకీ’ స్టైల్లో ఉన్న డమ్మీ గన్

Madharaasi Movie Review : మురుగదాస్ – శివకార్తికేయన్ కాంబినేషన్లో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ ‘మదరాసి’. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. మొదటి నుండి ఈ ప్రాజెక్టుపై పెద్దగా బజ్ లేదు. అందుకు కారణం దర్శకుడు మురుగదాస్ ఫామ్లో లేకపోవడం వల్లనే అని చెప్పాలి. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. ప్రేక్షకులను ఎంతవరకు అలరించిందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..


కథ:

విరాట్ (విద్యుత్ జమ్వాల్) నార్త్ మాఫియాకి చెందిన వ్యక్తి. అతను తమిళనాడుకి గన్స్ అండ్ వెపన్స్ ని ఇల్లీగల్ గా తరలించి.. అక్కడి జనాలకు ముఖ్యంగా పెద్ద వాళ్ళకి గన్ కల్చర్ ను అలవాటు చేయాలని భావిస్తాడు. అందుకు తన స్నేహితుడు చిరాగ్‌ (షబీర్ కల్లారకల్)సాయంతో ఓ సిండికేట్ ను అప్రోచ్ అవుతాడు. అయితే తమిళనాడుకు అక్రమంగా మోస్ట్ డేంజరస్ వెపన్స్ వస్తున్నాయి అని ఎన్.ఐ.ఎ చీఫ్ ప్రేమనాథ్‌ (బీజు మీనన్) కి తెలుస్తుంది. ఇది ఆపాలని ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రయత్నం ఫలించదు. పైగా విరాట్ చేతిలో అతను తీవ్రంగా గాయపడతాడు.

మరోవైపు లవ్ ఫెయిల్యూర్ కారణంగా ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు రఘురామ్‌ (శివకార్తికేయన్). కరెక్ట్ గా అదే టైంలో ప్రేమ్ అతనికి పరిచయం అవుతాడు. రఘు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండటంతో ఒకే అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తారు. ఆ తర్వాత ఏం జరిగింది? రఘు గర్ల్ ఫ్రెండ్ మాలతి(రుక్మిణి వసంత్) నిజంగానే అతన్ని మోసం చేసిందా?ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? చివరికి విరాట్ లక్ష్యం నెరవేరిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే మిగిలిన సినిమా.


విశ్లేషణ :

యాక్షన్ సినిమాలు తీయడంలో మురుగదాస్ కి సెపరేట్ స్టైల్ ఉంది. ‘గజినీ’ ‘కత్తి’ ‘తుపాకీ’ సినిమాల్లో అది స్పష్టంగా కనిపిస్తుంది. కేవలం ఎ క్లాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మాత్రమే కాదు సి క్లాస్ ఆడియన్ కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఆయన ఆ సినిమాల్లో యాక్షన్ సీన్స్ ను డిజైన్ చేశారు. అలాగే ఆ సినిమాల్లో ఎమోషనల్ కనెక్టివిటీ కూడా పెద్ద పీట వేశారు. కానీ తర్వాతి సినిమాల్లో అది క్రమంగా తగ్గుతూ వచ్చింది. ‘స్పైడర్’ నుండి మురుగదాస్ డౌన్ ఫాల్ మొదలైంది. విజయ్ తో చేసిన ‘సర్కార్’ రజినీకాంత్ తో చేసిన ‘దర్బార్’ సల్మాన్ ఖాన్ తో చేసిన ‘సికందర్’ వంటి సినిమాలు చూస్తే ‘ ‘స్పైడర్’ బెటర్ కదా’ అనిపించాయి.

‘మదరాసి’ తో కచ్చితంగా ఆయన హిట్టు కొట్టి ట్రాక్ లోకి వస్తారు అని అంతా అనుకున్నారు. కానీ ‘మదరాసి’ లో కొత్తగా మురుగదాస్ చేసింది అంటూ ఏమీ లేదు. ఒకవేళ బలవంతంగా చెప్పమని అడిగితే అది శివ కార్తికేయన్ పాత్ర అనే చెప్పాలి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ‘మదరాసి’ విషయానికి వస్తే.. ‘తుపాకీ’ ‘గజినీ’ కథలను అటు తిప్పి ఇటు తిప్పి మిక్సీలో వేసి జ్యూస్ తీశాడు. మొదట్లో కథ సీరియస్ గా మొదలవుతుంది. ఆ తర్వాత వచ్చే లవ్ స్టోరీ బోర్ కొట్టిస్తుంది.

అలాగే ఇంటర్వెల్ కి ముందు వరుసగా 3 పాటలు వచ్చి మరింత ఇరిటేట్ చేస్తాయి. సెకండాఫ్ కథ మురుగదాస్ వద్ద లేనట్టు ఉంది. ఎక్కడెక్కడికో తిప్పి మమ అనిపిస్తాడు. అలాగే కొన్నాళ్లుగా తన మ్యూజిక్ తో అన్ని సినిమాలను గట్టెక్కిస్తూ వచ్చిన అనిరుధ్ ఈ సినిమాకి మాత్రం న్యాయం చేయలేకపోయాడు. బహుశా అతని వద్ద టైం లేక హడావిడి హడావిడిగా మ్యూజిక్ ఇచ్చేసి వదిలించుకున్నట్టు ఉన్నాడు. ఒక్క ట్యూన్ కూడా మైండ్లోకి వెళ్ళదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు తెరపై కనిపిస్తుంది. కాబట్టి సినిమాటోగ్రాఫర్ సుదీప్ ఎలోమన్ కి కూడా ఆ క్రెడిట్ వెళ్తుంది.

నటీనటుల విషయానికి వస్తే.. ఇంతకు ముందు చెప్పా కదా దర్శకుడు మురుగదాస్ ఈ సినిమా విషయంలో కరెక్ట్ గా వాడుకున్నది హీరో శివ కార్తికేయన్ ను మాత్రమే. ఇంకో రకంగా చెప్పాలంటే శివ కార్తికేయన్ ఇమేజ్ పై ఆధారపడి అతను ‘మదరాసి’ తీశాడు అనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. శివ కార్తికేయన్ మాత్రం తన బెస్ట్ ఇచ్చాడు. ఇక రుక్మిణీ వసంత్ ఎప్పటిలానే లుక్స్ తో ఆకట్టుకుంది. నటన పరంగా పేలవంగానే అనిపించింది. విద్యుత్ జమ్వాల్ తుపాకీకి కంటిన్యుటీ రోల్ చేశాడేమో అనిపిస్తుంది. పెద్దగా మనసు పెట్టి అతను ఈ సినిమాలో నటించినట్టు లేదు. బీజూ మీనన్ పాత్రను కూడా సరిగ్గా వాడుకోలేదు.

ప్లస్ పాయింట్స్ :

శివ కార్తికేయన్
నిర్మాణ విలువలు
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ :

డైరెక్షన్
లవ్ ట్రాక్
మ్యూజిక్

మొత్తంగా ‘మదరాసి’ .. ‘తుపాకీ’ స్టైల్లో మొదలవుతుంది. కానీ ఆ సినిమాలో 10వ వంతు సంతృప్తి కూడా ఆడియన్స్ కి ఇవ్వదు.

Madharaasi Movie Rating : 2/5

Related News

Baaghi 4 Review : ‘బాఘీ 4’ మూవీ రివ్యూ… దుమ్మురేపే యాక్షన్, కానీ అసలు కథ మిస్

The Conjuring: Last Rites Review : ‘ది కాంజ్యూరింగ్: లాస్ట్ రైట్స్’ రివ్యూ… లొరైన్ దంపతులకు పర్ఫెక్ట్ సెండాఫ్

Ghaati Movie Review : ఘాటీ రివ్యూ – ఇదో భారమైన ఘాట్ రోడ్

Madharaasi Twitter Review: మదరాసి ఈ సినిమా ట్విట్టర్ రివ్యూ

Ghaati Twitter Review: ‘ఘాటీ’ ట్విట్టర్ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Big Stories

×