BigTV English

DC vs GT IPL 2024 Preview: ఢిల్లీ రాజు ఎవరు? నేడు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్

DC vs GT IPL 2024 Preview: ఢిల్లీ రాజు ఎవరు? నేడు గుజరాత్ వర్సెస్ ఢిల్లీ మధ్య మ్యాచ్
DC vs GT Dream11 Prediction IPL 2024: ఐపీఎల్ లో ఆల్రడీ కొన్ని జట్లు ప్లే ఆఫ్ రేస్ లో దూసుకు పోతున్నాయి. కాకపోతే ఆశ చావని కొన్ని జట్లు ఇంకా ఏదో సాధించాలని పోరాడుతున్నాయి. అలాంటివాటిలో రెండు జట్లు అయిన ఢిల్లీ వర్సెస్ గుజరాత్ మధ్య నేడు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో రాత్రి 7.30కి మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 2024 సీజన్ లో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 6వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 8 వ స్థానంలో ఉంది. అయితే ఇంతవరకు ఢిల్లీ 8 మ్యాచ్ లు ఆడి 3 గెలిచింది. గుజరాత్ 8 మ్యాచ్ లు ఆడి 4 గెలిచింది. ఒక మ్యాచ్ వీరి మధ్య అంతరంగా ఉంది. గెలిస్తే గుజరాత్ దాటుతుంది. లేదంటే ఢిల్లీతో సమం అవుతుంది. ఇంతవరకు ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచ్ లు జరిగాయి. చెరో రెండేసి సార్లు విజయం సాధించాయి.


గుజరాత్ లో ఓపెనర్స్ సాయి సుదర్శన్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ శుభారంభాలు ఇవ్వడం లేదు. ఎవరో ఒకరు త్వరగా అయిపోతున్నారు. పవర్ ప్లే కూడా పూర్తి స్థాయిలో ఆడటం లేదు. కేన్ విలియమ్సన్, శరత్, విజయ్ శంకర్ ఎవరూ పూర్తి స్థాయిలో ఇంకా ఆడలేదు. టెయిల్ ఎండర్స్ రషీద్ ఖాన్, రాహుల్ తెవాటియా వీరు చివర్లో ఒకొక్కసారి మ్యాచ్ ని నిలబెడుతున్నారు. అంతా బౌలర్లపైనే ఆధారపడి ఒకొక్కసారి నడుస్తోంది.

Also Read: ఐపీఎల్ లో సెంచరీ చేసిన 8వ కెప్టెన్.. రుతురాజ్


ఢిల్లీ విషయానికి వస్తే, గుజరాత్ కన్నా దారుణంగా ఉంది. ఎన్నో అంచనాల మధ్య ఆడుతున్న డేవిడ్ వార్నర్ ఆట తీరు నానాటికి తీసికట్టు నాగంబొట్లుగా ఉంది. పట్టుమని 10 రన్స్ కూడా చేయడం లేదు. ప్రథ్వీ షా ఏవో నాలుగు షాట్లు ఆడి పవర్ ప్లే అవకుండానే అయిపోతున్నాడు.

జాక్ ఫ్రేజర్, రిషబ్ పంత్ ఇద్దరూ కాసేపు పోరాడి అవుట్ అయిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి. అంతేకాదు బౌలింగు చాలా వీక్ గా ఉంది. ప్రత్యర్థులు అవలీలగా ఆడుతున్నారు. ఈ లోపాలను సరిచేసుకుంటే గెలిచే అవకాశాలున్నాయని సీనియర్లు వ్యాక్యానిస్తున్నారు. మరి నేటి మ్యాచ్ లో ఎలా ఆడతారో వేచి చూడాల్సిందే.

Tags

Related News

Sarfraz Khan : గే తో టీమిండియా యంగ్ క్రికెటర్ అ**క్రమ సంబంధం?

World Cup 2027 : వన్డే వరల్డ్ కప్ 2027 వేదికలు ఖరారు…మొత్తం ఎన్ని మ్యాచ్ లు అంటే

Watch Video : చేతులు లేకుండానే క్రికెట్ ఆడుతున్నాడు.. సిక్స్ లు, ఫోర్లు కూడా బాదేస్తున్నాడు… వీడు మగాడ్రా బుజ్జి

Dream 11 Second Innings : డ్రీమ్ 11 ఇండియాలో బ్యాన్ అయిందా.. షాక్ లో ఐపీఎల్ అభిమానులు.. కేంద్రం క్లారిటీ ఇదే

Watch Video: పాపం ట్రాఫిక్ పోలీస్.. క్రికెట్ ఆడలేక.. బ్యాట్ అడుక్కుని మరీ… వీడియో వైరల్

Surya Kumar Yadav : సూర్య కుమార్ వాచ్ లో రాముడు, హనుమంతుడు… దీని ధర ఎంత అంటే

Big Stories

×