E-Paper
Advertisement

Sachin Tendulkar: సాయిబాబా జుట్టు లాగే ఉండేది…సచిన్ టెండూల్కర్ పై ట్రోలింగ్ !

Sachin Tendulkar: సాయిబాబా జుట్టు లాగే ఉండేది…సచిన్ టెండూల్కర్ పై ట్రోలింగ్ !
Advertisement

Sachin Tendulkar:  పుట్టపర్తి సాయిబాబా గురించి లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పుట్టపర్తి సాయిబాబా ( Puttaparthi Sai Baba) ఇచ్చిన పుస్తకం నాలో స్ఫూర్తిని నింపిందని వెల్లడించారు. తాను ఐదో తరగతి చదువుతున్న రోజుల్లోనే నా జుట్టు కూడా సాయిబాబా జుట్టు తరహాలోనే ఉండేదని తన ఫ్రెండ్స్ ట్రోలింగ్ చేసినట్లు వెల్లడించారు సచిన్ టెండుల్కర్. శ్రీ సత్య సాయి శతజయంతి ఉత్సవాలలో సచిన్ టెండుల్కర్ ఈ వ్యాఖ్యలు చేశారు. బాబాతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సచిన్, 5వ తరగతి చదివే రోజుల్లో నా జుట్టు కూడా సాయిబాబా జుట్టు లాగే ఉండేదని ఫ్రెండ్స్ చెప్పేవారని వివ‌రించారు. అందుకే హెయిర్ కట్ చేయించుకునేందుకు నేను ఇష్టపడలేదని స్ప‌ష్టం చేశారు. 90వ దశకంలో మొదటిసారి సత్యసాయిని కలిశానన్నారు. నా మనసులో ఉన్న ప్రశ్నలకు అడగకుండానే బాబా సమాధానం చెప్పేవారని వివ‌రించారు సచిన్ టెండూల్కర్ ( Sachin Tendulkar ).

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు పీఎం మోడీ

Advertisement

సత్యసాయి శత జయంతి ఉత్సవాల వేదికపై సచిన్ టెండూల్కర్, ఐశ్వర్య రాయ్ ను ఆప్యాయంగా పలకరించారు సీఎం చంద్రబాబు. ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ప్ర‌త్యేక ఆహ్వానితులుగా హ‌జ‌ర‌య్యారు. ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు అంటూ త‌న స్పీచ్ ను ప్రారంభించిన మోడీ, సాయిబాబా చేసిన ప‌నులు గుర్తు చేసుకున్నారు. ప్రేమకు ప్రతిరూపంగా సత్య సాయి తన జీవితం మొత్తం గడిపారని కొనియాడారు. మనకు భౌతికంగా పుట్టపర్తి సాయిబాబా లేకున్నప్పటికీ ఆయన ప్రేమ మాత్రం మనతోనే ఉంటుందని తెలిపారు మోడీ. సత్య సాయి బోధనాల ప్రభావం ఇండియా వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.  పుట్టపర్తి సాయిబాబా కు కోట్లాది మంది భక్తులు ఉన్నారని వివరించారు. సత్య సాయి ప్రేమ సూత్రాలు ఎందరినో కదిలించాయని గుర్తు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి మన ఇండియాలో జన్మించడం మన అదృష్టమని తెలిపారు. పుట్టపర్తి సాయిబాబా బోధనలు కోట్ల మందికి మార్గం చూపించినట్లు గుర్తు చేశారు. అందరినీ ప్రేమించు అదే సమయంలో అందరిని సేవించు అనే నినాదం ఇచ్చింది పుట్టపర్తి సాయిబాబా అని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోడీ. సత్యసాయి శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం నా అదృష్టం అన్నారు. భౌతికంగా సత్యసాయి మనతో లేకపోవచ్చు కానీ ఆయన అందించిన ప్రేమ, సేవా భావన కోట్లాది మందికి మార్గనిర్దేశనం అని వివ‌రించారు.

100 రూపాయల నాణెం, తపాలా బిళ్ల‌ల ఆవిష్క‌ర‌ణ‌

పుట్టపర్తి సాయిబాబా జయంతి ఉత్సవాల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సాయిబాబా స్మారకార్థం 100 రూపాయల నాణెంతో పాటు నాలుగు తపాలా బిల్లలను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరణ చేశారు.

Advertisement

Also Read: WTC : మరుగుజ్జు అన్నారు..WTC పాయింట్ల పట్టికలో మనోళ్లను మట్టి కరిపించాడు.. నాలుగో స్థానానికి దిగజారిన టీమిండియా

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×