Big Stories

SRH Vs MI Highlights: ఉప్పల్‌లో పరుగుల పండుగ.. రికార్డు ఛేజ్‌లో చతికిలపడ్డ ముంబై!

Sunrisers Hyderabad vs Mumbai Indians Live Updates
Sunrisers Hyderabad vs Mumbai Indians Live Updates

Sunrisers Hyderabad Vs Mumbai Indians IPL 2024 Highlights: హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. 278 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దగ్గర్లోకి వచ్చి ఓటమి చవిచూసింది. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి 31 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది.

- Advertisement -

రోహిత్ శర్మ (26,12 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34, బంతుల్లో),  తిలక్ వర్మ(64, 34 బంతుల్లో), టిమ్ డేవిడ్ (42*, 22 బంతుల్లో) రాణించినా ఫలితం దక్కలేదు.

- Advertisement -

అంతకుముందు బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసింది. క్లాసెన్(80*, 34 బంతుల్లో), హెడ్(62, 24 బంతుల్లో), అభిషేక్ శర్మ(63, 23 బంతుల్లో), మార్క్రమ్(42*, 28 బంతుల్లో) రాణించడంతో 3 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.

278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడింది. తొలి వికెట్‌కు కేవలం 3.2 ఓవర్లలోనే 56 పరుగులు జోడించారు. రోహిత్ శర్మ (26,12 బంతుల్లో), ఇషాన్ కిషన్ (34, బంతుల్లో) దూకుడుగా ఆడటంతో పవర్ ప్లేలో ముంబై ఇండియన్స్ రెండు వికెట్ల నష్టానికి 76 పరుగులు చేసింది.

ఆ తర్వాత తిలక్ వర్మ, నమన్ ధీర్ దూకుడుగా ఆడటంతో 8వ ఓవర్లోనే ముంబై 100 పరుగులకు చేరుకుంది. కమిన్స్ వేసిన 9వ ఓవర్లో ముంబై 17 పరుగులు రాబట్టింది. 11వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన తిలక్ వర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్లో 14 బంతుల్లో 30 పరుగులు చేసిన నమన్ ధీర్ అవుట్ అయ్యాడు. 64 పరుగులు చేసిన తిలక్ వర్మ కమిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు.

5 ఓవర్లలో 93 పరుగులు చేయాల్సి ఉండగా 16వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. భువనేశ్వర్ వేసిన 17వ ఓవర్లో 20 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్ చివరి బంతికి హార్ధిక్ పాండ్యా అవుట్ అయ్యాడు. దీంతో చివరి రెండు ఓవర్లో 54 పరుగులు చేయాల్సి వచ్చింది. 19వ ఓవర్లో కమిన్స్ కేవలం 7  పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో సన్ రైజర్స్ గెలుపు లాంఛనమైంది.  చివరి ఓవర్లో 47 పరుగులు చేయాల్సి ఉండగా కేవలం 15 పరుగుల మాత్రమే వచ్చాయి. దీంతో 31 పరుగుల తేడాతో హైదరాబాద్ ఈ సీజన్‌లో తొలి గెలుపు నమోదు చేసింది.

ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేవలం 4.1 ఓవర్లలో 45 పరుగులు జోడించారు. ముఖ్యంగా హెడ్ రెచ్చిపోయాడు. 3వ ఓవర్లో మఫాకా బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్ల సాయంతో 22 పరుగులు రాబట్టాడు.

11 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్.. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. కానీ హెడ్ జోరు మాత్రం తగ్గలేదు. 5వ ఓవర్లో చివరి మూడు బంతులను బౌండరీకి తరలించాడు. కేవలం 18 బంతుల్లో హెడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి హైదరాబాద్ వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది.

మరోవైపు పియూష్ చావ్లా వేసిన 7వ ఓవర్లో అభిషేక్ శర్మ 3 సిక్సర్తు బాదాడు. దీంతో 7వ ఓవర్లోనే హైదరాబాద్ 100 పరుగులు పూర్తి చేసుకుంది. 8వ ఓవర్లో హెడ్ భారీ షాట్‌కు యత్నించి కోయెట్జీ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగుల చేశాడు.

Also Read: IPL 2024: శుభ్‌మన్ గిల్‌కు రూ. 12 లక్షల జరిమానా.. రిపీట్ అయితే ఒక మ్యాచ్ వేటు..

10వ ఓవర్లో తొలి మూడు బంతులకు అభిషేక్ శర్మ 4,6, 6 కొట్టి కేవలం 16 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేసుకున్నాడు. నాలుగో బంతిని బౌండరీకి తరలించి సన్‌రైజర్స్ స్కోర్ 10 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

పియూష్ చావ్లా వేసిన 11వ ఓవర్లో అభిషేక్ శర్మ సిక్స్ కొట్టి అదే ఊపు మీద భారీ షాట్‌కు యత్నించి అవుట్ అయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో  63 పరుగులు చేశాడు.

12వ ఓవర్లో క్లాసెన్ సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 13వ ఓవర్లో బుమ్రా కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 7 పరుగులే వచ్చాయి. 14వ ఓవర్లో క్లాసెన్ సిక్స్ కొట్టడంతో 11 పరుగులు వచ్చాయి. బుమ్రా వేసిన 15వ ఓవర్లో క్లాసెన్ సిక్స్ కొట్టడంతో ఆ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. దీంతో సన్‌రైజర్స్ 200 పరుగులు పూర్తి చేసుకుంది.

16వ ఓవర్లో క్లాసెన్ రెచ్చిపోయాడు. మఫాకా వేసిన ఆ ఓవర్లో సిక్స్, ఫోర్ కొట్టాడు. చివరి బంతికి మార్క్రమ్ బౌండరీ కొట్టడంతో ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి.

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ కాళ్లు మొక్కిన అభిమాని.. చితక్కొట్టిన సెక్యూరిటీ గార్డులు..

17వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టిన క్లాసెన్ అదే ఓవర్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా ఆ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి.

బుమ్రా వేసిన 18వ ఓవర్లో ఫోర్ కొట్టిన క్లాసెన్ జట్టు స్కోర్‌ను 250 దాటించాడు. మొత్తంగా ఆ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి.

చివరి ఓవర్లో క్లాసెన్ 4,6,6 బాదడంతో ఆ ఓవర్లో 21 పరుగులు వచ్చాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News