Big Stories

Tillu Square: టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్ ఏముంది గురు.. ఈ సారి టిల్లుగానికి మరిన్ని సమస్యలు

Tillu square
Tillu square

Tillu Square Release Trailer: ఎంతో మంది సినీ ప్రియులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సినిమా ‘టిల్లు స్క్వేర్’. ఇందులోని కామెడీ, రొమాంటిక్ సీన్లను చూసేందుకు తెగ ఆరాటపడుతున్నారు ప్రేక్షకాభిమానులు. దానికి కారణం ఇదివరకు రిలీజ్ చేసిన ట్రైలరే. గతంలో రిలీజ్ అయిన టిల్లు స్క్వేర్ ట్రైలర్ సినీ ప్రియుల్ని మంత్రముగ్దులను చేసింది.

- Advertisement -

అందులోని బోల్డ్ సీన్స్ అందరినీ అట్రాక్ట్ చేశాయి. ముఖ్యంగా హీరో సిద్దు, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ మధ్య కెమిస్ట్రీ హాట్ హాట్‌గా ఉంది. ముద్దు సీన్లు.. హగ్గు సీన్లు ఓ రేంజ్‌లో ఉండటంతో మూవీపై ఫుల్ హైప్ ఏర్పడింది. అయితే ఈ మూవీ రేపు (మార్చి 29)న రిలీజ్ అవుతుండగా.. దీనికి సంబంధించిన రిలీజ్ ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు.

- Advertisement -

బుధవారం (మార్చి 27)న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించిన మూవీ యూనిట్.. ఈ ఈవెంట్‌లో టిల్లు స్క్వేర్ రిలీజ్ ట్రైలర్‌ను వదిలారు. ఈ ట్రైలర్ ప్రకారం.. టిల్లు ఈ సీక్వెల్ సినిమాలో కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అనుపమ పరమేశ్వరన్ పాత్ర వెనుక ఉన్న మిస్టరీ, లిల్లీ కూడా బాగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read: టిల్లు స్క్వేర్ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది భయ్యా.. సినిమా ఎలా ఉండబోతుందంటే?

ఈ స్క్రీన్‌ప్లేలో టిల్లు గానికి సంబంధించిన సీన్లను మాత్రమే ఎక్కువగా చూపించారు మేకర్స్. అలాగే టిల్లుతో పాటు అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కొత్త సీన్లను క్రియేట్ చేసి నవ్వించే క్షణాల్ని కూడా మేకర్స్ రూపొందించారు. ఈ సీక్వెల్ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్ మొదటి పార్ట్ కంటే చాలా బెటర్‌గా ఉన్నాయి. తుపాకులు, గ్యాంగ్‌స్టర్లతో ఈ సినిమా అద్భుతమైన ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతోంది.

శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి సంగీతం సమకూర్చగా, భీమ్స్ సిసిరోలియో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News